yuvagalam padayatra,Nara lokesh
yuvagalam padayatra,,Nara lokesh

బద్వేలు నియోజకవర్గంలో హోరెత్తిన యువగళం! అడుగడుగునా యువనేతకు జన నీరాజనాలు

దారిపొడవునా అపూర్వస్వాగతం, వినతుల వెల్లువ

బద్వేలు: బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గంలో యువనేత Nara Lokesh యువగళం పాదయాత్ర జననీరాజనాలతో హోరెత్తుతోంది. 123వరోజు యువగళం పాదయాత్ర బద్వేలు నియోజకవర్గం నబియాబద్ క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైంది. దారిపొడవునా యువనేతకు మహిళలు హారతులుపట్టి, తిలకం దిద్దుతూ అపూర్వ స్వాగతం పలికారు. తనను కలిసేందుకు వచ్చిన ప్రతిఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలు తెలుసుకున్నారు. పార్టీ అభిమానులు, కార్యకర్తలు, యువకులు బాణాసంచా మోతలు, డప్ఫు శబ్ధాలతో హోరెత్తించారు. నబియా బాద్ క్యాంప్ సైట్ లో రైతులతో సమావేశమైన లోకేష్ వారి సాధకబాధకాలు తెలుసుకున్నారు. సోమేశ్వరపురం, అప్పరాజుపేట, రాజుపాలెం, వెంకటశెట్టిపల్లి, కొంగలవీడు, శంకరాపురం క్రాస్, గొటడుగునూరు, చింతలచెరువు, బయనపల్లి, భాకరాపేట మీదు బద్వేలు శివారు విద్యానగర్ క్యాంప్ సైట్ కు చేరుకున్నారు. మార్గమధ్యంలో లింగాలకుంట వద్ద ఇసుక రవాణా కోసం వెళ్తున్న టిప్పర్లను చూసిన లోకేష్ సెల్ఫీ దిగి వైసిపినేతల ఇసుక అక్రమాలను ఎండగట్టారు. మార్గమధ్యలో వివిధ గ్రామాల ప్రజలు వైసిపి పాలనలో తాము పడుతున్న ఇబ్బందులను ఏకరువు పెట్టారు. మరో ఏడాదిలో రాబోయే చంద్రన్న ప్రభుత్వం అందరి సమస్యలకు పరిష్కారం చూపుతుందని భరోసా ఇచ్చి ముందుకు సాగారు. 123వరోజు యువనేత లోకేష్ 12.4 కి.మీ దూరం నడిచారు. ఇప్పటివరకు యువగళం పాదయాత్ర 1569. 1 కి.మీ. మేర పూర్తయింది. బద్వేలు ఆర్టీసి బస్టాండు వద్ద సోమవారం నిర్వహించే బహిరంగసభలో యువనేత లోకేష్ ప్రసంగించనున్నారు.

యువనేత ఎదుట వ్యక్తమైన సమస్యలు:

మా బిడ్డను అన్యాయంగా చంపేశారు! -అల్లంపాటి రామిరెడ్డి, రమాదేవి, మరాఠిపల్లె గ్రామం, బి.కోడూరు (మం).

18 ఏళ్ల వయసున్న నా కూతురు అనూషను గతేడాది అక్టోబరు 20న ఓ ప్రైవేటు డిగ్రీ కాలేజీకి వెళ్లింది. పొద్దున 8 గంటలకు వెళ్లిన నా కూతురు సాయంత్రం వరకు ఇంటికి రాలేదు. సాయంత్రం బద్వేలు రూరల్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేస్తే తీసుకోలేదు. ఇప్పటికే ఇలాంటివి మా వద్ద మూడు కేసులు ఉన్నాయి, బి.కోడూరులో ఫిర్యాదు చేయండని చెప్పారు. ఎస్పీకి ఫోన్ చేస్తే జీరో ఎఫ్ఐఆర్ చేస్తున్నామని చెప్పారు. గురుమహేష్ రెడ్డి అనే స్టూడెంట్ నా కూతరుని చంపేశాడు. గురుమహేష్ రెడ్డి తల్లి వైసీపీలో యాక్టివ్ గా ఉంటుంది. ఈ కేసులో అతడ్ని కాపాడేందుకు బద్వేలు మండల అధ్యక్షుడు రామసుబ్బారెడ్డి రంగంలోకి దిగారు. నేరస్తుడ్నిఅరెస్టు కూడా చేయలేదు. నామ మాత్రపు కేసు పెట్టి, 10 రోజుల్లో బయటకు పంపించారు. కాల్ డేటా కూడా అడిగితే వస్తుందన్నారు..కానీ ఇవ్వడం లేదు. ఎఫ్ఐఆర్ లో సిద్ధవటంలోని పెన్నానదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు రాశారు. మాకు న్యాయం చేయాలి..నిందితుడ్ని కఠినంగా శిక్షించేందుకు మీవంతు సహకారం అందించండి.

