Nara lokesh padayatra ,,yuvagalam

 

Nara lokesh padayatra ,,yuvagalam

బద్వేలులో జనం సంద్రంగా మారిన యువగళం దారిపొడవునా యువనేతకు అపూర్వ స్వాగతం

బద్వేలులో బహిరంగసభకు పోటెత్తిన జనసందోహం నేడు ఉమ్మడి నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించనున్న పాదయాత్ర

బద్వేలు: యువనేత Naralokesh చేపట్టిన యువగళం పాదయాత్రకు బద్వేలులో జనం పోటెత్తారు. 124వరోజు యువగళం పాదయాత్ర బద్వేలు విద్యానగర్ నుంచి ప్రారంభమైంది. దారిపొడవునా జనం రోడ్లవెంట నిలబడి యువనేతకు అభివాదం చేస్తూ స్వాగతించారు. మహిళలు, యువకులు, వృద్ధులు, టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు యువనేతకు ఘనస్వాగతం పలికారు. భారీ గజమాలలతో యువనేతను సత్కరించి, బాణాసంచా, డప్పుల శబ్ధాలతో బద్వేలు పట్టణాన్ని హోరెత్తించారు. వివిధ వర్గాల ప్రజలు యువనేతకు ఎదురేగి తాము ఎదుర్కొంటున్న సమస్యలను చెప్పాకరు. ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న భవనాల పైకి ఎక్కి లోకేష్ కి అభివాదం చేశారు. అందరినీ ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కరెంట్ బిల్లులు విపరీతంగా పెంచేశారని, మే నెల బిల్లులు చూసి షాక్ తిన్నామని మహిళలు ఆవేదన చెందారు. ఫ్యాన్ పర్మినెంట్ గా స్విచ్ ఆఫ్ చేసి సైకిల్ పాలన తెచ్చుకుంటేనే కరెంటు చార్జీల భారం తగ్గుతుందని చెప్పారు. తనని కలవడానికి వచ్చిన వారందరితో లోకేష్ ఫోటోలు దిగారు. బద్వేలు ఆర్టీసి బస్టాండు వద్ద నిర్వహించిన బహిరంగసభకు కనీవినీ ఎరుగని రీతిలో స్పందన లభించింది. బస్టాండ్ కూడలి నుండి  సిద్ధవటం రోడ్, పోరుమామిళ్ల రోడ్, నెల్లూరు రోడ్లను ముంచెత్తిన రోడ్లన్నీ జనప్రవాహాన్ని తలపించాయి. ఎటు చూసినా రెండు కిలోమీటర్ల మేర ప్రజలు బారులు తీరారు. పాదయాత్ర దారిలో బద్వేలు పట్టణ ప్రముఖులు, ఎస్సీలు, రైతులు వివిధ గ్రామాల ప్రజలు యువనేతను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. 124వరోజున యువనేత లోకేష్ 15 కి.మీ. దూరం పాదయాత్ర చేశారు. ఇప్పటివరకు యువగళం పాదయాత్ర 1584.1 కి.మీ. మేర పూర్తయింది. ఇదిలావుండగా 124రోజులపాటు రాయలసీమలో హోరెత్తించిన యువగళం పాదయాత్ర మంగళవారం నాడు ఉమ్మడి నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించనుంది.

యువనేత ఎదుట వ్యక్తమైన సమస్యలు:

స్థలం ఆక్రమణకు వైసీపీ నేతలు దాడి చేశారు -బాలాకుల లక్ష్మీదేవి, బద్వేలు

నా భర్త పదిహేనేళ్ల క్రితం చనిపోయారు. అప్పటి నుండి నేను పాడిని పెట్టుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నా. నా ఇంటికి పక్కనే స్థలం ఉంది. దానితో పాటు నా స్థలాన్ని కూడా కబ్జా చేయాలని వైసీపీ నేతలు కుట్ర పన్నారు. రెండు నెలల క్రితం పట్టపగలే ఎవరూ లేని సమయంలో సుమారు 150 మంది వైసీపీ నేతలు నా ఇంటిపై దాడి చేసి, ఇంట్లో సామాన్లన్నీ బయట పడేసి బీభత్సం సృష్టించారు. ఇళ్లు ఖాళీ చేసి పోకపోతే చంపేస్తామని బెదిరించారు. దీంతో పోలీసులను ఆశ్రయించా. అయినా వైసీపీ నేతలు నన్ను ఇప్పటికీ ఇబ్బందులు పెడుతూనే ఉన్నారు. పాలతో వచ్చిన డబ్బులతోనే ఇద్దరు పిల్లలను చదివిస్తున్నా.

పెన్షన్ తీసేశారు -బి.శంకరయ్య, బద్వేలు

నాకు వికలాంగుడి కింద పెన్షన్ వస్తోంది. మూడున్నరేళ్ల క్రితం పెన్షన్ తీసేశారు. సచివాలయంలో అడిగితే ఆధార్ కార్డు తీసుకు రమ్మన్నారు. నా ఆధార్ కార్డు తిరుపతిలో పోయింది. పెన్షన్ ఇచ్చేటప్పుడు నా ఐడీ నెంబరుతో తంబు వేస్తే మాత్రం నా పేరు వస్తోంది. అయినా ఆధార్ కార్డు చూపిస్తేనే పెన్షన్ ఇస్తామని వాలంటీర్ చెప్పారు. నేను TDP సానుభూతిపరున్ని..అందుకే నా పెన్షన్ తొలగించారు.

నాది మిషన్ రాయలసీమ నాలో ప్రవహిస్తుంది సీమరక్తమేరా సిల్లీ ఫెలోస్!

సీమగడ్డపై చరిత్ర సృష్టించిన యువగళం పాదయాత్ర

అక్కున చేర్చుకున్న రాయలసీమ ప్రజలకు వందనాలు రాయలసీమకు ఎవరేం చేశారో బహిరంగచర్చకు సవాల్ బద్వేలు సభలో విరుచుకుపడిన నారా లోకేష్

బద్వేలు: లోకేష్ ది మిషన్ రాయలసీమ.. నాలో ఉన్నదీ సీమ రక్తమేరా సిల్లీ ఫెలోస్, సవాల్ చెయ్యాలంటే హిస్టరీ ఉండాలి…నన్ను అడ్డుకోవాలంటే దమ్ముండాలి, ఆ రెండూ వైసిపి నాయకులకు లేవని యువనేత నారా లోకేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బద్వేలులో నిర్వహించిన బ్రహ్మాండమైన బహిరంగసభలో యువనేత లోకేష్ ప్రసంగిస్తూ… క్లైమోర్ మైన్లకే భయపడని కుటుంబం మాది కోడికత్తి బ్యాచ్ కి భయపడతామా? 124 రోజులు, 44 నియోజకవర్గాలు, 1587 కిలోమీటర్లు. సీమ గడ్డ పై యువగళం ఒక హిస్టరీ. సీమ పవర్ ఏంటో సైకో ప్రభుత్వానికి చూపించాం. సీమలో నన్ను ఆశీర్వదించిన ప్రజలందరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. 

రాయలసీమ సత్తా చాటుతాం

బద్వేల్ జనసంద్రంగా మారింది. మట్లి రాజులు ఏలిన నేల బద్వేల్. మహానగరం అయ్యే సత్తా బద్వేలు కి ఉంది అని బ్రహ్మం గారు చెప్పారు. శ్రీ కొండ గోపాల స్వామి దేవాలయం, చెన్నకేశవస్వామి దేవాలయం, కాశిరెడ్డి నాయన ఆలయం ఉన్న నేల బద్వేల్. బద్వేల్ పెద్దాయన బిజి వేముల వీరా రెడ్డి గారు. కడప జిల్లాలో పసుపు జెండా ఎగరేసిన మొనగాడు. ఆయన రికార్డులు కొట్టే వారు ఎవరూ లేరు.  ఘన చరిత్ర ఉన్న బద్వేల్ గడ్డ పై పాదయాత్ర చెయ్యడం నా అదృష్టం. 2019 లో జగన్ కి ఇచ్చిన మ్యాండేట్ 2024 లో మాకు ఇవ్వండి. జగన్ కి ఇచ్చిన 49 సీట్లు మాకు ఇవ్వండి. సీమ సత్తా ఏంటో దేశానికి చూపిస్తాం. సీమకు ఎం చేస్తామో మిషన్ రాయలసీమలో చెప్పాము. మిషన్ రాయలసీమ అమలు చేసి సీమ ని నిలబెడతాం. ఒకవేళ ఇచ్చిన హామీ నిలబెట్టుకోకపోతే ఇదే బద్వేల్ సెంటర్ లో చొక్కా పట్టుకొని నిలదీయండి. లోకేష్ ది అంబేద్కరిజం లోకేష్ ప్రజల్లో ఉంటాడు

మహిళలనూ మోసగించారు

జగన్ మహిళల్ని నమ్మించి ముంచేసాడు. సంపూర్ణ మద్యపాన నిషేధం తర్వాతే ఓట్లు అడుగుతా అన్నాడు. ఇప్పుడు ఎం మొఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నాడు. 45 ఏళ్లకే బీసీ, ఎస్సి, ఎస్టీ మహిళలకు పెన్షన్ అన్నాడు. పెన్షన్ దేవుడెరుగు పాపం మహిళలు దాచుకున్న అభయహస్తం డబ్బులు 2500 కోట్లు కొట్టేసాడు. ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మ ఒడి ఇస్తా అని మోసం చేసాడు.  కష్టాలు చూసాను…కన్నీళ్లు తుడుస్తాను. భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించాం. మహాశక్తి పథకం కింద… ఆడబిడ్డ నిధి:- 18 ఏళ్లు నిండిన మహిళలకు – నెలకు రూ.1500 అంటే ఏడాదికి రూ.18 వేలు, 5 ఏళ్లకు రూ.90 వేలు. 2) తల్లికి వందనం:- ప్రతి తల్లికి ఏడాదికి రూ.15 వేలు 3) దీపం పథకం:- ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం. 4) ఉచిత ప్రయాణం:- మహిళలకు ఉచిత ప్రయాణం.

యువత, రైతులను నిలువునా ముంచేశాడు!

జగన్ యువత ఎప్పటికీ పేదరికంలో ఉండాలని కోరుకుంటున్నాడు. జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, 2.30 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు, ప్రతి ఏటా 6,500 పోలీసు ఉద్యోగాలు ఇవ్వలేదు, గ్రూప్2 లేదు, డిఎస్సి లేదు. ఉన్న అంబేద్కర్ స్టడీ సర్కిల్స్, బీసీ స్టడీ సర్కిల్స్ మూసేసాడు. జిఓ77 తీసుకొచ్చి ఉన్నత విద్య చదువుతున్న వారికీ ఫీజు రీయింబర్స్మెంట్  పధకం రద్దు చేసాడు. యువగళాన్ని విన్నాం. ప్రభుత్వ, ప్రైవేట్, స్వయం ఉపాధి ద్వారా 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. నిరుద్యోగ యువతకు యువగళం నిధి కింద నెలకు రూ.3000 ఇస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడాది నోటిఫికేషన్ ఇస్తాం. అన్ని జిల్లాల్లో స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేస్తాం. పులకేశి జగన్  రైతులు లేని రాజ్యం తెస్తున్నాడు.  పులకేశి జగన్  పరిపాలనలో పురుగుల మందులు పనిచేయవు. జగన్ బ్రాండ్లు ప్రెసిడెంట్ మెడల్, గోల్డ్ మెడల్, ఆంధ్రా గోల్డ్ కొడితే మాత్రం పురుగులు చస్తాయి. రైతుల్ని ఆదుకోకపోగా ఇప్పుడు మీటర్లు పెడుతున్నాడు. రాయలసీమ లో 1000 అడుగుల వరకూ బోర్లు వేస్తే కానీ నీళ్లు రావు…,మరి కరెంట్ బిల్లు ఎంత వస్తుందో ఆలోచించండి. మోటార్లకు మీటర్లు రాయలసీమ రైతులకు ఉరితాళ్లు. రైతుల బాధలు చూసాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నదాతకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తాం.

బిసిల రక్షణకు ప్రత్యేక చట్టం తెస్తాం!

బీసీలు పడుతున్న కష్టాలు నేను చూసాను. 26 వేల అక్రమ కేసులు, నిధులు, కుర్చీలు లేని కార్పొరేషన్లు.  టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఉపకులాల వారీగా నిధులు, బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాం. డాక్టర్ సుధాకర్ దగ్గర నుండి డాక్టర్ అచ్చెన్న వరకూ జగన్ పాలనలో దళితుల్ని ఎలా చంపారో చూసారు .టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే దళితులను వేధించిన వారిని కఠినంగా శిక్షిస్తాం. జగన్ రద్దు చేసిన 27 దళిత సంక్షేమ కార్యక్రమాలను తిరిగి ప్రారంభిస్తాం. జగన్ పాలనలో మైనార్టీలను చిత్ర హింసలకు గురిచేసాడు. అబ్దుల్ సలాం, కరీముల్లా, ఇబ్రహీం, మిస్బా, హాజిరా. ఇలా ఎంతో మంది బాధితులు. మైనార్టీలకు ఉన్న అన్ని సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసాడు. దుల్హన్, విదేశీ విద్య, రంజాన్ తోఫా, ఇమామ్, మౌజమ్ లకు గౌరవ వేతనం, మసీదుల అభివృద్ధి కి నిధులు కూడా ఇవ్వడం లేదు.  టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పాత పధకాలు అమలు చెయ్యడంతో పాటు, ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తాం. రెడ్డి సోదరులు కూడా ఆలోచించాలి. 2019 ఎన్నికల్లో మీరు ఎంతో కష్టపడి డబ్బు ఖర్చు చేసి జగన్ ని గెలిపించుకున్నారు. ఇప్పుడు మీకు కనీస గౌరవం అయినా ఉందా. నాడు-నేడు అన్ని సామాజిక వర్గాలకు సమాన గౌరవం ఇచ్చింది ఒక్క టిడిపి మాత్రమే.

ఎమ్మెల్యేని డమ్మీని చేసి వైసిపి దొంగల దోపిడీ!

బద్వేల్ ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తారని మీరు వైసిపి ని భారీ మెజారిటీ తో గెలిపించారు.  బద్వేల్ లో జరిగింది ఏంటి? అభివృద్ధి నిల్లు…భూకబ్జాలు ఫుల్లు. బద్వేల్ ఎమ్మెల్యే సుధ గారి స్థలాన్నే వైసిపి నాయకులు కబ్జా చేసారు అంటే ఉమ్మడి కడప జిల్లా లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. అందుకే బద్వేల్ వైసిపి నాయకుల కి ముద్దుగా కాలకేయులు అని పేరు పెట్టా. రూ.2 వేల కోట్ల విలువైన ప్రభుత్వ, ప్రైవేట్ భూములు కబ్జా చేసారు వైసిపి భూ బకాసురులు. ఎమ్మెల్సీ గోవింద రెడ్డి బద్వేల్ ని మండలాల వారీగా కేకులా కోసి బంధువులకు పంచేసారు. ఎమ్మెల్సీ గోవింద రెడ్డి, వైసిపి నేతలు రమణా రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, గురు మోహన్, శ్రీ రాములు, పోల్ రెడ్డి, ఎల్లారెడ్డిలు కలిసి రెండు వందల కోట్లు విలువైన ప్రభుత్వ, ప్రైవేట్ భూములు కొట్టేసారు. ఆర్డీవో వెంకటరమణ 40 మంది వైసిపి కాలకేయుల లిస్ట్ బయటపెట్టారు. వైసిపి నాయకుల్ని తప్పించి అనామకులపై కేసులు పెట్టి చేతులు దులుపుకున్నారు. వైసిపి నేతలు యోగానంద రెడ్డి, వెంకట రెడ్డి, పిచ్చి రెడ్డి పోరుమామిళ్ల-బద్వేల్ రోడ్డు పక్కనే ఉన్న రూ.150 కోట్ల విలువైన 200 ఎకరాలు ఆక్రమించారు.

ఫుడ్ కమిటీ చైర్మన్ భూదోపిడీ!

పోరుమామిళ్లలో ఫుడ్ కమిటీ ఛైర్మెన్ ప్రతాప్ రెడ్డి రూ.300 కోట్ల విలువైన భూమిని కబ్జా చేసి అమ్మేసాడు. యూట్యూబ్ లో నీతివంతుడిలా బిల్డప్ ఇచ్చే ప్రతాప్ రెడ్డి అనుచరులు సర్వే నెంబర్ 1289లో 11ఎకరాలు, సర్వే నెంబర్ 1094,1076/1ఎ భూములను బినామీ పేర్లతో కాజేసారు. రంగసముధ్రం చెరువు సమీపంలో సర్వే నెంబర్ 916-లో 23.80 ఎకరాలు ప్రతాప్ రెడ్డి ఆక్రమించారు. రంగ సముద్రం రెవిన్యూ పొలం లో సర్వే నెంబర్ 1076/1ఏ 10.65 ఎకరాల మాదిగ ఈనామ్ భూముల ఆక్రమణ, సర్వే నెంబర్ 1095లో 20.30 ఎకరాలు,1095/3 లో మూడు ఎకరాలు నకిలీ పత్రాలతో ఆక్రమణ, సర్వే నెంబర్ 1096లో 2.36ఎకరాల రహదారి అక్రమణ, సర్వే నెంబర్ 1108లో1.47 ఎకరాలు ఆక్రమించారు. కలసపాడు వైసిపి నేత గురివి రెడ్డి ఆసుపత్రి భూమినే లేపేసాడు. మరో 40 ఎకరాలు తన కుటుంబ సభ్యుల పేర్లతో కొట్టేసాడు. వైసిపి నేత పురుషోత్తం రెడ్డి కలసపాడు, పాత రామాపురం, శంఖవరం, మామిళ్లపల్లి భూములతో పాటు అటవీ భూమి కూడా కలిపి 120 ఎకరాలు కబ్జా చేసాడు. బద్వేల్ మున్సిపాలిటీ లో ఏ అభివృద్ధి కార్యక్రమం జరగాలి అన్నా ఛైర్మెన్ రాజగోపాల్ రెడ్డికి కాంట్రాక్టర్లు 23 శాతం కప్పం కట్టాల్సిందే. అందుకే కాంట్రాక్టర్లు పనులు చెయ్యమంటూ చేతులు ఎత్తేసారు.

బద్వేలుకు జగన్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?

బద్వేల్ కి జగన్ అనేక హామీలు ఇచ్చాడు. బద్వేల్ టౌన్ ని మోడల్ టౌన్ గా మారుస్తానని చెప్పాడు.  బద్వేల్,గోపవరం,అట్లూరు మండలాలకు సోమశిల బ్యాక్ వాటర్ వద్ద లిఫ్ట్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేసి సాగునీరు అందిస్తాం అని హామీ ఇచ్చాడు. వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తి చేసి పోరుమామిళ్ల, కలసపాడు మండలాలకు రెండేళ్లలోనే సాగు, తాగునీరు అందిస్తాం అని చెప్పి మోసం చేసాడు. పోరుమామిళ్ల చెరువు ముంపు బాధితులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చాడు. పోరుమామిళ్లను మున్సిపాలిటీ చేస్తానని చెప్పాడు. బద్వేల్ ని అభివృద్ధి చేసింది టిడిపి. సాగు,తాగు నీటి ప్రాజెక్టులు, పేదలకు ఇళ్లు, రోడ్లు నిర్మించింది టిడిపి. బ్రహ్మం సాగర్ ప్రాజెక్టు నిర్మించింది స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారు. అగ్రికల్చర్ కాలేజ్, పోరుమామిళ్ల, బద్వేల్ మండలాలకు జూనియర్, డిగ్రీ కాలేజీలు ఇచ్చింది చంద్రబాబు గారు.  పోరుమామిళ్ల, కలసపాడులో పశువుల ఆసుపత్రి ఏర్పాటు చేసింది టిడిపి. సోమశిల బ్యాక్ వాటర్ ద్వారా చెరువులు నింపేందుకు ప్రత్యేక జిఓ ఇచ్చింది చంద్రబాబు గారు.

పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేస్తాం

పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి సాగు, తాగు నీరు సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తాం. సోమశిల బ్యాక్ వాటర్ ద్వారా బద్వేల్ చెరువు నింపుతాం. పోరుమామిళ్ల చెరువును అభివృద్ధి చేస్తాం. ముంపు బాధితులకు న్యాయం చేస్తాం. మిషన్ రాయలసీమ లో భాగంగా జిల్లాకు పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉద్యోగాలు కల్పిస్తాం. బద్వేల్ టౌన్ ని అభివృద్ధి చేస్తాం. వాటర్ గ్రిడ్ పథకంలో భాగంగా ప్రతి ఇంటికీ తాగునీరు అందిస్తాం. టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి పేదలకు ఇళ్లు ఇస్తాం.  టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే బద్వేలు నియోజకవర్గంలో జరిగిన భూ అక్రమాల పై సిట్ వేసి విచారణ చేస్తాం. టిడిపి నాయకుల్ని, కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టిన ఎవరిని వదిలిపెట్టను. బద్వేల్ లో ఉన్నా, బంగ్లాదేశ్ పారిపోయినా పట్టుకొచ్చి లోపలేస్తా.

నారా లోకేష్ ను కలిసిన బద్వేల్ పట్టణ ప్రముఖులు

బద్వేలు ఎన్ జిఓ కాలనీలో పట్టణ ప్రముఖులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. పట్టణంలో గృహవినియోగం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి విద్యుత్ మీటర్లు ఇవ్వడం లేదు. డ్రైనేజీ కాలువల నిర్మాణం చేపట్టడం లేదు. వర్షం వచ్చినపుడు మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తోంది. మంచినీటి కుళాయి కనెక్షన్లు ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. సీసీరోడ్ల నిర్మాణం చేపట్టలేదు, రోడ్లన్నీ గోతులమయంగా మారాయి. ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లలో బేస్మెంట్ లెవల్ లో మట్టి తోలుకునేందుకు అనుమతులు ఇవ్వడం లేదు. మా సమస్యలపై అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా పట్టించుకోవడం లేదు. మీరు అధికారంలోకి వచ్చాక బద్వేలు పట్టణ ప్రజల సమస్యలు పరిష్కరించండి.

నారా లోకేష్ స్పందిస్తూ

జగన్మోహన్ రెడ్డి పాలనలో స్థానిక సంస్థలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయి. మున్సిపాలిటీల్లో కనీసం బ్లీచింగ్ చల్లడానికి కూడా నిధులు లేకుండా చేశారు. పట్టణాల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించడం లేడు ప్రభుత్వం, రకరకాల పన్నులతో ప్రజలను వేధిస్తోంది. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంటింటికీ తాగునీటి కుళాయి అందజేస్తాం. పట్టణాల్లో రోడ్లు, డ్రైన్లు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. పేదల ఇళ్లకు ఉచితంగా మట్టి తోలుకునేందుకు అవకాశం కల్పిస్తాం. నిర్ణీత కాలవ్యవధిలో విద్యుత్ మీటర్లు అందజేసేలా చర్యలు తీసుకుంటాం.

లోకేష్ ను కలిసిన మడకలవారిపల్లె ఎస్సీ కాలనీ ప్రజలు

బద్వేలు శివారు పోరుమామిళ్ల బైపాస్ రోడ్డులో మడకలవారిపల్లె ఎస్సీ కాలనీ ప్రజలు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మాకు 1972లో హరిజనవాడ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా వ్యవసాయ భూమి 20మందికి 58ఎకరాలు ఇచ్చారు. నాటి నుండి ఈ భూమిని మేము సాగుచేసుకుని జీవనం సాగిస్తున్నాం, ఎస్సీ కార్పొరేషన్ కు శిస్తు కడుతున్నాం. మాకు ఈ భూమిపై డీకేటీ పట్టాలు ఇవ్వాలని అధికారులను కోరుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. మేము ఈ భూమి సాగుచేయడం లేదనే పేరుతో వైసీపీ ప్రభుత్వం 30ఎకరాల భూమిని అన్నమయ్య అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి కేటాయించారు. దీనిపై మాకు ఎలాంటి నోటీసులు పంపలేదు. మాకు జరిగిన అన్యాయంపై ఆర్డీఓ, ఎమ్మార్వోను అడిగితే కలెక్టర్ ఆర్డర్ అంటున్నారు. హైకోర్టును ఆశ్రయిస్తే మా భూమిని మాకు ఇవ్వాలని తీర్పునిచ్చింది. అయినా మా భూమిని ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బందిపెడుతున్నారు. మరో 30ఎకరాలు కబ్జా చేయాలని అధికార పార్టీ నాయకులు చూస్తున్నారు. మీరు అధికారంలోకి వచ్చాక మా భూమిని మాకు ఇప్పించాలని కోరుతున్నాం.

నారా లోకేష్ స్పందిస్తూ

రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజల ఆస్తులు, మాన,ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఎస్సీల భూ విస్తీర్ణం తగ్గిపోయినట్లు కేంద్ర గణాంకాలు చెబుతున్నాయి. గత నాలుగేళ్లలో దళితులకు చెందిన 12వేల ఎకరాల భూములను లాక్కుతున్నారు. వైసిపి నేతలు కబ్జాకోరులుగా మారి గ్రామాల్లో దళితులు, బలహీనవర్గాల భూములను కాజేస్తున్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మడకలవారిపల్లె ఎస్సీ కాలనీ ప్రజలనుంచి వైసిపి నేతలు లాక్కున్న భూములను స్వాధీనం చేసుకొని, దళితులకు అందజేస్తాం. గత రికార్డులను పరిశీలించి దళితులకు పట్టాలు ఇస్తాం.

నారా లోకేష్ ను కలిసిన పిపి కుంట గ్రామస్తులు

బద్వేలు నియోజకవర్గం పిపి కుంట గ్రామ ప్రజలు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. సోమశిల ప్రాజెక్టు నుంచి బద్వేల్ చెరువును నింపి పరిసర గ్రామాలకు నీరు అందించాలి. మా గ్రామంలోని పొలాలకు లింక్ రోడ్లు వేయించాలి. మా పంచాయతీ పరిధిలో గతంలో 400 ఎకరాలు పరిశ్రమల కోసం కేటాయించారు. ఇక్కడ పరిశ్రమలు నిర్మించి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలి. మా గ్రామంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించాలి. సజ్జలు, వరి, పత్తి పంటలకు మద్దతు ధర కల్పించాలి. మీరు అధికారంలోకి వచ్చాక మా గ్రామ సమస్యలను పరిష్కరించాలి.

నారా లోకేష్ స్పందిస్తూ.

జగన్ అధికారంలోకి వచ్చాక రాయలసీమలో కొత్త ప్రాజెక్టులు లేకపోగా, కనీసం పిల్లకాల్వలు కూడా నిర్మించలేదు. గత టిడిపి ప్రభుత్వ హయాంలో సీమ ప్రాజెక్టుల కోసం రూ.11,700 కోట్లు ఖర్చుచేస్తే, ప్రస్తుత ప్రభుత్వం కేవలం 2,700 కోట్లు మాత్రమే ఖర్చుచేసింది. జె-ట్యాక్స్ బాధ భరించలేక 10లక్షల కోట్ల విలువైన పరిశ్రమలు రాష్ట్రం నుంచి తరలిపోయాయి. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మిషన్ రాయలసీమలో భాగంగా పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తిచేసి, చెరువులకు అనుసంధానించి సాగు, తాగునీటి సమస్య పరిష్కరిస్తాం. గ్రామాల్లో సిమెంటు రోడ్లు, పొలాలకు వెళ్లే లింక్ రోడ్ల నిర్మాణాన్ని పూర్తిచేస్తాం. పిపి కుంటలో గతంలో సేకరించిన భూముల్లో పరిశ్రమలు ఏర్పాటుచేసి, స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తాం. వ్యవసాయ పెట్టుబడులను తగ్గించి రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తాం.

Also Read This Blog:Empowering Youth, Transforming Lives: Yuvagalam Padayatra’s Journey

Tagged#LokeshPadaYatra#Padayatra#YuvaGalamLokesh#YuvaGalam#NaraLokeshPadaYatra#NaraLokesh