మిషన్ రాయలసీమతో సీమ కష్టాలకు శాశ్వత పరిష్కారం.అధికారంలోకి వచ్చిన 5ఏళ్లలో రూపురేఖలు మారుస్తాం పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేసి ప్రతి ఎకరాకు సాగునీరు వాటర్ గ్రిడ్ ద్వారా 24/7 ఇంటింటికీ సురక్షితమైన తాగునీరు పరిశ్రమల ఏర్పాటు ద్వారా నిరుద్యోగ సమస్యకు ఫుల్ స్టాప్జో డెడ్ల బండిలా సంక్షేమం, అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాం మిషన్ రాయలసీమ సదస్సులో యువనేత నారా లోకేష్
కడప: రాయలసీమలో 119రోజులుగా 42 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1516 కి.మీ. పాదయాత్ర చేశా, సుదీర్ఘ పాదయాత్రలో సీమ ప్రజల పడుతున్న కష్టాలు చూశాను, అధికారంలోకి వచ్చాక మిషన్ రాయలసీమ ద్వారా ఈ ప్రాంతంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి అభివృద్ధి బాట పట్టిస్తామని టిడిపి యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. కడప రాజరాజేశ్వరి కళ్యాణ మండపం వద్ద మిషన్ రాయలసీమపై నిర్వహించిన సదస్సు రాయలసీమ నలుమూలల నుంచి పెద్దఎత్తున మేధావులు, రాజకీయ నాయకులు, ప్రజలు తరలివచ్చారు. ఈ సదస్సులో టిడిపి అధికారంలోకి వచ్చాక మిషన్ రాయలసీమ పేరుతో రాబోయే అయిదేళ్లలో ఏంచేస్తామనే విషయమై లోకేష్ విస్పష్టమైన విధానాన్ని ప్రకటించారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేయడం ద్వారా ప్రతి ఎకరానికి సాగునీరు, వాటర్ గ్రిడ్ ద్వారా 24/7 ఇంటింటికీ సురక్షితమైన మంచినీరు, ఆటోమోటివ్, ఎలక్ట్రానిక్ పరిశ్రమల ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన, రాయలసీమలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు, శ్రీశైలం కేంద్రంగా రాయలసీమను పర్యాటక కేంద్రంగా అభివద్ధి చేయడం… మిషన్ రాయలసీమలో అంతర్భాగాలుగా ఉన్నాయి. రాయలసీమకు అండగా నిలబడింది పసుపు జెండా, తెలుగుగంగ నుంచి హంద్రీనీవావరకు ప్రాజెక్టులను తెచ్చి సీమ ప్రజల తాగునీటి కష్టాలు తీర్చడానికి కృషిచేసింది టిడిపి, కియా, ఫ్యాక్స్ కాన్, టిసిఎల్ వంటి పరిశ్రమల ఏర్పాటుతో నిరుద్యోగ సమస్య పరిష్కారానికి చిత్తశుద్ధితో ప్రయత్నించాం, అధికారంలోకి వచ్చాక టిడిపి ప్రభుత్వంతో పోరాడైనా సరే మిషన్ రాయలసీమను అమలు చేసి తీరుతానని యువనేత Nara Lokesh స్పష్టంచేశారు. గత ఎన్నికల్లో వైసిపి తరపున 49మందిని గెలిపించారు, ఇంత భారీ మ్యాండేట్ ఇచ్చినందుకు ఎన్ని పరిశ్రమలు తేవాలి, ఎంత అభివృద్ధి చేయాలి? ఒక్క పరిశ్రమ తెచ్చారా? ఒక్క సాగునీటి ప్రాజెక్టు వచ్చిందా? అదే మ్యాండేట్ రాబోయే ఎన్నికల్లో టిడిపికి ఇవ్వండి, అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చేసి చూపిస్తామని చెప్పారు. మిషన్ రాయలసీమపై సుమారు గంటన్నరపాటు సాగిన సదస్సుకు ఐఐఎం అల్యుమినా ప్రొఫెసర్ రాజేష్ వ్యాఖ్యాతగా వ్యవహరించగా, సభికులు అడిగిన ప్రశ్నలన్నింటికీ యువనేత లోకేష్ నిర్పొహమాటంగా సమాధానాలిచ్చారు.
సదస్సులో అడిగిన ప్రశ్నలు – యువనేత లోకేష్ సమాధానాలు:
ప్రశ్న : 119 రోజులగా ఎండా, వానతో పాటు అక్కడక్కడ వైసీపీ నేతలు దాడుల్ని లెక్కచేయకుండా పాదయాత్ర చేస్తున్న మిమ్మల్ని బీసీలు, ఎస్సీ, ఎస్టీలు తమ కష్టాలు తీర్చే నాయకునిగా చూస్తున్నారు. అతికొద్ది సమయంలో లక్షలాది ప్రజల మనసుల్లో ఎలా స్థానం సంపాదించగలిగారు?
లోకేష్ : పాదయాత్ర ప్రారంభించే ముందు అన్ని వర్గాల ప్రజలు తమను ప్రభుత్వం వేధిస్తోంది…మీరు రోడ్డు మీదకు రండని చెప్పిన తర్వాతే పాదయాత్రను ప్రారంభించా. కుటుంబాన్ని చూడకుండా పాదయాత్ర చేయకుండా ఉండటానికి ప్రజల బలం, ప్రోత్సాహం కారణం. TDP నేతలు కూడా ప్రోత్సహించారు. అందరి ప్రోత్సాహం ఉండబట్టే కుటుంబం గురించి ఆలోచించకుండా నిరాటంకంగా పాదయాత్ర చేస్తున్నా. ప్రజల మనసు గెలుచుకున్న తర్వాత లోకేష్ నిజమైన నాయకుడు అవుతాడు. ప్రజల భవిష్యత్ జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది. అభివృద్ధి, సంక్షేమం జోడెద్దుల మాదిరి తీసుకెళ్లినప్పుడే నారా లోకేష్ పేరు నాయకుడు లోకేష్ అవుతారు.
ప్రశ్న : రాయలసీమ అంటే రౌడీ ఇజం..ఫ్యాక్షనిజం అనే ఆలోచన రావడం సహజం. 119 రోజుల్లో మీకు సీమ గురించి మీకు కలిగిన భావన ఏమిటి?
లోకేష్ : సీమ ప్రజలకు ఆత్మగౌరం ఎక్కువ. ఇంటికి ఎవరైనా వస్తే అప్పు తెచ్చైనా అతిధుల ఆకలి తీర్చుతారు. నడిచేటప్పుడు అప్పుడప్పుడు కొబ్బరిబోండా, బజ్జీలు, మజ్జిగ తాగి డబ్బులు ఇస్తే తీసుకోలేదు. చంద్రబాబు సీఎం అయ్యాక సీమలో ఫ్యాక్షన్ పోయింది. సీమ అంటే సెల్ ఫోన్ కంపెనీ, కియా కార్లు, మామిడి గుర్తు వస్తోంది. సీమకు మంచి అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాలకు దీటుగా సీమ జిల్లాలను తీర్చిదిద్దుతాం.
ప్రశ్న : ఇంత వరకు సీమ నుండి ఏడుగురు సీఎంలు వచ్చారు..కానీ ఇప్పటికీ అవే సమస్యలు ఉన్నాయి. బీడు భూములు, యువత ఉద్యోగాల కోసం పొరుగు రాష్ట్రాలకు వలసలు..సీమ ప్రజలకు ఎన్ని రోజులు ఈ ఇబ్బందులు?
లోకేష్ : 119 రోజుల్లో 1516 కి.మీ నడిచా. గతంలో హంద్రీనీవా ద్వారా ఈ ప్రాంత రైతులకు నీళ్లు ఇచ్చాం. సబ్సీడీపై డ్రిప్ ఇచ్చాం. ఫాక్స్ కాన్, కియా, సెల్ కాన్ లాంటి పరిశ్రమలను టీడీపీ తీసుకొచ్చింది. కానీ జగన్ వచ్చాక 4 ఏళ్లలో సీమ 30 ఏళ్లు వెనక్కి పోయింది. మహిళలు బిందెలు పట్టుకుని నీటికోసం కిలోమీటర్ల దూరం వెళ్తున్నారు. కల్తీ విత్తనాలతో రైతులు నష్టపోతున్నారు. పద్మావతి అనే చెల్లి పెనుగొండలో పాదయాత్రలో నన్ను కలిసి కియా అనుంబంధ సంస్థల్లో పని చేస్తున్నానని చెప్పింది. దానికి కారణం చంద్రబాబు అని చెప్పింది. హౌస్ వైఫ్ కాస్త ఇంటిని నడిపించే స్థాయికి వెళ్లింది. గంగాధర్ నెల్లూరులో మోహన అనే అక్క చిన్న హోటలో పెట్టుకుని ఇధ్దరు బిడ్డలను చదవించింది. కానీ వారికి ఉద్యోగాలు లేవు. ప్రభుత్వం నుండి ఏమి ఆశిస్తున్నారని అడిగితే పిల్లలకు ఉద్యోగాలు కల్పించండని అడిగింది. టీడీపీ ఐదేళ్ల పాలనలో సీమలో చేసిన అభివృద్ధి కనబడింది. వైసీపీ నాలుగేళ్ల పాలనలో సీమ ఎంత నష్టపోయిందో అర్థమైంది. టీడీపీ నేతలు, నిపుణులతో చర్చించి..మిషన్ రాయలసీమను రూపొందించాం. ఎంతో మంది ప్రయత్నించారు, సక్సెస్ కాలేదని నాతో కొందరు చెప్పారు. చేయలేమనే భయంతో మనం బతకకూడదు. అందుకే నేడు మిషన్ రాయలసీమ ప్రకటించా. సీమబిడ్డ అని కొందరు బిల్డప్ లు ఇచ్చుకున్నారు. టీడీపీ వచ్చిన 5 ఏళ్లలో సీమను ఏ విధంగా తీర్చి దిద్దాలో మిషన్ రాయలసీమ ద్వారా చేసి చూపిస్తాం.
వీడియో విజువల్: బాలకృష్ణ, కలికిరిపల్లి, చిత్తూరు జిల్లా: మామిడితోటలపై ఆధారపడి జీవిస్తున్నాను. నకిలీ పురుగుమందులతో ఇబ్బంది పడుతున్నాం, ఫ్యాక్టరీలవారు సిండికేట్ కావడంతో గిట్టుబాటు ధర రావడం లేదు, గత టిడిపి ప్రభుత్వంలో ఎక్కువ నష్టాలు వచ్చినపుడు గవర్నమెంట్ తరపున కొంత, ఫ్యాక్టరీ తరపున కొంత ఇచ్చి ఆదుకున్నారు. ఇప్పుడు అవేమీ చేయడం లేదు. నిన్న కిలో రూ.16 అన్నారు, ఇప్పుడు 12 అంటున్నారు. దళారులు సిండికేట్లుగా ఏర్పడి అన్యాయం చేస్తున్నారు.
లోకేష్ : దేశంలోనే 23 శాతం మామిడి ఏపీ నుండి ఎగుమతి అవుతోంది. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు వచ్చినా రైతులు ఇబ్బంది పడుతున్నారు. కేవలం లోకల్ వెరైటీస్ కాకుండా దేశం, ప్రపంచానికి కావాల్సిన వెరైటీ మామిడి మనం ఎందుకు పండించకూడదు? పంట కోసం కావాల్సిన రీసెర్చ్ సెంటర్లు ఏర్పాటు ఎందుకు చేయకూడదు? హార్టీ కల్చర్ ను ఉపాధి హామీకి అనుసంధానం చేస్తాం. చెరకు, మిర్చి రైతులకు గతంలో ఇబ్బంది వస్తే ఆదుకున్నాం. టీడీపీ అధికారంలోకి రాగానే ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తాం. మందులు, విత్తనాల ధరలు పెరిగాయి..వీటిని తగ్గించి వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తాం.
వీడియో విజువల్, సాయితేజ, వరగలి, తిరుపతిజిల్లా: బి.టెక్ చదివి కూడా చిరు ఉద్యోగాలు లేవు. గ్రామ వాలంటీర్ ఉద్యోగాలు తప్ప వేరేమి లేవు. 20లక్షల ఉద్యోగాలు ఏవిధంగా ఇస్తారో క్లారిటీ ఇవ్వండి.
లోకేష్ : టీడీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లలో పెట్టుబడులు తీసుకొచ్చి ఉద్యోగాలు కల్పించాము. 40 వేల పరిశ్రమల ద్వారా 6 లక్షల ఉధ్యోగాలు తెచ్చామని ఈ ప్రభుత్వం అసెంబ్లీలో చెప్పింది. డీఎస్సీ ద్వారా 35 వేల టీచర్ పోస్టులు భర్తీ చేశాం. ఎలక్ట్రానిక్ మ్యానిఫ్యాక్చరింగ్ హబ్ గా చిత్తూరును తీర్చి దిద్దాలని అనుకున్నాం. ఓల్టాస్ ఏసీ కంపెనీని తీసుకొచ్చాం. కియా వల్ల అక్కడి ప్రజల తలసరి ఆదాయం రూ.20 వేలు పెరిగింది. పెద్ద పరిశ్రమలు తెస్తే నిరుద్యోగిత పోతుంది. సీమకు వచ్చి స్పోట్స్ లో కోచింగ్ తీసుకుని వెళ్లాలా చేస్తాం. టూరిజంలో కూడా మెరుగైన అవకాశాలు ఉన్నాయి. శ్రీశైలం నియోజకవర్గంలోని అడవుల్లో 11 కి.మీ అడవుల్లో నడిచా. పెద్దఎత్తున టూరిజం ప్రోత్సహిస్తే ఉద్యోగాలు వస్తాయి. మైన్లు, సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. మైనింగ్ ఇక్కడ జరిగితే..ఇక్కడే పరిశ్రమలు పెట్టేలా పాలసీని తీసుకొచ్చి ఉద్యోగాలు కల్పిస్తాం. మన యువత వద్ద స్కిల్స్ లేక పక్క రాష్ట్రాల వారు ఉద్యోగాలు పొందుతున్నారు. అందుకే స్కిల్ అప్ గ్రేడేషన్ చేసి ఉద్యోగాలు కల్పిస్తాం. హార్టికల్చర్ ప్రోత్సహించి, డ్రిప్, డ్రోన్స్ వంటి యాంత్రీకరణ తీసుకొచ్చి యువతను ప్రోత్సహిస్తాం. అన్ని చేస్తే చంద్రబాబు అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది.
హిందూపురం, లేపాక్షి నాలెడ్జి హబ్ రైతులు: ఖరీదైన సాగుభూమిని 2006లో ప్రభుత్వానికి అప్పగించారు, చిలమత్తూరు మండల పరిధిలో భూములను ఇందూ గ్రూప్ కు అప్పగించారు. జగన్ ఈ భూమిని కేవలం 500 కోట్లకు అప్పగించేందుకు చర్యలు తీసుకున్నారు.
వెంకటరామప్ప, చిన్నపురెడ్డిపల్లి: ఇంటికో ఉద్యోగం, ఉపాధి కల్పిస్తామని 1.75లక్షలకు తీసుకున్నారు. 15ఏళ్లుగా నష్టపోయాం. పనుల్లేక బెంగుళూరు వెళ్లి కూలీ పనులు చేస్తున్నారు. ఇప్పైడునా ప్రభుత్వం కళ్లు తెరచి మా భూములు మాకు ఇవ్వండి, మా బిడ్డల భవిష్యత్తు ఏమిటి? భూములిచ్చి మాకు ఈ ఖర్మ ఏమిటి?
హిందూపూర్ రైతులు: రాజశేఖర్ రెడ్డి సిఎంగా ఉన్నపుడు నాలెడ్జి హబ్ కోసం భూములు తక్కువధరకు తీసుకున్నారు. యువకులకు ఉద్యోగాలిస్తామని చెప్పి ఇవ్వలేదు. ఉద్యోగాలకోసం బెంగుళూరు, హైదరాబాద్ కు వలసవెళ్తున్నారు. టిడిపి ప్రభుత్వం మేలుకొని ఉద్యోగాలు కల్పించాలని కోరుతున్నాము.
లోకేష్ : లేపాక్షి నాలెడ్జ్ హబ్ కు భూములు కేటాయించి 16 ఏళ్లు అయింది. పెనుగొండలో రైతుల్ని ఒప్పించి కియాకు భూములు తీసుకున్నాం .కానీ ఆ పరిశ్రమలో ఇప్పుడు 25 వేల మంది ఉద్యోగం చేస్తున్నారు. నాలెడ్జ్ హబ్ భూములు వెనక్కి తీసుకుని పరిశ్రమలు తెచ్చి యువతకు ఉద్యోగాలు కల్పిస్తాం. ఆ భూమిపై అప్పు తీసుకుని బ్యాంక్ కు కట్టకుండా ఐపి పెట్టారు. నాలెడ్జ్ హబ్ భూముల్ని రూ.500 కోట్లకు సీఎం తన బంధువులకు కట్టబెట్టాలని చూశారు. మేము పోరాడిన తర్వాత వెనక్కి తగ్గారు. మరో యేడాదిలో టీడీపీ వస్తుంది. ఆ భూముల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉద్యోగాలు ఇస్తాం.
ప్రసాద్, పాదుర్తి, కుందిర్పి మండలం, కళ్యాణ దుర్గం, అనంతపురం: 2018లో గత సిఎం చంద్రబాబునాయుడు జీడిపల్లి రిజర్వాయర్ నుంచి కృష్ణాజలాలను తరలించేందుకు కాల్వలు 30శాతం పూర్తయ్యాయి, ప్రభుత్వం మారాక కాలువ పనులు ఆగిపోయాయి, పనులు పూర్తయి ఉంటే బంగారు పంటలు పండించేవాళ్లం, 500 నుంచి 1200 వేసినా నీళ్లు పడటం కష్టం. కాల్వపనులు పూర్తిగా ఆగిపోయాయి, భార్య ఒకచోట, పిల్లలు ఒకచోట, భర్త ఒకచోట 20,30 ఎకరాలు ఉన్నవారు వాచ్ మెన్లుగా, గేట్ కీపర్లుగా పనిచేస్తున్నారు, కన్నీళ్లు వస్తున్నాయి. నిరుపేదలు కలిగిన ప్రాంతం మాది. ట్యాంకర్ల ద్వారా 3,4రోజులకు ఒకసారి నీళ్లు అరకొరగా ఇస్తున్నారు.
అనంతపురం రైతు: రాప్తాడు నియోజకవర్గం, జీడిపల్లి –పేరూరు ప్రాజెక్టు పనులు పూర్తికాలేదు, రైతులకు నష్టపరిహారం ఇవ్వలేదు, తాగునీరు, సాగునీరు లేక అవస్థలు పడుతున్నాం. పక్కరాష్ట్రాలకు వెళ్లి పనిచేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2024లో గెలిచిన వెంటనే భూనిర్వాసితులకు పరిహారం ఇప్పించండి.
లోకేష్ : 2014లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడ పెద్దఎత్తున పాగునీటి ప్రాజెక్టులు చేపట్టాం. కొన్ని 30 శాతం నుంచి 90శాతం వరకు పూర్తయ్యాయి. కానీ ఈ ప్రభుత్వం పనలు పక్కనబెట్టింది. పూర్తైన ప్రాజెక్టుల నిర్వహణ కూడా లేదు. పంప్ హౌస్ ల కరెంట్ బిల్లు కూడా కట్టడం లేదు. పట్టిసీమ ద్వారా కృష్ణా జలాలను రాయలసీమకు నీళ్లిచ్చాం..పులివెందులకు కూడా నీళ్లు ఇచ్చాం. రూ.22 వేల కోట్లతో వాటర్ గ్రిడ్ పనులు చేపట్టాం..కానీ ఈ ప్రభుత్వం నిలిపేసింది. టీడీపీ రాగానే ప్రాజెక్టులు పూర్తి చేయడంతో పాటు పిల్ల కాల్వలు కూడా పూర్తి చేస్తాం. భవిష్యత్ కు గ్యారంటీ ద్వారా ప్రతి ఇంటికీ నీటి కుళాయి ఏర్పాటును మూడేళ్లలోనే అందిస్తాం.
జెట్టి వీరేష్, లక్ష్మారి గ్రామం, కర్నూలు: చాలామంది వలస వెళ్తున్నారు. యువతకు ఉపాధి లేదు, బెంగుళూరు, మహారాష్ట్ర, ముంబాయి, పూనె వలస వెళ్తున్నారు. రైతులు ఇబ్బంది పడుతున్నారు. మంత్రాలయం నియోజకవర్గంలో తుంగభద్ర పారుతున్నా సాగు, తాగునీటి అవకాశం లేదు. ప్రభుత్వాలు ఇప్పుడైనా మంత్రాలయం నియోజకవర్గంలో యువతకు ఉపాధి కల్పిస్తూ రైతులు, నిరుద్యోగులు వలసవెళ్లకుండా ఆపాలి.
సీమ కృష్ణ, రాయలసీమ విద్యార్థి సంఘం అధ్యక్షుడు: ఇంతకుముందు కూడా ఇదే సమస్యపై లేవనెత్తాము. ఎక్కువ మిరప కోతకు వెళ్తారు, గుంటూరు, తెలంగాణాకు వెళ్తారు, తల్లి పిల్లలను వలసవెళ్లడం వల్ల పిల్లలు చనిపోయారు, 603 టిఎంసిలు సముద్రంలో కలిసి పోయాయి, సిఎం పులిబిడ్డ అయితే రాయలసీమకు నీళ్లు ఇవ్వాలి. గుండ్రేవుల ప్రాజెక్టు కడితే 30 టిఎంసిలతో సస్యశ్యామలమవుతుంది. సిద్దేశ్వరం వద్ద ఐకానిక్ బదులు రోడ్ కం బ్రిడ్జి నిర్మించాలి. సీమలో ఎర్రచందనం, బెరైటీస్, ఇతర వనరులున్నాయి. కియాను అడ్డుకున్నాం, కేసులు లేవు. ఇప్పుడు పోస్టులు పెడితే లోపలేస్తున్నారు, నీళ్లు, నిధులు, నియామకాలు కావాలి. మిషన్ రాయలసీమ ద్వారా కరువులు, వలసలు ఆపాలి.
లోకేష్: మంత్రాలయం పాదయాత్రలో గుంటూరు వలసవెళ్లి తిరిగి వస్తుండగా చూశాను, చాలా బాధకలిగింది. కుటుంబం ఇంటికి తాళం వేసి, వాహనంలో గుంటూరు వెళ్లి పనిచేసి తిరిగిరావడం చూశాను. ఇది బాబుగారు సిఎంగా ఉన్నపుడే గమనించి గుండ్రేవుల ప్రాజెక్టు శాంక్షన్ చేశాం, పనులు ప్రారంభించే సమయానికి ప్రభుత్వం మారింది. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే గుండ్రేవుల ప్రాజెక్టు పూర్తిచేస్తాం, ప్రతిఎకరాకు నీరిస్తాం, వలస కూలీలకు ఉపశమనం కలిగిస్తాం, టిడిపి అధికారంలోకి వచ్చాక సిద్దేశరంలో రోడ్ కం బ్రిడ్జి కడతాం.
నంద్యాల, ఇండస్ట్రియల్ పార్క్ వీడియో ప్రదర్శన : గత ప్రభుత్వంలో ఇండస్ట్రియల్ హబ్ వచ్చాయి. రైతులకు పరిహారం అంది పనులు 80 శాతం కూడా పూర్తయ్యాయి. పారిశ్రామిక వేత్తలకు ఈ ప్రభుత్వం భరోసా కల్పించడం లేదు. నిరుద్యోగులకు ఈ ప్రభుత్వం నిరాశే కల్పించింది.
కె.మధసూధన్ : ఇండస్ట్రియల్ హబ్ ను గత ప్రభుత్వం ప్రారంభించింది. కానీ ఈ ప్రభుత్వం నిలిపేసింది. దీంతో యువత యువత ఆశలు ఆవిరయ్యాయి. యువత పొరుగు రాష్ట్రాలకు వెళ్తున్నారు. సీడ్ పార్క్ ను టీడీపీ హయాంలో ఏర్పాటు చేయాలని పెట్టారు..కానీ అది కూడా ఆగిపోయింది..మీరు వచ్చాక వీటిని పూర్తి చేస్తారా.?
లోకేష్ : నిరుద్యోగ యువత కూడా ఆలోచించాలి. ఒక్క ఛాన్స్ తో ముద్దులు పెట్టిన మోసగాడి మాటలు వింటే ఇలాంటి పరిస్థితే ఎదురవుతుంది. చంద్రబాబు అనేక పెట్టుబడులు, పరిశ్రమలు తీసుకొచ్చారు. కానీ ఈ ప్రభుత్వం సోలార్ ఎనర్జీ ప్లాంట్, అమర్ రాజా కంపెనీ వారిని బెదిరించింది. వందల కొద్దీ పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు వెళ్తున్నాయి. కర్నూలు ప్రజలు 3 సీట్లు గెలిపించినా జైన్ ఇరిగేషన్, సోలార్, టెక్స్ టైల్ పార్క్, సీడ్ పార్క్ ను తీసుకొచ్చాం. గతంలో శిలాఫలకం వేసిన 17 నెలల్లో విమానాశ్రయాన్ని నిర్మించాం, అది టిడిపి చిత్తశుద్ధి.
ప్రశ్న, గౌరీ, ప్రొద్దుటూరు : నా భర్త ప్రొద్దుటూరు మున్సిపల్ వాటర్ పంప్ హౌస్ వద్ద పని చేస్తాడు. కరోనా సమయంలో నా భర్త చనిపోయాడు..ఆ ఉద్యోగం మాకు రావాల్సి ఉండగా..ఎమ్మెల్యే రూ.5 లక్షలు డిమాండ్ చేశాడు. మున్సిపల్ ఆఫీస్ వద్ద ధర్నా కూడా చేశాను. పిల్లల్ని పోషించుకోవడానికి కూడా నేను ఇబ్బందిపడుతున్నా. నా భర్త దూరమయ్యారు..నరకం చూస్తున్నా.
లోకేష్ : 10 నెలలు ఓపిక పట్టండి..మీకు ఉద్యోగం ఇచ్చే బాద్యత నేను తీసుకుంటా. మీ ఎమ్మెల్యే ఎంత దుర్మార్గుడో ప్రొద్దుటూరులోనే చెప్పా. టీడీపీ హయాంలో రైతులకు ట్రాక్టర్లు, డ్రిప్ అందించాం. రైతులకు గిట్టుబాటు ధర లేకపోతే ధర ప్రకటించి రైతులను ఆదుకున్నాం. ఇన్ పుట్ సబ్సీడీ, ట్రాక్టర్లు కూడా ఈ ప్రభుత్వం రద్దు చేసింది. డ్రిప్ కు కూడా ఈ ప్రభుత్వం సబ్సీడీ ఎత్తేసింది. రూ.3500 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానని మోసం చేశాడు. రూ.12,500 ఇస్తానని చెప్పిన రైతు భరోసా..రూ.7,500 మాత్రమే ఇస్తున్నాడు. మోటార్లకు మీటర్లు బిగిస్తామంటున్నారు..వాటిని పగలగొట్టండి మీకు అండగా మేము ఉంటా. రైతులకు టీడీపీ రాగానే యేటా రూ.20 వేలు ఇస్తాం. గిట్టుబాటు ధర కల్పించే బాద్యత కూడా తీసుకొస్తాం. రైతు రాజ్యం తెస్తానని..రైతులు లేని రాజ్యం తెచ్చాడు. కౌలు రైతుల ఆత్మహత్యల్లో 2వస్థానం, రైతుల ఆత్మహత్యల్లో 3వస్థానంలో ఉన్నాం. బీమాలోనూ పాత విధానం తీసుకొస్తాం.
నారాయణస్వామి : పాదయాత్రలో మీకు బాధేసిన సంఘటన ఏమిటి..ఆ సమస్యకు పరిష్కారం ఏంటి?
లోకేష్ : నన్ను కదిలించిన సంఘటన గంగాధర నెల్లూరులో మోహన్ అనే అక్క ఘటన. చిన్నపాటి హోటల్ పెట్టుకుని తన ఇద్దరు బిడ్డల్ని చదవించుకుంది. కానీ పిల్లలకు ఉద్యోగాలు లేవు. ఆమె నన్ను డబ్బులు, ఇళ్లు అడగలేదు..వారికి ఉద్యోగాలు కల్పించండని అడిగారు. ఎన్నో కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. అందుకే చంద్రబాబుతో చర్చించాక రాష్ట్రంలోని యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చాం.
శైల : మిస్బా లాంటి ఘటనలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారు.?
లోకేష్ : నంద్యాల అబ్దుల్ సలాం ఘటన నుండి ముస్లింలపై వేధింపులు మొదలయ్యాయి. ఈ ప్రభుత్వం సరిగా లేకనే ఇలాంటి ఘటనలు. సలాం ఘటనలోని వారిని శిక్షించలేదు. హజీరాబి అత్యాచారం కేసులో నేరస్తులను శిక్షించలేదు. ఎస్సీ, ఎస్టీలపైనా దాడులు జరుగుతన్నాయి. ప్రొద్దుటూరులో ఎమ్మెల్యేను ప్రశ్నించినందుకు నాపైన కోడిగుడ్లు వేశారు. ఏపీలో ప్రశ్నించే అవకాశం లేకుండా పోతోంది. ఎవరైనా తప్పు చేస్తే..చంద్రబాబు తప్పకుండా శిక్షిస్తారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో అబ్దుల్ సలాం, మిస్బా లాంటి ఘటనలు జరిగాయా.? ఎప్పుడూ లేని విధంగా బలహీన వర్గాలపై దాడులు జరుగుతున్నాయి. వైసీపీ నేతలకు శిక్షలు పడేలా చేస్తాం.
కృష్ణకుమార్ : చంద్రబాబు భవిష్యత్ కు గ్యారంటీ అని అన్నారు..మీరు ఏమైనా రాయలసీమకు గ్యారంటీ ఇస్తారా?
లోకేష్ : పెండింగులో ఉన్న ప్రాజెక్టులో పూర్తి చేసి..ప్రతి ఎకరాకు నీరు అందిస్తాం. 24 గంటల పాటు కుళాయి ద్వారా మంచినీటిని అందిస్తాం. పిల్ల కాల్వలు కూడా తవ్వించే బాధ్యత తీసుకుంటాం. ఆటోమోటివ్, ఎలక్ట్రానిక్ మ్యానిఫ్యాక్చరింగ్, డిఫెన్స్, టూరిజం, మైనింగ్.. ఈ ఐదింటిని ఫోకస్ గా అమలు చేస్తే సీమ అభివృద్ధిలో దూసుకుపోతుంది. తప్పకుండా సీమకు పరిశ్రమలు తెస్తాం. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించే బాధ్యత తీసుకుంటాం. 2014లో సగం మంది టీడీపీ అభ్యర్థులనే గెలిపించారు..కర్నూలో 3, కడపలో 1 సీటు మాత్రమే ఇచ్చారు. అయినా మేము చిన్నచూపు చూడలేదు. పులివెందులలోని చీనీ రైతులకు కూడా నీరందించాము. కర్నూలు, కడపకు పెద్దగా పరిశ్రమలు రాకపోవడానికి కారణం వైసీపీ ఎమ్మెల్యేలు సృష్టించిన అడ్డంకులే. వైసీపీకి ఇచ్చిన సీట్లు మాకు ఇవ్వండి..మేము చెప్పినవి చేయకపోతే నన్ను నిలదీయండి..నేను మాయమాటలు చెప్పను.
షేక్ ఖాశీంపీరా, ముదిరెడ్డిపల్లె గ్రామం, మైదుకూరు : సర్వే నంబర్ 46/2లో 2.12 సెంట్ల భూమి ఉంది. ఎస్పీ దగ్గరకు కేసు పెట్టడానికి వెళ్తే నువ్వు నీ భూమిలో దిగు అన్నారు..కానీ ఇంటికి వెళ్లాక వైసీపీ నేతలు బెదిరించి..మీవి ఉన్నది రెండు కొంపలు ఏం చేస్తారని బెదిరించారు.
లోకేష్ : ఎమ్మెల్యేలు యథేచ్చగా భూదోపిడీకి పాల్పడ్డారు. అవి ఆధారాలతో సహా బయటపెట్టా. కానీ తెలియదన్నట్లు అయ్యో అంటున్నారు. సిట్ ఏర్పాటు చేశారు..అదే సిట్ ద్వారా విచారణ చేసి పేదల భూమి పేదలకు అందిస్తాం. పేదలకు ఇచ్చే సెంటు స్థలంలో రూ.7 వేల కోట్ల అవినీతి జరిగింది. పేదల దగ్గర తక్కువకు కొని..ప్రభుత్వానికి ఎక్కవ ధరకు అమ్మారు. సెంటుపట్టాలో అవినీతిపై కూడా సమగ్ర విచారణ జరిపిస్తాం. ఖాసిం పీరా కుటుంబానికి న్యాయం చేస్తాం.
సుబ్రహ్మణ్యం రాజు, పుంగనూరు : మా గ్రామంలో వైసీపీ నేతలు అక్రమంగా కేసులు పెట్టారు..మమ్మల్ని ఆదుకోండి.
లోకేష్ : చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఏనాడైనా కేసులతో వేధించారా.? కానీ వైసీపీ వచ్చాక టీడీపీ నేతలపై పీడీయాక్ట్ కేసులు పెట్టి..జిల్లా బహిష్కరణ చేశారు. మొన్న మంగళగిరికి చెందిన మహిళలు బద్వేలులో ఆగితే వారిని ఓ కార్పొరేషన్ చైర్మన్ అసభ్యంగా మాట్లాడారు. నాయకులకు, కార్యకర్తలకు అండగా ఉంటాం. మా నేతలపై పెట్టిన తప్పుడు కేసుల పట్ల న్యాయ విచారణ చేసి చర్యలు తీసుకుంటాం.
శ్వేత : పెట్రోల్ రూ.80 లకు వస్తేనే తాత టీవీఎస్ బయటకు తీస్తా అంటున్నారు..ఆ పరిస్థితి వస్తుందా.?
లోకేష్ : కర్నాటక – ఆంధ్రాకు పెట్రోల్ ధర వ్యత్యాసం రూ.13 ఉంది. పెట్రోల్, డీజిల్ పై ఈ ప్రభుత్వం దేశంలోనే అధికంగా రూ.30 సెస్ వేస్తోంది. పన్నుల ప్రక్షాళన చేసి తగ్గించే ధరలు తగ్గించే బాధ్యత టీడీపీ తీసుకుంటుంది. వీటి ధరలు తగ్గితేనే నిత్యవసర సరుకుల ధరలు కూడా తగ్గుతాయి. గ్యాస్ ధర రూ.1,350లకు పెరిగింది. విద్యుత్ ఛార్జీలు 8 సార్లు, బస్ ఛార్జీలు 3 సార్లు పెరిగాయి.
వీడియో విజువల్, మన్నయ్య, పెద్దవూరు, రాజంపేట : అరటి, బొప్పాయి, పరిహారం లేదు. వ్యాపారులు, దళారులు కుమ్మక్కు కావడంతో మాకు గిట్టుబాటు ధర రావడం లేదు.
లోకేష్ : నకిలీ విత్తనాల వల్ల రైతులు నష్టపోతున్నారు. జమ్మలమడుగులో మునిరెడ్డి అనే రైతును కలిశాను..కర్నూలు ఎంపీ నకిలీ పత్తి విత్తనాలు పంపిణీ చేశారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కల్తీ విత్తనాల సరఫరాలేదు. మంచి విత్తనాలు సరఫరా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. హార్టికల్చర్ ను ప్రోత్సహించడంతో పాటు..కంపెనీ వారితో ఒప్పందం కుదిర్చాము.
రైల్వేకోడూరు యువకుడు : రైల్వేకోడూరులో విద్యార్థులకు డిగ్రీ కాలేజీ ఒక్కటే ఉంది. కాలేజీలో సరైన సౌకర్యాలు లేవు. ఆర్టీసీ బస్సు గతంలో నడిచేది ఇప్పుడు లేదు. కాలేజీకి వెళ్లాలంటే రైల్వే లైన్ దాటుకుని వెళ్లాలి. స్థానిక ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాస్ బ్రిడ్జి నిర్మిస్తామని చెప్పారు..కానీ పట్టించుకోలేదు. గ్రీన్ ఫీల్డ్ రహదారి మంజూరైంది. ఆ లైనులో వైసీపీ నేతలు 700 ఎకరాల దాకా అక్రమంగా దోచుకున్నారు. మా ప్రాంతంలో ప్రతి సీజన్ లో బొప్పాయి, అరటి రైతులు మోసపోతున్నారు.
లోకేష్ : గ్రామీణ ప్రాంత ప్రజల అవస్థలను గమనించి పల్లె వెలుగు బస్సులు ప్రతి గ్రామానికి టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కానీ ఈ ప్రభుత్వం బస్ ఛార్జీలు 3 సార్లు పెంచింది. మీ గ్రామంలో బస్ సౌకర్యం కల్పిస్తాం. ఆడపడుచులకు ఉచిత బస్ సౌకర్యం కల్పిస్తాం. యువతపై పెట్టిన అక్రమ కేసులు తొలగిస్తాం. నాపై అట్రాసిటీ కేసులు పెట్టారు. భూఅక్రమాలపై సిట్ వేస్తాం చర్యలు తీసుకుంటాం. ఈ ప్రభుత్వంలో రౌడీషీట్ ఉంటే రాజకీయంగా అర్హత సాధించినట్లే. ఎక్కువ కేసులు ఉన్నవారికే రాబోయే రోజుల్లో నామినేటెడ్ పోస్టులు ఇస్తాం. నాపై మర్డర్ కేసు, ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టారు. భయం మా బయోడేటాలో లేదు. టిడిపి అధికారంలోకి రాగానే తప్పుడు కేసులు ఎత్తేస్తాం.
ప్రతాప్ రెడ్డి, ఆదోని : టీడీపీ హయాంలో ఆదోనికి డిగ్రీ కాలేజీ మంజూరైంది. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక దాని ఊసే లేదు. మాకు డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయాలి. టమోటా రైతులకు జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామన్నారు. కానీ చేయలేదు.
లోకేష్ : ఆదోనికి మేము డిగ్రీ కాలేజీ మంజూరు చేశాం..ఈ ప్రభుత్వం నిర్మించలేదు. మళ్లీ మేమొచ్చాక 3 ఏళ్లలో డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేస్తాం. మిషన్ రాయలసీమలో భాగంగా రూపురేఖలు ఎలా మార్చాలి..వలసల నివారణ, నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలన్నది లక్ష్యం. సాగునీటి ప్రాజెక్టుల పూర్తి, పిల్ల కాల్వల తవ్వకం, ఇంటింటికీ మంచి నీరు ఇవ్వాలన్నది లక్ష్యం. టీడీపీ వచ్చిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన ఇచ్చిన హామీలను అమలు చేస్తాం. ఆటోమోటార్, ఎలక్ట్రానిక్ పరిశ్రమలు, డిఫెన్స్ సంస్థలు, స్పోర్ట్ర్ యూనివర్సిటీ, మైనింగ్ కంపెనీలు తెచ్చే బాధ్యత తీసుకుంటాం. స్వయం ఉపాధి ద్వారా సబ్సీడీలు పెంచుతాం. పాడి రైతులకు ఫీడ్, బీమా, రుణాలు అందించే బాధ్యత టీడీపీ తీసుకుంటుంది. గొర్రెల పెంపకం దారులను ప్రోత్సహిస్తాం. టూరిజం కేంద్రంగా రాయలసీమను తీర్చిదిద్దుతాం. మెరుగైన సదుపాయాలు కల్పిస్తే టూరిజం హబ్ గా మార్చవచ్చు. టీడీపీ వచ్చాక టూరిజం అభివృద్ధి చేసి ఉద్యోగాలు కల్పిస్తాం. ఆసుపత్రులున్నా..ఇంకా రావాల్సి ఉంది. ఉమ్మడి జిల్లా కేంద్రంగా మెరుగైన వైద్య సేవలు అందిస్తాం. కేన్సర్ యూనిట్లు ఏర్పాటుకు అనుమతి ఇస్తే ఈ ప్రభుత్వం రద్దు చేసింది. ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునీకరిస్తాం. సీమలో ముగ్గురినే టీడీపీ ఎమ్మెల్యేలను గెలిపించారు. నాలుగేళ్లలో సీమకు ఒక్క పరిశ్రమ వచ్చిందా…ఒక్క ప్రాజెక్టైనా పూర్తి చేశారా? వైసీపీకి ఇచ్చిన మెజారిటీ మాకు ఇవ్వండి..మిషన్ రాయలసీమను పూర్తిస్థాయిలో అమలు చేస్తాం. మీ సమస్యలు చూశా..మీ కన్నీరు తుడిచేందకు ఈ మిషన్ రాయలసీమ విధానం చేపట్టాం. నాడు – నేడు ఎప్పుడూ సీమకు అండగా ఉంది టీడీపీనే. తెలుగు గంగ నుండి హంద్రీనీవా వరకు సీమలో నీటి ప్రాజెక్టులు చేపట్టింది టీడీపీనే. సీమ ప్రజల్ని కోరుతున్నా..మీ కన్నీళ్లు తుడవాలంటే వైసీపీకి ఇచ్చిన ఎమ్మెల్యేల సంఖ్యా బలాన్ని మాకివ్వండి.
Also Read This Blog: Footprints of Change: Yuvagalam Padayatra Empowering the Next Generation
Tagged: #LokeshPadaYatra#Padayatra#YuvaGalamLokesh#YuvaGalam#NaraLokeshPadaYatra#NaraLokesh