పొలం ఆక్రమించడానికి దాడిచేశారు!-గంగసాని చంద్రశేఖర్ రెడ్డి, గంగసాని వెంకటసుబ్బారెడ్డి, రాజుపాలెం

రాజుపాలెం గ్రామంలో మాకు 593/1, 593/2, 593/3, 593/10, 608, 652, 653,  సర్వే నంబరులో 7.63 సెంట్ల పొలం ఉంది. ఇందులో మామిడి చెట్లు పెట్టుకుని, అంతర్ పంటలుగా ఇతర పంటలు 20 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నాం. గతేడాది ఆగస్టులో వైసీపీకి చెందిన పోకల వెంకటసుబ్బారెడ్డి అన్నదమ్ములు, బుట్టి వెంకట నరసారెడ్డి ఆ పొలం తమదంటూ రాత్రి 8 గంగల సమయంలో మా ఇంటిపై పెట్రోల్ తో దాడి చేశారు. కర్రలు, రాడ్లతో దాడి చేసి, మా అమ్మ తల కూడా పగలగొట్టారు. 7.63 సెంట్లలో 600 మామిడి చెట్లు ఉన్నాయి..వాటిలో 150 చెట్లను రాత్రికి రాత్రే నరికేశారు. దీనిపై కోర్టుకు వేయగా ప్రస్తుతం స్టే ఇచ్చింది. అయినా వారు ఇప్పటికీ బెదిరిస్తూనే ఉన్నారు.

బీమా సొమ్ము ఇవ్వడం లేదు -భీమవరం వెంకటశివ, రాజుపాలెం

నా భర్త 2021లో బద్వేలు రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లు పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. ప్రమాద బీమా వస్తుందని, సచివాలయ సిబ్బంది చెప్తే ఆధారాలన్నీ ఇచ్చా. కానీ బీమా సొమ్ము ఇప్పటికీ రాలేదు. సచివాలయంలో అడిగితే వస్తుందన్నారు..ఇవ్వడం లేదు. ప్రమాదం జరిగిన రోజు అధికార పార్టీ నేతలు రాజీ చేసి, ఈ రోజు పట్టించుకోవడం లేదు. పరిహారం కోసం కోర్టులో పిటిషన్ కూడా వేశాను. ఇద్దరు చిన్న అమ్మాయిలే ఉన్నారు…అద్దె ఇంట్లో ఉంటున్నా, మాకు పొలం, స్థలం ఏమీలేవు. ఎలా బతకాలి?

ఫీజు రీఎంబర్స్ మెంట్ రావడం లేదు -యశస్వి, ఎస్.బి.వీ.ఆర్ అగ్రికల్చర్ కాలేజీ, బద్వేలు.

నేను ఎస్సీ సామాజికవర్గానికి చెందిన స్టూడెంట్ ని. ఎస్.బి.వీ.ఆర్ అగ్రికల్చర్ కాలేజీలో అగ్రికల్చర్ బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్నా. మాకు ప్రభుత్వం నుండి ఫీజు రీయింబర్స్ మెంట్ సరిగా రావడం లేదు. ప్రతి సెమిస్టర్ కు రూ.53 వేలు మేమే సొంత డబ్బులు చెల్లిస్తున్నాం. మాకంటే రెండేళ్ల ముందు కోర్సు పూర్తి చేసుకున్న సీనియర్లకు ఇప్పటికీ ఉద్యోగాలు లేక ఖాళీగా ఉన్నారు. లక్షలు ఖర్చు పెట్టి చదువుకుని ఉద్యోగాలు లేకుండా ఎలా బతకాలి?

*వైకాపా ఇసుకాసురుల దెబ్బకు పెన్నానది విలవిల!*

పెన్నానది నుంచి ఇసుక రవాణా చేసేందుకు వెళ్తున్న టిప్పర్లను పరిశీలించిన యువనేత లోకేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైసిపి ఇసుకాసురుల దెబ్బకు పెన్నానది విలవిలలాడుతోంది. పత్రికలు ఘోషిస్తున్నా, ప్రజలు మొరపెట్టుకుంటున్నా వైకాపా ఆగడాలు ఆగడం లేదు. ఇవి బద్వేలు నియోజకవర్గంలోని లింగాలకుంట వద్ద పెన్నానది ఇసుక కోసం వెళ్తున్న టిప్పర్ లారీలు. ఇసుక లోడ్ చేసుకున్నాక ఎక్కడికి తీసుకెళ్తారని అడిగితే బెంగుళూరు వెళ్తామని డ్రైవర్ సమాధానమిచ్చారు. ఇక్కడ ఇసుక కూతవేటు దూరంలోని గ్రామప్రజలకు దొరకదు కానీ, చెన్నయ్, బెంగుళూరులో మాత్రం విరివిగా దొరుకుతుంది. జలగన్న పాలనలో జనం ఇంకా ఎన్ని సిత్రాలు చూడాలోనంటూ చురకలంటించారు.

రాయలసీమకు చేసిందేమిటి? టిడిపి అధికారంలోకి పాత డ్రిప్ ఇరిగేషన్ తెస్తాం

మిషన్ రాయలసీమతో రైతాంగాన్ని ఆదుకుంటాం వాతావరణాన్ని బట్టి ప్రత్యేక జోన్లు ఏర్పాటుచేస్తాం

రైతులతో ముఖాముఖిలో యువనేత లోకేష్

బద్వేలు: 49 మంది ఎమ్మెల్యేలను రాయలసీమ లో గెలిపిస్తే జగన్ రాయలసీమకి ఇచ్చింది ఎంటి?  వైసిపి కి 2019 లో ఇచ్చిన సీట్లు మాకు ఇవ్వండి రాయలసీమ ని అభివృద్ది చేసి చూపిస్తామని యువనేత నారా లోకేష్ చెప్పారు. రాయలసీమ రైతులకు నీరు ఇస్తే బంగారం పండిస్తారు,  టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పాత డ్రిప్ ఇరిగేషన్ విధానాన్ని తీసుకొస్తామని పేర్కొన్నారు. బద్వేలు నియోజకవర్గం నబియాబాద్ లో రైతులతో ముఖాముఖి సమావేశమైన లోకేష్ వారి సాధకబాధకాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా యువనేత మాట్లాడుతూ… జగన్ పాలనలో రైతులు నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు, నకిలీ పురుగుల మందులతో ఇబ్బంది పడుతున్నారు. విత్తనాలు, ఎరువులు, పురుగుల మందుల రేట్లు పెరిగిపోయాయి. రాయలసీమ కి జీవనాడి డ్రిప్ ఇరిగేషన్. అలాంటి డ్రిప్ పై సబ్సిడీ ఎత్తేసి నాలుగేళ్లలో రైతులకి జగన్ తీరని అన్యాయం చేశాడు.

పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేసే బాధ్యత నాది

బద్వేల్ లో టిడిపి జెండా ఎగరేయండి పెండింగ్ ప్రాజెక్టులు, బ్రిడ్జ్ పనులు పూర్తి చేసే బాధ్యత నాది. జగన్ సొంత బ్రాండ్లు అమ్ముకోవడానికి చెరుకు రైతులను వేధిస్తున్నాడు. బెల్లం అమ్మడానికి వీలు లేదని అక్రమ కేసులు పెడుతుంది ప్రభుత్వం.  గతంలో ఎలా అయితే స్వేచ్ఛగా బెల్లం అమ్ముకునే  వారో టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే స్వేచ్ఛగా రైతులు బెల్లం అమ్ముకునే అవకాశం కల్పిస్తాం. బద్వేల్ నియోజకవర్గం లో సాగునీటి కష్టాలు తీర్చడానికి పిల్ల కాలువలు తవ్వుతాం. మిషన్ రాయలసీమ కార్యక్రమంలో భాగంగా రైతులను ఆదుకోవడానికి ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తాం. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు రాయలసీమ లో హార్టి కల్చర్ ని ఎక్కువుగా ప్రోత్సహిస్తాం. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యేక జోన్లు ఏర్పాటు చేస్తాం. మామిడి, దానిమ్మ, బొప్పాయి, చీనీ, కర్జూరం ఇలా వీటిలో అనేక రకాల మొక్కలు ఇక్కడే పెంచే విధంగా రీసెర్చ్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం. వ్యవసాయ అనుబంధ రంగాలను కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తాం.

జ్యూస్ ఫ్యాక్టరీలు రప్పిస్తాం

జూస్ ఫ్యాక్టరీలు రావడానికి కావాల్సిన రకాలు పెంచే విధంగా చర్యలు తీసుకుంటాం. పెట్టుబడి తగ్గించి గిట్టుబాటు ధర కల్పించడం ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి యువత వ్యవసాయం వైపు వచ్చేలా చేస్తాం. పాడి పరిశ్రమ, గొర్రెల పెంపకం, సెరీ కల్చర్ ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తాం. టిడిపి అధికారంలో ఉన్నప్పుడు ఉపాధి హామీ ని హార్టి కల్చర్ కి అనుసంధాన చేసి పంట కుంటలు, మినీ గోకులం లాంటి అనేక కార్యక్రమాలు అమలు చెయ్యడానికి అనుసంధానం చేసాం. సోమశిల ప్రాజెక్టు ముంపు బాధితులకు అన్యాయం జరిగింది. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే న్యాయం చేస్తాం. మొదటి 18 నెలల్లో పరిహారం అందిస్తాం. బద్వేల్ నియోజకవర్గం లో పెండిగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తే అదనంగా మరో 80 వేల ఎకరాలు సాగులోకి వచ్చే అవకాశం ఉంది. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. ఇసుక దోపిడి లో జే ట్యాక్స్ రోజుకి రూ.3 కోట్లు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే కుందూ ప్రాజెక్ట్ పూర్తి చేసి సాగునీరు అందిస్తాం.

పులివెందులకు కూడా నీళ్లిచ్చాం

 రాయలసీమ ప్రాజెక్టుల కోసం టిడిపి ఖర్చు చేసింది 11,700 కోట్లు . అందులో 10 శాతం కూడా జగన్ ప్రభుత్వంలో ఖర్చు చెయ్యలేదు.  టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే భవిష్యత్తు కు గ్యారెంటీ పేరుతో అన్నదాత కు 20 వేల ఆర్ధిక సాయం చేస్తాం. ఒకే సంతకంతో 50 వేల లోపు ఉన్న రుణాలు అన్ని మాఫీ చేసింది చంద్రబాబు గారు.  ఇన్పుట్ సబ్సిడీ, రైతు రథాలు, డ్రిప్ ఇరిగేషన్, సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసింది టిడిపి. హార్టి కల్చర్ ని పెద్ద ఎత్తున ప్రోత్సహించింది టిడిపి ప్రభుత్వం. పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించింది చంద్రబాబు. పులివెందులకు నీళ్లు ఇచ్చింది చంద్రబాబు. 175 నియోజకవర్గాలు నాకు సమానం అంటూ అభివృద్ది చేసాం. పంటల భీమా పక్కగా అమలు చేసింది టిడిపి.

జగన్ పాలనలో రైతుల ఆత్మహత్యలు

జగన్ పాలనలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతుల ఆత్మహత్యల్లో ఏపి దేశంలోనే నంబర్ 3 గా ఉంది. కౌలు రైతుల ఆత్మహత్యల్లో నంబర్ 2 గా ఉంది. టిడిపి హయాంలో ఒక్కో రైతు మీద రూ.75 వేల అప్పు ఉంటే జగన్ పాలనలో రూ.2.50 లక్షలకు చేరింది. ఇప్పుడున్న వ్యవసాయ శాఖ మంత్రి కోర్టు దొంగ. పంట నష్టం జరిగితే కనీసం పంట నష్టం అంచనా వేసే దిక్కు జగన్ ప్రభుత్వం లో లేదు. గోదావరి, కృష్ణా, పెన్నా అనుసంధానం ద్వారానే శాశ్వతంగా సాగునీటి సమస్య తీరుతుంది. లోవర్ సీలేరు ప్రాజెక్టు ని ఆధునీకరణ చేస్తానని జగన్ బద్వేలు ఉప ఎన్నిక సందర్భంగా హామీ ఇచ్చి మోసం చేసాడు. ముంపునకు గురై భూములు కోల్పోయిన రైతులను ఆదుకుంటాం.

ముఖాముఖి సమావేశంలో రైతుల అభిప్రాయాలు

బద్వేలు నియోజడకవర్గ రైతులు మాట్లాడుతూ…పోరుమామిళ్ల  చెరువు పొంగి ప్రవహించడంతో 1200 ఎకరాలు మునిగిపోయాయి. రైతులకు ఇప్పటి వరకూ పరిహారం ఇవ్వలేదు బెల్లం అమ్మడానికి వీలు లేదని కేసులు పెడుతున్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే వ్యవసాయం లో యువతను ఎక్కువగా ప్రోత్సహించడానికి చర్యలు తీసుకోవాలి. ఉపాధి హామీ ని హార్టి కల్చర్ కి అనుసంధానం చెయ్యాలి. సోమశిల ముంపు బాధితులకు న్యాయం చెయ్యలేదు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆదుకోవాలి. వైసిపి ప్రభుత్వం వచ్చిన మూడు నెలల్లో న్యాయం చేస్తామని హామీ ఇచ్చి ఎంపి అవినాష్ రెడ్డి మోసం చేసాడు. సోమశిల నుండి బద్వేల్ కి నీటిని కేటాయిస్తూ టిడిపి ప్రభుత్వం ఇచ్చిన జీఓ ని జగన్ ప్రభుత్వం అమలు చెయ్యడం లేదు. వైసిపి అధికారంలోకి వచ్చిన డ్రిప్ ఇరిగేషన్ లేక మెట్ట రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. రితేష్ రెడ్డి మాట్లాడుతూ… బద్వేలు నియోజకవర్గంలో 20 వేల ఎకరాలు మాత్రమే సాగు లో ఉన్నాయి. 83 చెరువులు ఉన్నాయి కానీ నీరు లేదు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే లక్షా డెబ్బై వేల ఎకరాలు సాగు లోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలి.

యువనేతను కలిసిన తంబళ్లగొంది గ్రామస్తులు

బద్వేలు నియోజకవర్గం తంబళ్లగొంది గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మా గ్రామంలో తీవ్ర మంచినీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నాం. బోరునుంచి వచ్చే నీటిలో ఫ్లోరిన్ అధికంగా ఉండటంతో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. మంచినీటికోసం 5కిలోమీటర్లు వెళ్లి బిందెలతో తెచ్చుకోవాల్సి వస్తోంది. ఆ నీళ్లలో కూడా కెమికల్స్ కలిసి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. చెరువునుంచి పొలాలకు మట్టి తోలుకుంటున్నా అధికారులు ఇబ్బంది పెడుతున్నారు. మా పక్కనే ఉన్న సగిలేరులో ఇసుక తోలుకునేందుకు కూడా అధికారులు అనుమతించడం లేదు. మా సమస్యను మూడేళ్ల క్రితం కలెక్టర్ కు చెప్పినా పట్టించుకోలేదు. మీరు అధికారంలోకి వచ్చాక మా సమస్యలు పరిష్కరించండి.

నారా లోకేష్ మాట్లాడుతూ.

రాయసీమ బిడ్డనని చెప్పుకునే ముఖ్యమంత్రి సొంత ప్రాంత ప్రజలకు గుక్కెడు నీళ్లివ్వలేని దుస్థితిలో ఉన్నారు. ఇసుక, మట్టి దోచేసి పాపపు సొమ్ము పోగేయడమే తప్ప ప్రజల ఇబ్బందులపై దృష్టి పెట్టడం లేదు. టిడిపి అధికారంలోకి రాగానే వాటర్ గ్రిడ్ ద్వారా ప్రతిఇంటికీ కుళాయి ఇచ్చి, సురక్షితమైన తాగునీరు అందిస్తాం. చెరువుల నుంచి రైతులు పొలాలకు ఉచితంగా మట్టితోలుకునే హక్కు కల్పిస్తాం. తీరప్రాంత ప్రజలు ఉచితంగా పెన్నానదినుంచి ఇసుక తెచ్చుకునే అవకాశం కల్పిస్తాం.

యువనేత లోకేష్ ను కలిసిన అట్లూరు మండల రైతులు

బద్వేలు నియోజకవర్గం అట్లూరు మండలానికి చెందిన రైతులు సోమేశ్వరపురంలో యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. బద్వేలు బ్రహ్మంసాగర్ నుంచి అట్లూరు మండలం గుండా వచ్చే కుడి కాలువపై మా మండలంలోని 20 గ్రామాలరైతులు ఆశలుపెట్టుకున్నాం. ఈ కాలువ పనులను గతప్రభుత్వ హయాంలో మొదలుపెట్టారు. వైసీపీ ప్రభుత్వం  వచ్చాక పనులు కొనసాగించకుండా నిలిపేసింది. దీనిని పూర్తిచేస్తే 20గ్రామాలపరిధిలో 20వేల ఎకరాలు సస్యశ్యామలమవుతాయి. మీరు అధికారంలోకి వచ్చాక కాలువ పనులను పూర్తిచేయాలి.

నారా లోకేష్ స్పందిస్తూ

రాయలసీమ బిడ్డనని చెప్పుకునే జగన్ వాస్తవానికి ఈ ప్రాంతానికి పట్టిన క్యాన్సర్ గడ్డ. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రాయలసీమలోని సాగునీటి ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. గత టిడిపి ప్రభుత్వ హయాంలో రాయలసీమ ప్రాజెక్టులకు రూ.11,700 కోట్లు ఖర్చుచేయగా, జగన్ అధికారంలోకి వచ్చాక ఖర్చుచేసింది కేవలం రూ.2,700 కోట్లు మాత్రమే. టిడిపి అధికారంలోకి వచ్చాక మిషన్ రాయలసీమలో భాగంగా బ్రహ్మంసాగర్ కాల్వల పనులు పూర్తిచేసి అట్లూరు మండలంలోని రైతులకు సాగునీరు అందజేస్తాం.

లోకేష్ ను కలిసిన రాజుపాలెం గ్రామ బాధితులు

బద్వేలు నియోజకవర్గం రాజుపాలెం గ్రామానికి చెందిన చంద్రశేఖర్ రెడ్డి, సుబ్బారెడ్డి అనే రైతులు  యువనేత లోకేష్ ను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. మా గ్రామంలోని 6.50ఎకరాల భూమిలో మేము 20ఏళ్లుగా మామిడి సాగు చేస్తున్నాం. వాటిని తొలగించాలంటూ గత ఏడాది ఆగస్టులో అర్థరాత్రి 40మంది మా పొలంలోకి వచ్చారు. మాపై కర్రలు, పెట్రోల్ తో దాడి చేయడానికి ప్రయత్నం చేసి, భౌతిక దాడికి పాల్పడ్డారు. గాయాలతో మేం ఆసుపత్రికి వెళితే, పోలీసులు మమ్మల్ని బలవంతంగా స్టేషన్ కు తరలించారు. మాపై దాడిచేసిన వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. రెవెన్యూ, పోలీసు అధికారులు పక్షపాత వైఖరితో మాకు అన్యాయం చేశారు. మీరు అధికారంలోకి వచ్చాక మాకు న్యాయం చేయండి.

నారా లోకేష్ స్పందిస్తూ

వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం నడుస్తోంది. రాష్ట్రంలో ప్రజల ఆస్తులు, మాన,ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. వైసిపి గూండాల పెట్రేగిపోతుండటంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. బాధితులపైనే ఎదురుకేసులు పెట్టడం వైసిపి ప్రభుత్వం ప్రత్యేకత. టిడిపి అధికారంలోకి వచ్చాక వైసిపి రౌడీ మూకలను ఉక్కుపాదంతో అణచివేస్తాం. ప్రజలను భయబ్రాంతులను చేసే అసాంఘిక శక్తులను గ్రామాలనుంచి బహిష్కరించి, కఠినచర్యలు తీసుకుంటాం.

లోకేష్ ను కలిసిన వీరపల్లె, తిప్పనపల్లె, కోనసముద్రం గ్రామాల ప్రజలు

బద్వేలు నియోజకవర్గం వీరపల్లె, తిప్పనపల్లె, కోనసముద్రం గ్రామాల ప్రజలు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. సీపీ రోడ్డు నుండి కొత్తచెరువు, జోగిరెడ్డిగారి పల్లె, తిప్పనపల్లెకు వెళ్లే రోడ్డును గత ప్రభుత్వం 2019లో మంజూరైంది. రూ.40లక్షలు విలువ చేసే పనులను చేసిన తర్వాత వైసీసీ ప్రభుత్వం పనులను రద్దు చేసింది. పి.ఎం.జి.ఎస్.వై గ్రాంట్ కింద రోడ్డును మంజూరైనా పనులు పూర్తిచేయడం లేదు. పనులను అసంపూర్ణంగా వదిలేయడంతో మా గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బ్రహ్మంసాగర్ కుడికాలువ మా ప్రాంతానికి జీవనాధారం. కాలువ పనులు కూడా అసంపూర్తిగా మిగిలిపోయాయి. కాలువకు అనుసంధానంగా ఉన్న ఆయకట్టు కాలువలను ప్రభుత్వం పూర్తిచేయడం లేదు. డ్యామ్ నిండా నీరు ఉన్నా రైతులు పంట సాగు చేయలేకపోతున్నాడు. కొత్తచెరువుకు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా తెలుగుగంగ కాలువ నుండి నీళ్లు ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి మాటతప్పి, మడమతిప్పారు. మీరు అధికారంలోకి వచ్చాక మా సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నాం.

నారా లోకేష్ స్పందిస్తూ

రాజకీయ తో గత ప్రభుత్వంలో మంజూరైన పనులను నిలిపివేయడం దుర్మార్గం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే సీపీ రోడ్డు నుండి కొత్తచెరువు, జోగిరెడ్డిగారి పల్లె, తిప్పనపల్లెకు వెళ్లే రోడ్డు పనులను పూర్తిచేస్తాం. బ్రహ్మం సాగర్ కుడికాల్వ పనులను పూర్తిచేసి సాగునీటి కష్టాలు తీరుస్తాం. మీ కోసం పనిచేసే చంద్రన్నను సిఎం చేసేందుకు మీవంతు సహకారం అందించండి.

నారా లోకేష్ ను కలిసిన శంకరాపురం గ్రామస్తులు

బద్వేలు నియోజకవర్గం శంకరాపురం గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మా గ్రామంలో మంచినీటి ట్యాంకులు లేక ఇబ్బందులు పడుతున్నాం. రోడ్లు, సీసీ రోడ్లు వైసీపీ పాలనలో వేయడం లేదు. చాలా మందికి పెన్షన్లు, తెల్లరేషన్ కార్డులను రద్దు చేశారు. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందనే సాకుతో పెన్షన్లు రద్దు చేశారు. మా గ్రామంలో మట్టిని వైసీపీ నాయకులు యథేచ్చగా దోచుకుంటున్నారు. మీరు అధికారంలోకి వచ్చాక మా గ్రామ సమస్యలను పరిష్కరించాలి.

నారా లోకేష్ స్పందిస్తూ

జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాష్ట్రంలోని గ్రామసీమలను నిర్వీర్యం చేశారు. జగన్ నిర్వాకం కారణంగా గ్రామాల్లో కనీసం బ్లీచింగ్ పౌడర్ చల్లేందుకు కూడా చిల్లిగవ్వలేని పరిస్థితి నెలకొంది. కొత్తగా పెన్షన్లు ఇవ్వడం చేతగాని జగన్… కుంటిసాకులతో 6లక్షల పెన్షన్లు రద్దుచేశారు. కరెంటు బిల్లు పెంచి, బిల్లు ఎక్కువ వచ్చిందని పెన్షన్ తొలగించడం అతితెలివికి నిదర్శనం. వైసిపి అధికారంలోకి వచ్చాక ఇసుక, మట్టిమాఫియాలు పెట్రేగిపోతున్నాయి. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామపంచాయితీలను ఆర్థికంగా బలోపేతం చేసి, గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. వాటర్ గ్రిడ్ ఏర్పాటుచేసి ప్రతిఇంటికీ 24/7 తాగునీరు అందేలా చేస్తాం. మాఫియాలపై ఉక్కుపాదం మోపి గ్రామాల్లో ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పుతాం.

*నారా లోకేష్ ను కలిసిన గొడుగునూరు గ్రామ ప్రజలు

బద్వేలు నియోజకవర్గం గొడుగునూరు గ్రామప్రజలు యువనేత లోకేష్ ను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. మా గ్రామంలో రోడ్డు ఇరుకుగా ఉండి రాకపోకలకు ఇబ్బందిగా ఉంది. నిత్యం ఈ రోడ్డులో చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. TDP పాలనలో మా గ్రామానికి డబల్ రోడ్డు మంజూరు చేశారు. ప్రభుత్వం మారిన వెంటనే ఈ రోడ్డు పనులు నిలిపేశారు. మీరు అధికారంలోకి వచ్చాక గతంలో మంజూరు చేసిన రోడ్డు పనులు ప్రారంభించాలి. అంతర్గత రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. గ్రామం నుండి దళితవాడకు వెళ్లే రోడ్డులో వీధిదీపాలు, రోడ్డు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. మీరు అధికారంలోకి వచ్చాక మా గ్రామ సమస్యలను పరిష్కరించాలి.

నారా లోకేష్ స్పందిస్తూ

జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రోడ్లపై తట్టమట్టి పోసే దిక్కులేదు. రాష్ట్రవ్యాప్తంగా కాంట్రాక్టర్లకు లక్షకోట్లు బకాయి పెట్టడంతో టెండర్లు పిలచినా ఎవరూ ముందుకురావడం లేదు. గత టిడిపి ప్రభుత్వంలో రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 25వేల కి.మీ. సిసి రోడ్లు వేశాం. అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజిల నిర్మాణం చేపడతాం. గొడుగునూరు గ్రామానికి గతంలో మంజూరైన డబుల్ రోడ్డు పనులను పూర్తిచేస్తాం. దళితవాడల్లో మౌలికసదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తాం.

యువనేతను కలిసిన చింతలచెరువు గ్రామస్తులు

బద్వేలు నియోజకవర్గం చింతలచెరువు గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మా గ్రామంలోని చెరువు కబ్జాకు గురైంది. చెరువులో సరిపడినంత నీటిని స్టోర్ చేయడం లేదు. చెరువును పూడ్చి స్థలాలుగా మార్చుకుంటున్నారు. ఇటుక బట్టీలు పెట్టి, నీరు నిల్వ లేకుండా చేస్తున్నారు. దీనికోసం తూములను నాశనం చేశారు. గత పాలనలో నీరు-చెట్టు పథకం కింద పనులు చేసి అలుగు వెడల్పు, ఎత్తు కూడా పెంచారు.  వైసీపీ పాలనలో అలుగు మొత్తాన్ని తవ్వి పాడుచేశారు. వర్షపు నీరు పారని విధంగా కాలువలను పూడ్చారు. మీరు అధికారంలోకి వచ్చాక మా గ్రామానికి న్యాయం చేయాలి.

నారా లోకేష్ స్పందిస్తూ

రాష్ట్రంలో వైసిపి అధికారంలోకి వచ్చాక కొండలు, గుట్టలు, చెరువులు, వాగులను నామరూపాల్లేకుండా చేశారు.  టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే కబ్జాలకు గురైన చెరువుల ఆక్రమణలను తొలగించి, యథావిధిగా నీరు నిల్వచేసే ఏర్పాటుచేస్తాం. ప్రకృతిసంపదను పరిరక్షించి సాగు, తాగునీటి సౌకర్యాలను మెరుగుపరుస్తాం.

యువనేతను కలిసిన బయనపల్లి గ్రామస్తులు

బద్వేలు నియోజకవర్గం బయనపల్లి గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడింది. ఉన్నత విద్యాభ్యాసం చేసిన మా బిడ్డలు ఉద్యోగాల కోసం పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లాల్సి వస్తోంది. వైసిపి ప్రభుత్వం అన్నక్యాంటీన్, చంద్రన్న బీమా వంటి పథకాలను రద్దుచేయడం వల్ల పేదలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మా గ్రామంలో శ్మశానవాటిక, రక్షిత మంచినీటి పథకం, డ్రైనేజీ సౌకర్యం, రోడ్లు లేక ఇబ్బంది పడుతున్నాం. మీరు అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వంలో అమలుచేసిన పథకాలన్నీ పునరుద్దరించండి.

నారా లోకేష్ మాట్లాడుతూ

రాష్ట్రంలో విధ్వంసక పాలకుడు జగన్ రెడ్డి అధికారం చేపట్టాక జె-ట్యాక్స్ కట్టలేక రూ. 10లక్షల కోట్ల విలువైన పరిశ్రమలు పొరుగురాష్ట్రాలకు తరలిపోయాయి. అమర్ రాజా, ఫ్యాక్స్ కాన్, జాకీ బనియన్స్, రిలయన్స్ తదితర సంస్థలు పరారయ్యాయి. జగన్ ప్రభుత్వంలో విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం చంద్రన్న వల్ల మాత్రమే సాధ్యం. అన్నక్యాంటీన్లలో పేదలు కడుపునిండా అన్నం తింటున్నా ఓర్చుకోలేని శాడిస్టు సిఎం జగన్. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నాక్యాంటీన్, చంద్రన్న బీమా పథకాలను పునరుద్దరిస్తాం. పరిశ్రమల ఏర్పాటు ద్వారా పొరుగు రాష్ట్రాలకు వలసలను నివారిస్తాం. బయనపల్లి గ్రామంలో రోడ్లు, డ్రైనేజి, ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తాం.

Also Read This Blog:Youth Unite, Change Ignites: Yuvagalam Padayatra Leading the Way

Tagged#LokeshPadaYatra#Padayatra#YuvaGalamLokesh#YuvaGalam#NaraLokeshPadaYatra#NaraLokesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *