Naralokesh padayatra ,Yuvagalam
Naralokesh padayatra

ఆళ్లగడ్డలో హోరెత్తిన యువగళానికి జన ప్రభంజనం కడపజిల్లాలోకి ప్రవేశించిన యువగళం పాదయాత్ర ఉమ్మడికర్నూలు జిల్లాలో 40రోజులపాటు సాగిన యువగళం 45మండలాలు, 281 గ్రామాలమీదుగా 507 కి.మీ. సాగిన యాత్ర

ఆళ్లగడ్డ: ఉమ్మడి కర్నూలు జిల్లాలో 40రోజులపాటు అవిశ్రాంతంగా సాగిన యువగళం పాదయాత్ర మంగళవారం సాయంత్రం జమ్మలమడుగు నియోజకవర్గం సుద్దపల్లి వద్ద కడప జిల్లాలోకి ప్రవేశించింది. లోకేష్ కు జమ్మలమడుగు ఇన్చార్జి భూపేష్ రెడ్డి, కడప జిల్లా ముఖ్యనేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. భారీ గజమాలతో లోకేష్ ను సత్కరించిన కార్యకర్తలు, బాణసంచా పేలుస్తూ ఆనందంతో కేరింతలు కొట్టారు. అడగడుగునా యువనేతకు మహిళలు హారతులతో నీరాజనాలు పడుతూ పూలవర్షం కురిపించారు. కడప జిల్లా సరిహద్దుల్లో ఉమ్మడి కర్నూలు జిల్లా నాయకులు, కార్యకర్తలు యువనేతకు వీడ్కోలు పలికారు. తనను కుటుంబసభ్యుడి మాదిరిగా ఆదరించి ఆప్యాయత కనబర్చిన కర్నూలు ప్రజలకు లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు.  40రోజుల పాదయాత్రలో 45మండలాలు, 281 గ్రామాల మీదుగా 507 కి.మీ మేర యువగళం కొనసాగింది. తాగు,సాగునీటి కోసం కర్నూలు జిల్లా ప్రజలు పడుతున్న కష్టాలు కళ్లారా చూసి చలించిపోయాను, అధికారంలోకి వచ్చాక పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేసి రుణం తీర్చుకుంటానని లోకేష్ చెప్పారు. 108వరోజు యువగళం పాదయాత్ర ఆళ్లగడ్డ నియోజకవర్గంలో హోరెత్తింది. లోకేష్ ని చూసేందుకు ఆళ్లగడ్డ ప్రజలు భారీగా రోడ్లపైకి వచ్చారు. రోడ్డుకి ఇరువైపులా ఉన్న భవనాల పైకి ఎక్కి Nara Lokesh కి అభివాదం చేశారు. అందరినీ ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఆళ్లగడ్డ టౌన్ లో తాగునీటి సమస్య తో పాటు ఎదుర్కుంటున్న ఇతర సమస్యలను లోకేష్ దృష్టికి తెచ్చారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యల పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆళ్లగడ్డ పాతబస్టాండు సెంటర్ లో నిర్వహించిన బహిరంగసభకు పెద్దఎత్తున జనం హాజరయ్యారు. అనంతరం యువనేత లోకేష్ భూమా ఘాట్ ను సందర్శించారు. దివంగత నేతలు భూమా నాగిరెడ్డి, భూమా శోభా నాగిరెడ్డి స్మృతికి లోకేష్ నివాళులర్పించారు. ఆళ్లగడ్డతోపాటు కర్నూలు జిల్లాకు భూమా దంపతులు చేసిన సేవలను కొనియాడారు. వారి ఆశయాలను భూమా అఖిలప్రియ, విఖ్యాత్ రెడ్డిలను కొనసాగిస్తున్నారని అన్నారు. ఆళ్లగడ్డ అభివృద్ధి కోసం భూమా దంపతులు కన్న కలలను నెరవేస్తున్నారని చెప్పారు. భూమా కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని యువనేత లోకేష్ భరోసా ఇచ్చారు.

*టిడ్కో ఇళ్లు…పేదలగూటిపై టిడిపి చిత్తశుద్ధికి ఆనవాళ్లు!*

ఆళ్లగడ్డలో టిడ్కో ఇళ్లను సందర్శించిన లోకేష్ ముఖ్యమంత్రి జగన్, వైసిపి నేతలనుద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇవి ఆళ్లగడ్డలో పేదలకోసం మేం నిర్మించిన టిడ్కో ఇళ్లు. పేదలగూడుపై తెలుగుదేశం చిత్తశుద్ధికి ఆనవాళ్లు. ఇళ్లు కాదు ఊళ్లు కడుతున్నామన్న జగన్ నాలుగేళ్లలో కట్టింది 5ఇళ్లు కాగా, ఒక్క ఆళగడ్డలోనే 3వేలు, రాష్ట్రవ్యాప్తంగా మూడేళ్లలో 3.13లక్షల టిడ్కో ఇళ్లు కట్టిన ఘనత చంద్రబాబు గారిది. ఎవడికో పుట్టిన బిడ్డలను తమబిడ్డలని చెప్పుకోవడం అలవాటుపడిన వైసిపినేతలు మేం కట్టిన ఇళ్లకు సిగ్గులేకుండా రంగులు మాత్రం వేసుకున్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా ఇలాంటివి పట్టుమని పదిళ్లు కట్టామని చూపించే దమ్ముందా జగన్ రెడ్డీ అంటూ సూటిగా ప్రశ్నించారు.

కర్నూలు ప్రజల తాగునీటి కష్టాలు కదిలించాయి!

ఉమ్మడి కర్నూలు జిల్లాలో 40 రోజులు పాదయాత్ర చేశాను, 507 కి.మీ నడిచాను. ఇక్కడ వలసలు, బిందెలతో తాగునీటి కోసం పడుతున్న కష్టాలు నన్ను కదిలించాయి.  2014 లో ఉమ్మడి కర్నూలు జిల్లాలో టిడిపి కేవలం మూడు ఎమ్మెల్యే సీట్లు మాత్రమే గెలిచింది అయినా విమానాశ్రయం, మెగా సీడ్ పార్క్ , మెగా సోలార్ పార్క్, సిమెంట్ కంపెనీలు, మూడు వేల కోట్లతో సాగునీటి ప్రాజెక్టులు నిర్మించాం. 2024 లో అన్ని సీట్లలో టిడిపి ని గెలిపించండి అభివృద్ధి లో ఉమ్మడి కర్నూలు ని నంబర్1 చేస్తాం. అహోబిలం లక్ష్మి నరసింహ స్వామి, నవ నర్సింహులు కొలువైన ఆధ్యాత్మిక కేంద్రం ఆళ్లగడ్డ. బ్రిటిషు వారికి వ్యతిరేకంగా పోరాడిన మొట్టమొదటి సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. కరువుతో ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు అందరికి అన్నం పెట్టిన దానకర్ణుడు బుడ్డా వెంగళరెడ్డి. ఆళ్లగడ్డ శిల్పకళకు ప్రపంచం మొత్తం డిమాండ్ ఉంది. ఆళ్లగడ్డను అమ్మలా భావించి అభివృద్ధి చేసారు శోభా నాగిరెడ్డి, భూమా నాగిరెడ్డి. ఆళ్లగడ్డ ఆడపులి అఖిల ప్రియ మీ తరపున పోరాడుతుంది. ఎంతో చరిత్ర ఉన్న ఆళ్లగడ్డలో పాదయాత్ర చెయ్యడం నా అదృష్టం.

ఇప్పటివరకు ఎన్ని ఇళ్లు కట్టారో చెప్పే దమ్ముందా?

సెంటు స్థలాల గురించి గొప్పలు చెబుతున్నాడు జగన్. సెంటు స్థలాల పేరుతో 7 వేల కోట్ల ప్రజాధనం లూటీ చేసిన మీరు. సెంటు స్థలాలు సంసారానికి పనికి రావు అని వైసిపి ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అన్నప్పుడు జగన్. ఎన్నికల ముందు ఫ్రీ గా ఇళ్లు కట్టిస్తాం అని చెప్పి మోసం చేసాడు. మొన్న ఒక మహిళ ధర్మవరం ఎమ్మెల్యే కేటుగాడుని నిలదీసింది. ఎన్నికల ముందు ఇళ్లు మీరే కట్టి ఇస్తాను అన్నారు. ఇప్పుడు మీరే కట్టుకోండి అంటే ఎలా? అప్పు తీర్చడానికి మా జీవితం సరిపోదు అంది ఆ మహిళ. కేటుగాడికి కోపం వచ్చింది. కడితే అప్పు చేసి ఇళ్లు కట్టు లేకపోతే పట్టా వెనక్కి తీసుకుంటాం అని ఆ మహిళని తిట్టాడు. నేను జగన్ కి ఛాలెంజ్ చేస్తున్నా నువ్వు ఇప్పటి వరకూ కట్టిన ఇళ్లు ఎన్నో చెప్పే దమ్ముందా? సెంటు స్థలాల కోసం భూముల తీసుకున్న బీసీ,ఎస్సి,ఎస్టీ రైతులకు రూ.800 బకాయిలు పెట్టాడు.

వైసీపీ కు రిబ్బన్ కటింగ్ పిచ్చి పట్టుకుంది!

ఎన్నికల ముందు అప్పులు తెచ్చుకోవడానికి మరోసారి బందరు పోర్టుకి శంకుస్థాపన చేసాడు. చంద్రబాబు గారి హయాంలో ఒక కంపెనీకి పనులు అప్పజెప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వాళ్ళని తరిమేసాడు. నాలుగేళ్లు ప్యాలస్ లో నిద్రపోయి ఇప్పుడు బందరు పోర్టు కల నెరవేరింది అంటూ బిల్డప్ ఇస్తున్నాడు. కడప స్టీల్ ఫ్యాక్టరీకి రెండు సార్లు శంకుస్థాపన చేసాడు. అదానీ డేటా సెంటర్ కి  రెండోసారి శంకుస్థాపన చేసాడు. భోగాపురం విమానాశ్రయం కి మళ్లీ శంకుస్థాపన చేసాడు.కర్నూలు విమానాశ్రయం నిర్మించి బాబు గారు ప్రారంభిస్తే జగన్ వెళ్లి మళ్లీ ప్రారంభించి నేనే కట్టాను అంటున్నాడు.

తొలిఏడాదిలోనే జాబ్ నోటిఫికేషన్ ఇస్తాం

జగన్ యువత ఎప్పటికీ పేదరికంలో ఉండాలని కోరుకుంటున్నాడు. జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, 2.30 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు, ప్రతి ఏటా 6,500 పోలీసు ఉద్యోగాలు ఇవ్వలేదు, గ్రూప్2 లేదు, డిఎస్సి లేదు. ఉన్న అంబేద్కర్ స్టడీ సర్కిల్స్, బీసీ స్టడీ సర్కిల్స్ మూసేసాడు. జిఓ77 తీసుకొచ్చి ఉన్నత విద్య చదువుతున్న వారికీ ఫీజు రీయింబర్స్మెంట్  పధకం రద్దు చేసాడు.  టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడాది నోటిఫికేషన్ ఇస్తాం. అన్ని జిల్లాల్లో స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేస్తాం. దొంగబ్బాయ్ జగన్ మహిళల పసుపు, కుంకుమ చెరిపేస్తున్నాడు.  సంపూర్ణ మద్యపాన నిషేధం హామీ ఎం అయ్యింది? సొంత జే బ్రాండ్లు అమ్ముకొని వేల కోట్లు సంపాదిస్తున్నాడు. 45 ఏళ్లకే బీసీ, ఎస్సి, ఎస్టీ మహిళలకు పెన్షన్ అన్నాడు. పెన్షన్ దేవుడెరుగు పాపం మహిళలు దాచుకున్న అభయహస్తం డబ్బులు 2500 కోట్లు కొట్టేసాడు. ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మ ఒడి ఇస్తా అని చేసాడు.  అధికారంలోకి వచ్చాకా పన్నుల భారం తగ్గిస్తాం. నిత్యావసర సరుకుల ధరలు తగ్గిస్తాం.

రైతుల్లేని రాజ్యంగా మారుస్తున్నాడు!

జగన్  రైతులు లేని రాజ్యం తెస్తున్నాడు. జగన్  పరిపాలనలో పురుగుల మందులు పనిచేయవు. జగన్ బ్రాండ్లు ప్రెసిడెంట్ మెడల్, గోల్డ్ మెడల్, ఆంధ్రా గోల్డ్ కొడితే మాత్రం పురుగులు చస్తాయి. రైతుల్ని ఆదుకోకపోగా ఇప్పుడు మీటర్లు పెడుతున్నాడు. రాయలసీమ లో 1000 అడుగుల వరకూ బోర్లు వేస్తే కానీ నీళ్లు రావు…,మరి కరెంట్ బిల్లు ఎంత వస్తుందో ఆలోచించండి. మీటర్లు రాయలసీమ రైతులకు ఉరితాళ్లు. జగన్ ఉద్యోగస్తులను కూడా వేధించాడు.  వారంలో సీపీఎస్ రద్దు చేస్తా అని  200 వారాలు దాటినా సీపీఎస్ రద్దు చెయ్యలేదు.  పోలీసులకు 4 సరెండర్స్, 8 టిఎ, డీఏలు పెండింగ్ పెట్టాడు. ఆఖరికి జిపిఎఫ్ డబ్బులు కూడా లేపేశారు. మెడికల్ బిల్లులు కూడా ఇవ్వడం లేదు. పోలీసులు దాచుకున్న జిపిఎఫ్ డబ్బు సైతం కొట్టేసాడు. నేను ప్రతి రోజూ మాట్లాడుతుంటే భయపడి కొంత బకాయి తీర్చాడు. ఇంకా రావాల్సింది చాలా ఉంది.ఆఖరికి పెన్షనర్లకు పెన్షన్ ఇవ్వలేని చెత్త ప్రభుత్వం ఇది.

మైనారిటీలను వేధించి చంపుతున్నారు!

జగన్. దుల్హన్, రంజాన్ తోఫా వంటి పథకాలు రద్దు చేశాడు. మసీదు, ఈద్గా, ఖబర్ స్తాన్ ల అభివృద్ధి కోసం ఒక్క రూపాయి కేటాయించలేదు. ఆత్మహత్య చేసుకోవడం మైనార్టీలు మహా పాపంగా భావిస్తారు. జగన్  సీఎం అయ్యాక నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. కేవలం వైసీపీ నాయకుల వేధింపుల వల్లే వాళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పటి వరకూ దోషులకు శిక్షపడలేదు. నంద్యాల లో ఆర్టీఓ వేధింపులు తట్టుకోలేక కరిముల్లా ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు.ముగ్గురు పిల్లలతో కరిముల్లా భార్య పడుతున్న బాధలు జగన్ కి కనపడవు. ఇప్పటి వరకూ దోషులకు శిక్ష పడలేదు. ఇబ్రహీం అనే ముస్లిం నేతను నరసరావుపేటలో దారుణంగా నరికి చంపేశారు. పలమనేరులో మిస్బా అనే పదో తరగతి చెల్లిని వైసీపీ నాయకుడు సునీల్ టీసీ ఇప్పించి, బలవంతంగా వేధించడంతో, చదువుకు దూరం చేయడంతో ఆత్మహత్య చేసుకుంది. కర్నూలు లో హాజీరాని అత్యాచారం చేసి చంపేశారు. ఆమె తల్లి బేగంబీ కి కనీసం పోస్టుమార్టం రిపోర్ట్ ఇవ్వకుండా ప్రభుత్వం వేధించింది. ఇప్పటికీ ఆ తల్లికి న్యాయం జరగలేదు.  ఈ కుటుంబాలకు న్యాయం చెయ్యాలి అని పోరాటం చేసింది TDP. టీడీపీ హయాంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసాం. హజ్ యాత్రకు సహాయం చేసాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మైనార్టీల సంక్షేమం కోసం ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తాం.

ప్రశ్నించిన దళితులను పొట్టనబెట్టుకున్నారు!

జగన్  దళిత ద్రోహి. డాక్టర్ సుధాకర్ దగ్గర మొదలైంది. ఇప్పుడు డాక్టర్ అచ్చెన్న వరకూ వచ్చింది. ఇసుక అక్రమాలను ప్రశ్నించినందుకు వరప్రసాద్ కి గుండు కొట్టించారు, మాస్క్ పెట్టుకోలేదని కిరణ్ ని కొట్టి చంపారు, జగన్ లిక్కర్ స్కామ్ పై పోరాడినందుకు ఓం ప్రతాప్ కి చంపేసారు. పెద్దిరెడ్డి అవినీతి పై పోరాడినందుకు జడ్జ్ రామకృష్ణ ని హింసించారు. ఒక్క కేసులో అయినా దళితుల పై దాడి చేసిన వారికీ శిక్ష పడిందా? సుబ్రహ్మణ్యం అనే దళిత యువకుడిని చంపేసిన ఎమ్మెల్సీ అనంతబాబు కి సన్మానం చేసి ఉరేగించారు. వైసిపి పాలనలో దళితులను చంపడానికి జగన్ స్పెషల్ లైసెన్స్ ఇచ్చారు. దళితులకు ఇవ్వాల్సిన 27 సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేసాడు జగన్. టిడిపి గెలిచిన వెంటనే దళితుల 27 సంక్షేమ కార్యక్రమాలు తిరిగి ప్రారంభిస్తాం.

బిసిలకు రక్షణకు ప్రత్యేక చట్టం తెస్తాం!

బీసీలకు బ్యాక్ బోన్ విరిచాడు దొంగబ్బాయ్ జగన్. పేరుకే బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసారు. నిధులు కేటాయించలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 10 శాతం రిజర్వేషన్ కట్ చేసి 16,500 మందిని పదవులకు దూరం చేసాడు. బీసీలను అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 వేల అక్రమ కేసులు బీసీల పై పెట్టాడు. అందుకే బీసీల భద్రత కోసం ప్రత్యేక బీసీ రక్షణ చట్టం తీసుకొస్తాం.  బీసీలకు శాశ్వత కుల ధృవ పత్రాలు అందిస్తాం. బీసీలమని ఆరు నెలలకోసారి కుల ధృవపత్రాలు తీసుకోవాల్సిన దుస్థితి లేకుండా చేస్తాం. మొబైల్ లో ఒక్క బటన్ నొక్కగానే ఇంటికి బిసి కుల ధృవ పత్రాలు వచ్చే ఎర్పాటు చేస్తాం. అవి శాశ్వత కుల ధృవ పత్రాలు గా ఉపయోగపడేలా చట్టం లో మార్పులు తీసుకొస్తాం. దామాషా ప్రకారం బీసీ ఉపకులాలకు నిధులు, రుణాలు ఇస్తాం. రెడ్డి సోదరులు కూడా ఆలోచించండి. మీరు కోట్లు ఖర్చు చేసి జగన్ ని గెలిపించుకున్నారు. మీకు ఇప్పుడు వైసిపి లో కనీస గౌరవం దక్కుతుందా. ఒక్క టిడిపి లోనే అందరికి గౌరవం దక్కుతుంది.

ఆళ్లగడ్డలో లూటీ నాని లీలలు

ఆళ్లగడ్డను అద్భుతంగా అభివృద్ధి చేస్తాడని మీరు 2019 ఎన్నికల్లో గంగుల బ్రిజేంద్ర రెడ్డి అలియాస్ గంగుల నాని ని మీరు భారీ మెజారిటీ తో గెలిపించారు. అతనో చేతగాని ఎమ్మెల్యే. ఆళ్లగడ్డను అడ్డంగా దోచుకోవడం తప్ప చేసింది ఏమైనా ఉందా? అందుకే ఆయన పేరు మార్చాను. ఆయన గంగుల నాని కాదు లూటీ నాని. లూటీ నాని గారి స్వయంగా ఇంటినే సెటిల్మెంట్ డెన్ గా మార్చేసుకున్నాడు. ఆళ్లగడ్డ లో ఐ ట్యాక్స్ అంటే అందరికి బాగా తెలుసు. మహిళల్ని మనం గౌరవించాలని పేరు చెప్పడం లేదు. కానీ ఐ ట్యాక్స్ తో మీరు పడుతున్న ఇబ్బందులు అన్ని నాకు తెలుసు. ఇసుక, ఎర్రమట్టి, కాంట్రాక్టులు, లిక్కర్ దందా, అక్రమ బియ్యం రవాణా…ఇలా ప్రతి దాంట్లో లూటీ చేస్తూ లూటీ నాని దాదాపు 200 ఎకరాలు కొన్నాడని వైసిపి నాయకులు, కార్యకర్తలే మాట్లాడుకుంటున్నారు. లూటీ నాని అనుచరుడు రాఘవేంద్రారెడ్డి రామతీర్ధం కొండలను తవ్వేసి ఎర్రమట్టి అక్రమ రవాణా చేస్తున్నాడు. ఆళ్లగడ్డలో ఇసుక డిపో పెట్టారు. 8 వేల టన్నుల ఇసుకను దోచేసారు. లూటీ నాని అనుచరులు ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్నారు.  సిరువెళ్ల మండలంలో లూటీ నాని, ఆయన అనుచరులు భూకబ్జాలు, ల్యాండ్ సెటిల్మెంట్స్ కి పాల్పడుతున్నారు. ఇటీవల రైతులు పురుగుమందు డబ్బాలతో ఆందోళనకు దిగారు. బోయలకుంట్ల గ్రామంలో ఓ బ్రాహ్మణుడి భూమిని ని లాక్కొని రైతు భరోసా కేంద్రం కట్టారు. లూటీ నాని, అనుచరులు కలిసి ఆళ్లగడ్డను అక్రమ బియ్యం రవాణాకు అడ్డాగా మార్చేసారు. లూటీ నాని, అనుచరులు కలిసి మున్సిపాలిటీ సెస్ పేరుతో ప్రజల్ని దోపిడీ చేస్తున్నారు.

జగన్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?

జగన్ పాదయాత్రలో భాగంగా ఆళ్లగడ్డకు వచ్చినప్పుడు అనేక హామీలు ఇచ్చాడు. నియోజకవర్గంలో తాగునీటి సమస్య లేకుండా చేస్తానని హామీ ఇచ్చాడు. కేసి కెనాల్, తెలుగుగంగ నుండి చివరి ఆయకట్టు వరకూ రైతులకు నీరుఅందిస్తాం అని హామీ ఇచ్చాడు. ఇచ్చిన ఏ ఒక్క హామీ నిలబెట్టుకోలేదు. ఆళ్లగడ్డను అభివృద్ధి చేసింది టిడిపి. నియోజకవర్గాన్ని 2వేల కోట్లతో అభివృద్ధి చేసాం. సాగు, తాగునీటి ప్రాజెక్టులు, పేదలకు టిడ్కో ఇళ్లు, రోడ్ల విస్తరణ, గ్రామాల్లో సిసి రోడ్లు, స్కూల్ భవనాలు కట్టింది టిడిపి. నియోజకవర్గంలో రోడ్లు లేక ప్రజలు నరకయాతన పడుతున్నారు. ఆఖరికి రోడ్డు బాగుచెయ్యాలి అని రుద్రవరం మండలంలో రైతులు కోర్టులో కేసు వేసారంటే ఎంత దారుణమో అర్ధం చేసుకోండి. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే నియోజకవర్గంలో రోడ్లు వేస్తాం. ఆళ్లగడ్డ టౌన్ లో టిడిపి హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లు నాలుగేళ్లు అయినా లబ్దిదారులకు పంపిణీ చెయ్యలేదు.

రాజోలి నిర్వాసితులకు పరిహారం ఏమైంది?

కడప జిల్లా దువ్వూరు వద్ద రాజోలి జలాశయం నిర్మాణం కోసం జగన్ శంకుస్థాపన చేసారు. దీని వలన ఆళ్లగడ్డ నియోజకవర్గం చాగలమర్రి మండలం రాజోలి, గుట్లూరు గ్రామాల్లో 600 ఎకరాలు ముంపుకు గురి అవుతున్నాయి. ఒక్క పైసా పరిహారం ఇవ్వలేదు, పనులు ప్రారంభించలేదు.  కుందూ విస్తరణ పనులు నిధులు లేక బిల్లులు ఇవ్వకపోవడంతో మధ్యలోనే వదిలేశారు. ఇప్పటికే తవ్విన మట్టిని వైసీపీ నాయకులు అక్రమంగా తరలించి సొమ్ము చేసుకున్నారు. తొల్లవాగు రిజర్వాయరు నుంచి ఆళ్లగడ్డ పట్టణ సహా ఆళ్లగడ్డ, రుద్రవరం మండలాల్లో 41 గ్రామాలకు తాగునీరు అందించే రక్షిత మంచినీటి పథకానికి నిర్వహణ నిధులు లేక ఆళ్లగడ్డకు తప్పా ఒక్క గ్రామానికి తాగునీరు ఇవ్వడం లేదు.  సిరువెళ్లలో టీడీపీ హయాంలో రూ.2 కోట్లతో ప్రభుత్వ ఉర్దూ ఉన్నత పాఠశాల పక్కా భవనాల నిర్మాణం ప్రారంభిస్తే  వైసీపీ వచ్చాక నాలుగేళ్లు అయినా పూర్తి చేయలేదు.

అధికారంలోకి వచ్చిన వెంటనే కెసి కెనాల్ లైనింగ్ పనులు

ఆళ్లగడ్డ నియోజకవర్గం ప్రధాన నీటి వనరు కేసీ కాలువ. సీసీ లైనింగ్ పనులు చేయకపోవడంతో చివరి ఆయకట్టుకు సాగునీరు అందడం లేదు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పూర్తి చేస్తాం. అళ్లగడ్డలో శిల్పకళ మ్యూజియం రూ.2.13 కోట్లతో టీడీపీ ప్రభుత్వంలో చేపడితే ఈ ప్రభుత్వం ఆపేసింది. ఇండోర్ స్టేడియం నిర్మాణం రూ.1.25 కోట్లతో చేపడితే ఆపేశారు. అర్జునాపురం రోడ్డు కోసం రూ.1.25 కోట్లు టీడీపీ ప్రభుత్వం మంజూరు ఈ ప్రభుత్వం చేపట్టలేదు. వైసిపి ప్రభుత్వం ఆపేసిన అన్ని పనులు పూర్తి చేస్తాం. టిడిపి హయాంలో 112 కోట్లతో ప్రతి ఇంటికి తాగునీటి కుళాయి ఏర్పాటు చెయ్యాలి అనే ఉద్దేశంతో పనులు ప్రారంభిస్తే వైసిపి ఆపేసింది.  టిడిపి వచ్చిన వెంటనే ప్రతి ఇంటికి తాగునీటి కుళాయి ఏర్పాటు చేస్తాం. ఆళ్లగడ్డ మున్సిపాలిటీ ని అభివృద్ధి చెయ్యడం తో పాటు ప్రభుత్వం ఆసుపత్రిని అభివృద్ధి చేస్తాం. ఆళ్లగడ్డ నియోజకవర్గం లో పేదల కోసం టిడిపి హయాంలో 3 వేల ఇళ్లు కడితే వాటిని లబ్దిదారులకు ఇవ్వకుండా వేధించింది జగన్ ప్రభుత్వం. ఇప్పుడు సిగ్గులేకుండా టిడిపి హయాంలో నిర్మించిన ఇళ్లకి వైసిపి రంగులు వేసుకుంటున్నారు.

టిడిపి కేడర్ ను వేధించే వాళ్లను వదలం

త్వరలోనే మన ఆడపులి బయటకు వస్తుంది. ఎన్ని ఇబ్బందులు పెట్టినా అఖిల ప్రియ మీ కోసం పోరాడుతూనే ఉంటుంది. మీ తరపున పోరాడుతున్న విఖ్యాత్ రెడ్డి మీద కేసులు పెట్టి వేధించారు. టిడిపి నాయకుల్ని, కార్యకర్తల్ని వేధించిన ఏ ఒక్కరిని వదలం. అందరికి వడ్డితో సహా చెల్లిస్తాం. ఆళ్లగడ్డ లో ఉన్నా అమెరికాలో ఉన్నా తీసుకొచ్చి లోపలేస్తాం. 2019 లో ఉమ్మడి కర్నూలు ప్రజలు 14 ఎమ్మెల్యే సీట్లు, రెండు ఎంపీ సీట్లు వైసిపి కి ఇచ్చారు. కనీసం ఒక్క అభివృద్ధి కార్యక్రమం అయినా చేసారా? టిడిపి చేసిన దాంట్లో 10 శాతం కూడా చెయ్యలేదు.  కర్నూలు కి టిడిపి చేసింది ఏంటో? వైసిపి నాయకులు చేసింది ఏంటో చర్చకు సిద్ధం అని సవాల్ చేస్తే వైసిపి వాళ్లు పారిపోయారు.

లోకేష్ ను కలిసిన ఆళ్లగడ్డ న్యాయవాదులు

ఆళ్లగడ్డలో శివారు క్యాంప్ సైట్ లో న్యాయవాదులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. శ్రీబాగ్ ఒడంబడికను గౌరవిస్తూ కర్నూలులో హైకోర్టు బెంచి ఏర్పాటుచేయాలి. ఆళ్లగడ్డలో 5వ అడిషనల్ జిల్లాజడ్జి కోర్టు భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలి. ఆళ్లగడ్డలో ఉన్న జడ్జిల నివాస భవనాలకు నిధులు మంజూరు చేయాలి. ఆళ్లగడ్డ కోర్టు ఆవరణలో కక్షిదారులకు టాయ్ లెట్లు నిర్మాణం చేపట్టాలి. ఆళ్లగడ్డలో బార్ అసోసియేషన్ భవననిర్మాణానికి నిధులు మంజూరు చేయాలి. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన న్యాయవాదులకు ఇళ్లస్థలాలు, ఇళ్లు మంజూరు చేయాలి. జూనియర్ న్యాయవాదుల వృత్తినైపుణ్యతకు శిక్షణా కేంద్రాలు, గ్రంథాలయం ఏర్పాటుచేయాలి. జూనియర్ న్యాయవాదులు వృత్తిలో స్థిరపడేవరకు ఆర్థికసాయం అందించాలి. న్యాయవాదులపై దాడుల నివారణకు ప్రత్యేక రక్షణ చట్టం రూపొందించాలి. న్యాయవాదుల సంక్షేమనిధి అర్హతల్లో 35సంవత్సరాల వయసు నిబంధనను సడలించి, న్యాయవాదులందరికీ ఉపకరించేలా చర్యలు తీసుకోవాలి. న్యాయవాదుల ఆరోగ్యభద్రతకు పరిమితిలేని హెల్త్ కార్డులు మంజూరు చేయాలి.

నారా లోకేష్ స్పందిస్తూ…

తెలుగుదేశం పార్టీకి న్యాయవాదులు, న్యాయవ్యవస్థపై అపారమైన గౌరవమర్యాదలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి మాదిరి సుప్రీం కోర్టులో ఒకమాట, బయట మరొకమాట చెప్పం. కర్నూలులో హైకోర్టు బెంచి ఏర్పాటుచేసి తీరుతాం. తమకు వ్యతిరేకంగా తీర్పులిచ్చిన న్యాయమూర్తులపై ప్రభుత్వంలో కీలకస్థానాల్లో ఉన్నవారే సోషల్ మీడియాలో విషంచిమ్మడం దారుణం. రాష్ట్ర హైకోర్టులో కనీసం కప్పు కాఫీ దొరకడం లేదని ఒక న్యాయమూర్తి వ్యాఖ్యానించడం ప్రభుత్వానికి ఈ వ్యవస్థపై ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో అర్థమవుతోంది. న్యాయమూర్తులు, న్యాయవాదులపై అమర్యాదగా ప్రవర్తించిన వారిపై ఉక్కుపాదం మోపుతాం.  టిడిపి అధికారంలోకి రావగానే అద్దెభవనాల్లో నడుస్తున్న కోర్టులన్నింటికీ సొంతభవనాల నిర్మాణం చేపడతాం. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన న్యాయవాదులకు ఇళ్లస్థలాలు మంజూరు చేస్తాం. జూనియర్ న్యాయవాదులకు నైపుణ్య శిక్షణాకేంద్రాలు, గ్రంథాలయాలు ఏర్పాటుచేస్తాం.

యువనేతను కలిసిన బుడగ/బేడ జంగాల ప్రతినిధులు

ఆళ్లగడ్డలోని భూమా బాలిరెడ్డి నగర్ లో ఎపి బుడగ/బేడ జంగాల హక్కుల పోరాట సమితి నాయకులు యువనేతను లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. 2008 వరకు మాకు ఎస్సీ సర్టిఫికేట్లు ఇచ్చారు. బోగస్ సర్టిఫికేట్లు జారీ నెపంతో 144 జీవో తెచ్చి 2008లో సర్టిఫికేట్లు నిలిపేశారు.  దీనిపై గతంలో చంద్రబాబుగారు జేసీ కమిషన్ ను ఏర్పాటు చేసి, వారు ఇచ్చిన నివేదికను కేబినెట్ లో ఆమోదించి కేంద్రానికి పంపారు. వైసిపి ప్రభుత్వం వచ్చాక మళ్లీ జెసి శర్మ కమిషన్ ను నియమిస్తూ జిఓ 104 విడుదల చేసింది. ఈ కమిటీ 2020లో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. కానీ అప్పటినుంచి ప్రస్తుత ప్రభుత్వం బహిర్గతం చేయకుండా అసెంబ్లీలో ఆమోదానికి పెట్టకుండా నిర్లక్ష్యం చేస్తూ వస్తోంది. టిడిపి అధికారంలోకి వచ్చాక మాకు న్యాయం చేయాలి.

నారా లోకేష్ మాట్లాడుతూ…

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఏ సామాజికవర్గం ప్రశాంతంగా జీవనం సాగించడం ఇష్టంలేదు. జెసి శర్మ కమిషన్ నివేదిక ఇచ్చి మూడేళ్లయినా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు?అధికారంలోకి వచ్చాక బేడ/బుడగ జంగాలకు న్యాయం చేస్తాం. దామాషా ప్రకారం నిధులు కేటాయించి, మీ అభివృద్ధికి చేయూతనిస్తాం.

యువనేత లోకేష్ ను కలిసిన వడ్రంగి వృత్తికారులు

ఆళ్లగడ్డ 4రోడ్ల సర్కిల్ లో శ్రీలక్ష్మీ నరసింహా వడ్రంగి చేతివృత్తుల సంఘం ప్రతినిధులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. ఆళ్లగడ్డ పట్టణంలో 600 కుటుంబాలు వండ్రంగి చేతివృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాయి. కార్పెంటర్లకు ప్రత్యేక క్లస్టర్ ఏర్పాటు చేసే, అధునాతన యంత్రాల కొనుగోలుకు సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలి. కార్పెంటర్ ఏ వస్తువు కొన్నా వాటిపై వచ్చే సెస్ భవన నిర్మాణ బోర్డుకు వెళ్తోంది.  కానీ సంక్షేమ బోర్డు నుంచి మాకు ఎటువంటి సహాయం అందడం లేదు. ఆ సెస్ ను కార్పెంటర్ కుటుంబాలకు మాత్రమే చెందేలా చేయాలి.

నారా లోకేష్ మాట్లాడుతూ…

భవన నిర్మాణరంగానికి సంబంధించిన అన్నివర్గాలకు ఉపయోగపడేలా టిడిపి ప్రభుత్వం భవన నిర్మాణ సంక్షేమ బోర్డును ఏర్పాటుచేసింది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక సంక్షేమ బోర్డులోని రూ.2వేల కోట్లరూపాయలను దారిమళ్లించారు. ఈ ప్రభుత్వం వచ్చాక కార్మికులకు ఒక్క క్లెయిమ్ కూడా మంజూరు చేయలేదు. టీడీపీ హయాంలో ఆదరణ ద్వారా చేతివృత్తుల వారికి రూ.964 కోట్ల విలువ చేసే పరికరాలు అందించాం. ఆదరణ-2 పథకంలో వృత్తిపనివారి కోసం కొనుగోలుచేసిన పరికరాలను కూడా ఈ ప్రభుత్వం గోడౌన్లలో పాడుబెడుతోంది. వడ్రంగి చేతి వృత్తుల వారికి కామన్ వర్క్ షెడ్లు నిర్మించి, సబ్సిడీపై పరికరాలు అందజేస్తాం. భవననిర్మాణ సంక్షేమ బోర్డు ద్వారా వడ్రంగులకు ఆర్థిక సాయం అందిస్తాం.

లోకేష్ ను కలిసిన వాల్మీకి సామాజికవర్గీయులు

ఆళ్లగడ్డ గవర్నమెంట్ కాలేజివద్ద వాల్మీకి సామాజికవర్గీయులు యువనేత లోకేష్ ను కలిసి వినపత్రం సమర్పించారు. వాల్మీకీలకు ఎలాంటి కుల వృత్తీ లేదు. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వాల్మీకిలను ఎస్టీ జాబితాలో చేర్చాలి. టీడీపీ ప్రభుత్వంలో వాల్మీకీ కార్పొరేషన్ కు నిధులు కేటాయించి, మా అభివృద్ధికి పాటుపడింది. ప్రస్తుత ప్రభుత్వం కార్పొరేషన్ ను ఏర్పాటు చేసినా నిధులు కేటాయించలేదు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో 35 వేల మంది వాల్మీకి ఓటర్లు ఉన్నారు. మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాల్మీకీలకు కమ్యూనిటీ భవనానికి 30 సెంట్ల స్థలం కేటాయించి, నిధులు మంజూరు చేయాలి.

నారా లోకేష్ మాట్లాడుతూ…

కుర్చీల్లేని కార్పొరేషన్లతో జగన్ బిసి ఉపకులాలకు తీరని అన్యాయం చేశారు. బిసిలకు చెందాల్సిన రూ.75,760 కోట్ల సబ్ ప్లాన్ నిధులను దారిమళ్లించిన బిసిల ద్రోహి జగన్ రెడ్డి. 56 కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు..కానీ ఒక్కరికైనా రుణం ఇచ్చారా.? కనీసం కార్పొరేషన్ చైర్మన్లకు కూడా జీతాలు ఇచ్చే స్థితిలో ఈ ప్రభుత్వం లేదు.  టీడీపీ ప్రభుత్వం రాగానే దామాషా ప్రకారం నిధులు కేటాయించి ఖర్చు చేస్తాం.  సత్యపాల్ కమిటీ నివేదిక ఆధారంగా వాల్మీకిలకు న్యాయం చేస్తాం. వాల్మీకిలు అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో కమ్యూనిటీ హాళ్లు నిర్మిస్తాం.

యువనేత లోకేష్ ను కలిసిన క్రిస్టియన్లు

ఆళ్లగడ్డసీఎస్ఐ చర్చి వద్ద క్రిస్టియన్లు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. ఆళ్లగడ్డలో 2000 వేల క్రిస్టియన్ కుటుంబాలు, 24 చర్చిలు ఉన్నాయి. ఇక్కడ క్రైస్తవుల కోసం ఒక కమ్యూనిటీ హాలు నిర్మించాలి. క్రైస్తవులకు ప్రత్యేకంగా స్మశానవాటిక ఏర్పాటు చేయాలి. క్రైస్తవ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి ఉద్యోగాలు కల్పించాలి. క్రైస్తవుల్లో ఇళ్లు లేని వారికి ఇళ్లు నిర్మించి ఇవ్వాలి. గతంలో వృద్ధ దంపతులిద్దరికీ పెన్షన్ వచ్చేది..కానీ ఈ ప్రభుత్వంలో అందలేదు. క్రైస్తవులకు చట్టసభల్లో ప్రాధాన్యతనిచ్చి,  నామినేటెడ్ పదవులు కేటాయించాలి.

నారా లోకేష్ ను కలిసిన పాతకందుకూరు గ్రామస్తులు

ఆళ్లగడ్డ నియోజకవర్గం పాతకందుకూరు గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. పాత కందుకూరులో గతంలో నిర్మించిన నీటి ట్యాంక్ మూడేళ్లక్రితం పాడైపోయింది. దీంతో తాగునీటికి ఇబ్బందిపడుతున్నాము… మీ ప్రభుత్వం వచ్చాక నీటి ట్యాంకులు నిర్మించి తాగునీరు అందించండి. ఇటీవల కురిసిన అకాల వర్షాలు, వడగండ్ల వల్ల మొక్కజొన్న, మినుమ, నువ్వు పంటలు బాగా దెబ్బతిన్నాయి. కానీ ప్రభుత్వం రైతులకు పరిహారం ఇవ్వలేదు. గత ప్రభుత్వంలో ట్రాక్టర్లు, యంత్రాలను సబ్సీడీలో ఇచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చాక రైతులకు యంత్రాల కొనుగోలు, కొరముట్లకు సబ్సీడీ అందించడం లేదు.  మీరు మళ్లీ అధికారంలోకి వచ్చాక రైతాంగాన్ని ఆదుకోండి.

నారా లోకేష్ మాట్లాడుతూ…

ప్రజల తాగునీటి కష్టాలు తీర్చేందుకు కేంద్రం ఇచ్చే నిధులను కూడా వినియోగించుకోలేని దద్దమ్మ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి. జల్ జీవన్ మిషన్ అమలులోనూ రాష్ట్రం 17వ స్థానంలో ఉన్నట్లు కేంద్రం చెప్పడమే ఇందుకు నిదర్శనం. టీడీపీ అధికారంలోకి రాగానే వాటర్ గ్రిడ్ ఏర్పాటుద్వారా ఇంటింటికీ తాగునీటి కుళాయి అందజేస్తాం. రూ.4 వేల కోట్లతో ప్రకృతి విపత్తుల నిధిని కేటాయించి, అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకుంటామని జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీ ఏమైంది? అకాలవర్షాల కారణంగా పంటలను పరిశీలించేందుకు ముఖ్యమంత్రిగానీ, అధికారులు కన్నెత్తి చూడలేదు. అధికారంలోకి రాగానే గతంలో రైతుల సంక్షేమం కోసం అమలుచేసిన పథకాలన్నీ పునరుద్దరిస్తాం.

నారా లోకేష్ ను కలిసిన సుద్ధపల్లి గ్రామప్రజలు

జమ్మలమడుగు నియోజకవర్గం సుద్దపల్లికి చెందిన రైతులు, కార్మికులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. మా గ్రామంలో హిందు, ముస్లింలకు స్మశానవాటికలు లేక రోడ్ల వెంట శవాలు పూడ్చుకుంటున్నాము. మీరు అధికారంలోకి వచ్చాక స్మశానాలు ఏర్పాటు చేసి కాంపౌండ్ వాల్ నిర్మించాలి. క్రైస్తవుల స్మశాన వాటిక కబ్జాకు గురవుతోంది..కాబట్టి దానికి కూడా ప్రహరీ నిర్మించాలి. కుందూనది మా గ్రామానికి సమీపంలో ఉంది… లిఫ్ట్ ఏర్పాటు చేసి రైతులకు సాగునీరు ఇవ్వాలి. సుద్ధపల్లి నుండి బోదనం వద్దనున్న ఎన్.హెచ్-18 వరకు తారు రోడ్డు వేయాలి. గ్రామంలో అప్పర్ ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు ఆట స్థలం మంజూరు చేయాలి.

నారా లోకేష్ మాట్లాడుతూ…

జగన్ అధికారంలోకి వచ్చాక వైసీపీ కబ్జా కోరులు ప్రభుత్వ భూములతో పాటు శ్మశాలను కూడా వదలకుండా కబ్జాలకు పాల్పడుతున్నారు. సుద్ధపల్లి గ్రామంలో హిందూ, ముస్లింలకు శ్మశానాలకు స్థలాలు కేటాయిస్తాం.  క్రైస్తవ స్మశానవాటిక ఆక్రమణలకు గురికాకుండా ప్రహరీగోడ నిర్మిస్తాం. టిడిపి ప్రభుత్వ హయాంలో గ్రామీణ ప్రాంతాల్లో 25వేల కి.మీ. సిసి రోడ్లు వేశాం.  ఈ ప్రభుత్వం వచ్చాక రోడ్లపై తట్ట మట్టివేసిన పాపాన పోలేదు. జగన్ దివాలాకోరు ప్రభుత్వాన్ని చూసి రోడ్లు వేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. సుద్ధపల్లి నుండి బోదనం వద్దనున్న ఎన్.హెచ్-18 వరకు తారు రోడ్డు నిర్మిస్తాం.

Tagged#LokeshPadaYatra#Padayatra#YuvaGalamLokesh#YuvaGalam#NaraLokeshPadaYatra#NaraLokesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *