యువగళానికి జన ప్రభంజనం యువనేతను చూసేందుకు కిక్కిరిసిన జనం  దారిపొడవునా లోకేష్ కు అపూర్వ స్వాగతం

మైదుకూరు: అరాచకపాలనను అంతమొందించడమే లక్ష్యంగా యువనేత Nara lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర మైదుకూరు పట్టణంలో జనప్రభంజనంలా మారింది. 115వరోజు పాదయాత్ర మైదుకూరు శివారు విశ్వనాథపురం నుంచి ప్రారంభమైంది. యువనేత పాదయాత్ర సందర్భంగా మైదుకూరు పట్టణం పసుపుమయమైంది. పట్టణ వీధుల్లో యువనేతకు వివిధ వర్గాల ప్రజలు భారీగా ఎదురేగి హారతులు పట్టి అపూర్వ స్వాగతం పలికారు. లోకేష్ ని చూసేందుకు మహిళలు, యువత, వృద్దులు పెద్దఎత్తున రోడ్లపైకి వచ్చారు. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ యువనేత ముందుకు సాగారు. వివిధ వర్గాల ప్రజలు లోకేష్ ను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలో సమస్యలను స్థానిక ప్రజలు లోకేష్ దృష్టికి తెచ్చారు. జగన్ పాలనలో అందూ బాధితులే, జగన్ పన్నుల బాదుడు కారణంగానే నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని లోకేష్ తెలిపారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పన్నుల భారం తగ్గిస్తామన్నారు. మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలో పేరుకుపోయిన సమస్యలు, తాగునీటి సమస్య ను టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే శాశ్వతంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మైదుకూరు పట్టణ ప్రజలు, ఉల్లిరైతులు, కిడ్నీ బాధితులు, వివిధ గ్రామాల ప్రజలు యువనేతను కలిసి వినతిపత్రాలు సమర్పించారు. మరో ఏడాదిలో రాబోయే చంద్రన్న ప్రభుత్వం అందరి సమస్యలు పరిష్కరిస్తుందని చెప్పి యువనేత ముందుకు సాగారు. 115వరోజున లోకేష్ 10.2 కి.మీ. దూరం పాదయాత్ర చేశారు. ఇప్పటివరకు యువగళం పాదయాత్ర 1480.6 కి.మీ మేర కొనసాగింది.

యువనేత ఎదుట వ్యక్తమైన సమస్యలు:

ధరలేక పంటను చేలోనే వదిలేశాను! -చెన్నారెడ్డి, రైతు, చాపాడు

గతేడాది 8 ఎకరాలు అరటితోట సాగు చేశా. రూ.12 లక్షలు పెట్టుబడి అయింది. కానీ గెలలు మాత్రం చెట్లకే ఉన్నాయి. రేటు లేకపోవడంతో కోస్తే ఖర్చులకు కూడా రావని వదిలేశా. ఒక్క కోత మాత్రమే కోశా..అప్పుడు రూ.2.30 లక్షలు వచ్చాయి. ఇక కోసింది లేదు. రైతు భరోసా కేంద్రాల్లో వైసీపీ వాళ్లకే మందులు ఇస్తున్నారు. ఏమన్నా చెప్పాలన్నా భయంగా ఉంది. ఏం చెప్తే పోలీసులు వచ్చి ఇంటి ముందు తెల్లవారుజామున వాలిపోతారని భయపడుతున్నాం. ఇళ్లు కట్టుకోవడానికి ఇసుక కూడా అందుబాటులో ఉండటం లేదు. కడప జిల్లాకు ఉన్న ఇసుక వనరులు ఏజిల్లాలో లేదు. అయినా ఇసుక కోసం అవస్థ పడుతున్నాం. ఇక్కడి ఇసుక నెల్లూరు, పొరుగు రాష్ట్రాలకు తరలించుకుంటూ సొమ్మ చేసుకుంటున్నారు.

చదువులేదని దుల్హాన్ ఇవ్వలేదు -షేక్.హబీదా, మైదుకూరు

నాలుగు నెలల క్రితం నా కూతురుకు వివాహం చేశా. దుల్హన్ కింద ఆర్థిక సాయం కోసం అప్లై చేశా. నా అల్లుడు పదవ తరగతి చదవారు. కానీ నా కూతురు తొమ్మది వరకే చదవింది. ఇద్దరికీ పదవ తరగతి సర్టిఫికేట్ ఉంటేనే దుల్హన్ వస్తుందని చెప్పారు. దీంతో చేసేదేమీ లేక చేసిన అప్పును తీర్చేందుకు చీటీలు కడుతున్నా. నాకు భర్త కూడా లేడు. కనీసం తండ్రి లేని కూతుళ్లకైనా నిబంధనలు సడలించి దుల్హన్ అమలు చేస్తే..మాలాంటి తల్లులకు ఆర్థిక భారం తగ్గుతుంది.

తప్పుడు కేసుపెట్టి షాపు తొలగించారు -వెంకటసుబ్బయ్య, మైదుకూరు

నేను పాత ఇనుము కొనుగోలు చేసి వ్యాపారం చేస్తుంటా. రెండేళ్ల క్రితం వైసీపీ నేతలు వచ్చి నా షాపును తొలగించారు. నేను కొనుగోలు  చేయని ఇనుమును కొనుగోలు చేశానని బెదిరించారు. అవసరమైతే సీసీ కెమరాలు చెక్ చేసుకోండని చెప్తే..ఏంట్రా చూసేది అని దౌర్జన్యం చేశారు. రెండేళ్లుగా షాపు పెట్టుకోవాలన్నా భయం వేస్తోంది. వైసీపీ నేతలు కాలువల్లో పూడిక తీయకుండా బిల్లులు మార్చుకున్నారు. దాన్ని ఫోటోలు తీసి, సోషల్ మీడియాలో పెట్టినందుకు నా కాలు విరగ్గొట్టారు. నాపై దాడి జరిగిందని పోలీస్ స్టేషన్ కు వెళ్లి కేసు పెడితే..తిరిగి నాపైనే కేసు పెట్టి జైల్లో పెట్టారు.

పెన్షన్ ఇవ్వకుండా ఇచ్చినట్లు రాసుకున్నారు -విమల, మైదుకూరు

నా భర్త చనిపోయి మూడేళ్లు అయింది. నాకు రేషన్ కార్డు లేదు..పెన్షన్ రాదు. కానీ పెన్షన్ రెండేళ్లుగా పెన్షన్ వస్తున్నట్లు పుస్తకంలో రాశారు. నాకు ఇంటి పట్టా కూడా ఇవ్వలేదు..అయినా సెంటు పట్టా వచ్చిందని పుస్తకంలో వేశారు. సచివాలయంలోకి వెళ్లి నాకు పెన్షన్ వస్తోంది, సెంటు స్థలం ఇచ్చినట్లు పుస్తకంలో వేశారని అడిగితే..పుస్తకంలో వచ్చింది కాబట్టి పెన్షన్, సెంటు స్థలం ఇస్తామని చెప్పారు. కానీ నాలుగు నెలలుగా తిప్పుకుంటున్నారు తప్ప నాకు స్థలం ఇవ్వలేదు.

ఒక్క ఛాన్స్ ఇస్తే ప్యాలెస్ లో పడుకున్నాడు!  నాలుగేళ్లలో రూ.12లక్షల కోట్ల అప్పు చేసారు

చీకట్లో గుడ్లు విసరడం కాదు… దమ్ముంటే నేరుగా రండి! మైదుకూరును కబ్జాలకు నిలయంగా మార్చిన రఘురామరెడ్డి

బహిరంగసభలో విరుచుకుపడిన యువనేత నారా లోకేష్

మైదుకూరు: ఎన్నికల సమయంలో జగన్ ఒక్క ఛాన్స్..ఒక్క ఛాన్స్ అన్నాడు, ఒక్క చాన్స్ ఆయన ఇస్తే పీకింది ఏంటి? రాష్ట్రాన్ని నాశనం చేసి ప్యాలస్ లో పడుకున్నాడని టిడిపి యువనేత నారా లోకేష్ దుయ్యబట్టారు. మైదుకూరు  రాయలకూడలిలో నిర్వహించిన బహిరంగసభలో లోకేష్ మాట్లాడుతూ… అధికారంలోకి వచ్చాక 12 లక్షల కోట్ల అప్పు చేసారు . పుట్టే ప్రతి బిడ్డ మీద జగన్ చేసిన అప్పు రూ.2 లక్షలు .పరదాలు లేకపోతే ప్యాలస్ పిల్లికి పులుసు కారిపోవడం ఖాయం.  ఒక్క రోజు పరదాలు లేకుండా వెళితే ప్యాలస్ పిల్లిపై ఏం పడతాయో గెస్ చెయ్యండి.  కోడిగుడ్లు, టొమాటోలు, చెత్త , చెదారం అన్నీ ప్యాలస్ పిల్లిపై పడతాయినేను మరో సారి చెబుతున్నా సాగనిస్తే పాదయాత్ర..అడ్డుకుంటే దండయాత్ర. ప్రొద్దుటూరు లో చూసింది ట్రైలర్ మాత్రమే నేను చిటికేస్తే గుడ్డు విసిరిన వాడు కనిపించే వాడు కాదు. నాకు మా నాన్న అంత ఓపిక అసలు లేదు. అడ్డుకుంటాం అంటూ ఎవడైనా వస్తే దబిడి దిబిడే. 

ఎదురొచ్చి నిలబడితే మా సత్తా చూపిస్తాం

యువగళం…మనగళం…ప్రజాబలం. యువగళం దెబ్బకి ప్యాలస్ పిల్లి భయపడింది. కడప గడ్డపై యువగళం ప్రభంజనం చూసి ప్యాలస్ పిల్లికి నిద్ర పట్టడం లేదు.  వైసిపి పార్టీ గుర్తు మారింది. ఫ్యాన్ కాదు కోడి గుడ్డు. నా పై ప్యాలస్ పిల్లి కోడిగుడ్లు వేయించాడు. క్లైమోర్ మైన్లకే భయపడని ఫ్యామిలీ మాది, నీ తొక్కలో కోడి గుడ్డుకు భయపడతామా? కోడి గుడ్డు వేసిన  సైకో  గాళ్ళకి మనవాళ్లు మొహం మీద ఆమ్లెట్ వేసి పంపారు. సైకోస్ చీకట్లో కోడిగుడ్లు విసరడం కాదు దమ్ముంటే నేరుగా వచ్చి నిలబడండి. పసుపు సైన్యం పవర్ ఏంటో చూపిస్తాం. మైదుకూరు మాస్ జాతర అదిరిపోయింది.  ఎంతో మహిమగల మాధవరాయుడు ఆలయం ఉన్న పుణ్య భూమి మైదుకూరు. పేరులోనే కాదు తెలివైన ప్రజలు ఉన్న ప్రాంతం మైదుకూరు. కాల జ్ఞానం రాసిన బ్రహ్మం గారు నడిచిన గొప్ప నేల మైదుకూరు. ఎంతో చరిత్ర ఉన్న ఆధ్యాతిక నేల పై పాదయాత్ర చెయ్యడం నా అదృష్టం.

కడప అభివృద్ధిపై బహిరంగ చర్చకు రండి!

జగన్ పదే పదే కడప బిడ్డని అంటాడు. పులివెందుల బస్ స్టాండ్ కట్టడానికి నాలుగేళ్లు పట్టింది.  జిల్లాకి నువ్వు చేసింది ఏమైనా ఉంటే ప్రెస్ మీట్ పెట్టి చెప్పే  దమ్ముందా? సత్తా ఉందా? కడప కి ఏం చేసామో చెప్పే దమ్ము నాకుంది. ఏ సెంటర్ కి వస్తావో రా, కడపకు నువ్వు ఎం చేసావో మేము ఏం చేసామో చర్చించుకుందాం ఇచ్చిన ఒక్క హామీ అయినా నిలబెట్టుకున్నావా? ఎన్నికలకు ఆరు నెలల ముందు కొబ్బరికాయ కొడితే సినిమా అన్నావ్. నువ్వు కొబ్బరి కాయలు కొట్టి నాలుగేళ్లు అవుతుంది, నువ్వు పీకింది ఏంటి కడప ఉక్కు ఫ్యాక్టరీ ఏం అయ్యింది?  అన్నమయ్య బాధితులకు న్యాయం ఎప్పుడు చేస్తావ్? టిడిపి హయాంలో కడప జిల్లాల్లో ప్రాజెక్టులు కడితే…జగన్ హయాంలో ప్రాజెక్టులు పడగొట్టాడు. సొంత జిల్లా కి ఉపయోగపడని సీఎం జగన్. నేను వచ్చి నిలదీసిన తరువాత ప్రభుత్వం నిద్రలేచింది. నిన్న హడావిడి గా గండికోట నిర్వాసితులకు న్యాయం చేస్తాం అంటూ అధికారులు హడావిడి మొదలుపెట్టారు. అది యువగళం పవర్. నాలుగేళ్లు పసుపు రైతుల వద్ద పసుపు కొనలేదు. ఇప్పుడు నేను జిల్లాలో తిరుగుతున్నాను అని హడావిడిగా పసుపు కొంటాం అంటూ బయలుదేరారు. అది యువగళం దెబ్బ.

సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన జగన్

ఎవరైనా సీఎం అయితే ప్రజలకు ఇంకా ఏమి చెయ్యాలి అని ఆలోచిస్తారు. జగన్ మాత్రం ఉన్న సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసాడు. అన్న క్యాంటిన్ రద్దు, పండుగ కానుక రద్దు, పెళ్లి కానుక రద్దు, చంద్రన్న భీమా రద్దు, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ రద్దు, ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు, 6 లక్షల పెన్షన్లు రద్దు, డ్రిప్ ఇరిగేషన్ రద్దు. 100 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన సిఎం జగన్. భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో చంద్రన్న మహానాడులో మ్యానిఫెస్టో ప్రకటించగానే తాడేపల్లి ప్యాలస్ లో భూకంపం వచ్చింది. ప్యాలస్ పిల్లి జడుసుకుంది. యువగళం పాదయాత్రలో ప్రజల కష్టాలు చూశాకే మినీ మ్యానిఫెస్టో ప్రకటించాం. కష్టాలు చూసాను…కన్నీళ్లు తుడుస్తాను. నిత్యావసర సరుకుల ధరలు, పన్నుల పెంపు తో బ్రతుకు భారం గా మారిన మహిళల కష్టాలు నేను చూసాను. నా అక్క, చెల్లెమ్మల కన్నీళ్లు తుడిచే బాధ్యత నాది. రాష్ట్రంలో ప్రజల కష్టాలు చూశాకే చంద్రన్న మహానాడులో మినీ మ్యానిఫెస్టో ప్రకటించారు. మహాశక్తి పథకం కింద… ఆడబిడ్డ నిధి:- 18 ఏళ్లు నిండిన మహిళలకు – నెలకు రూ.1500 అంటే ఏడాదికి రూ.18 వేలు, 5 ఏళ్లకు రూ.90 వేలు. తల్లికి వందనం:- ప్రతి తల్లికి ఏడాదికి రూ.15 వేలు  దీపం పథకం:- ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం.  ఉచిత ప్రయాణం:- మహిళలకు ఉచిత ప్రయాణం. జగన్ మూడు సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచితే..మీ అన్న చంద్రన్న టికెట్ లేకుండా చెయ్యబోతున్నారు.

నిరుద్యోగులకు యువగళం భృతి ఇస్తాం

  యువగళాన్ని విన్నాం. ప్రభుత్వ, ప్రైవేట్, స్వయం ఉపాధి ద్వారా 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. నిరుద్యోగ యువతకు యువగళం నిధి కింద నెలకు రూ.3000 ఇస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడాది నోటిఫికేషన్ ఇస్తాం. అన్ని జిల్లాల్లో స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేస్తాం. విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు దొరకని దిక్కుమాలిన పరిస్థితి జగన్ పాలనలో ఉంది. నకిలీ విత్తనాలు, గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతున్నారు. రైతుల బాధలు చూసాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నదాతకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తాం. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు అందించి గిట్టుబాటు ధర కల్పిస్తాం. ఉద్యోగస్తులు, పోలీసులు, రిటైర్డ్ ఉద్యోగస్తులు పడుతున్న ఇబ్బందులు నాకు తెలుసు. ఒకటో తారీఖున జీతం, మీ బకాయిలు తీర్చేది టిడిపి ప్రభుత్వమే. టిడిపి హయాంలో ఏదైనా సమస్య ఉంటే ప్రభుత్వం తో చర్చలు జరిపేవారు. ఇప్పుడు ఏకంగా జగన్ ఉద్యోగ సంఘాల నేతల్నే అరెస్ట్ చేసి జైలుకి పంపుతున్నాడు

బిసిలకు ప్రత్యేక రక్షణ చట్టం తెస్తాం!

బీసీలు పడుతున్న కష్టాలు నేను చూసాను. 26 వేల అక్రమ కేసులు, నిధులు, కుర్చీలు లేని కార్పొరేషన్లు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఉపకులాల వారీగా నిధులు, బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాం 27 దళిత సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసాడు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే దళితులను వేధించిన వారిని కఠినంగా శిక్షిస్తాం. జగన్ రద్దు చేసిన 27 దళిత సంక్షేమ కార్యక్రమాలను తిరిగి ప్రారంభిస్తాం. జగన్ పాలనలో మైనార్టీలను చిత్ర హింసలకు గురిచేసాడు. అబ్దుల్ సలాం, కరీముల్లా, ఇబ్రహీం, మిస్బా, హాజిరా… ఇలా ఎంతో మంది బాధితులు. మైనార్టీలకు ఉన్న అన్ని సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసాడు. దుల్హన్, విదేశీ విద్య, రంజాన్ తోఫా, ఇమామ్, మౌజమ్ లకు గౌరవ వేతనం, మసీదుల అభివృద్ధి కి నిధులు కూడా ఇవ్వడం లేదు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పాత పధకాలు అమలు చెయ్యడంతో పాటు, ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తాం. రెడ్డి సోదరులు కూడా ఆలోచించాలి. 2019 ఎన్నికల్లో మీరు ఎంతో కష్టపడి డబ్బు ఖర్చు చేసి జగన్ ని గెలిపించుకున్నారు. ఇప్పుడు మీకు కనీస గౌరవం అయినా ఉందా? నాడు-నేడు అన్ని సామాజిక వర్గాలకు సమాన గౌరవం ఇచ్చింది ఒక్క టిడిపి మాత్రమే.

కబ్జా కింగ్ గా మారిన రఘురామిరెడ్డి

మైదుకూరు లో మ్యాజిక్ చేస్తారని రఘురామిరెడ్డి గారిని భారీ మెజారిటీ తో గెలిపించారు. మైదుకూరు ఏమైనా మారిందా? ఒక్క అడుగు ముందుకు వెయ్యలేదు. ఒక్క అభివృద్ది కార్యక్రమం జరగలేదు. ఆయన మైదుకూరు ని భూకబ్జాలు, కమిషన్లు, ఇసుక దందా కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చారు.  ఆయన బాధితులు కోర్టులో కేసులు వేసారు. కొంత మంది పాదయాత్రలు కూడా చేసారు.  దువ్వూరు మండలం చింతకుంటలో సర్వే నెంబర్ 1396-2 లో 80 ఎకరాల భూమిని ఎమ్మెల్యే, ఆయన అనుచరులు కలిసి లేపేశారు. బాధితులు పాదయాత్రకు చేస్తుంటే నాయ్యం చేస్తామని నమ్మించి పాదయాత్ర ఆపేసారు పోలీసులు. ఈ రోజు వరకూ వారికి న్యాయం జరగలేదు. దువ్వూరు మండలం ఎర్రబెల్లి కి చెందిన అక్బర్ బాషాకి చెందిన భూమిని దొంగ పాత్రలతో  సృష్టించి ఆక్రమించేశారు. ఈయన సేల్పి వీడియోతో ఆత్మహత్యాయత్నం కు పాల్పడ్డారు, నేటికి న్యాయం జరగలేదు. దువ్వూరు మండలం ఎర్రబల్లె కు చెందిన పాశం లక్ష్మీ నరసింహకు చెందిన సర్వే  612 లో రెండు ఎకరాల విస్తీర్ణాన్ని ఎమ్మెల్యే బామ్మర్ది నారాయణరెడ్డి పేరు మీద తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకుని కబ్జా చేశారు. బాధితుడికి అనుకూలంగా కోర్టు తీర్పు వచ్చినా ఇప్పటి వరకూ ఆ భూమి బాధితుడికి ఇవ్వలేదు.  కాజీపేట మండలంలో భీమటం, మైదుకూరు, చాపాడు మండలంలో అసైన్మెంట్ కమిటీ ద్వారా నిబంధనలకు విరుద్ధంగా భూములు కొట్టేయడానికి స్కెచ్ వేసారు ఎమ్మెల్యే.రాజోలి ఆనకట్ట ఎత్తిపోతల పథకం తదితర పనులకు దక్కించుకున్న కాంట్రాక్టర్ల నుంచి భారీగా కమిషన్లు దండుకున్నారు . సిసి రోడ్లు, డ్రైనేజ్ ఇలా ఏ అభివృద్ధి కార్యక్రమం చెయ్యాలి అన్నా కప్పం కట్టాల్సిందే. ఆఖరికి బిల్లులు ఆపి మరీ కమిషన్ వసూలు చేస్తారు .

రిజర్వ్ ఫారెస్ట్ ను కూడా ఆక్రమించిన ఘనుడు

ఆఖరికి రిజర్వ్ ఫారెస్ట్ ల్యాండ్ కూడా ఆక్రమించుకున్నారు ఎమ్మెల్యే. నంద్యాల పేట గ్రామంలో సర్వే నెంబరు 506బి లో 104 ఎకరాల భూమి అక్రమంగా ఆక్రమించి ఇనుప కంచె వేసారు. కోర్టు ఆర్డర్ ప్రకారం 6 నెలల లోపు భూమిని హ్యాండోవర్ చేసుకోమని చెప్పినా అధికారులు హ్యాండోవర్ చేసుకొలేదు.  చాపాడు మండలం వెదురూరులో 12 ఎకరాల్లో ఇసుక తవ్వకానికి అనుమతులు ఇచ్చారు. కానీ వైసిపి నేతలు వందల ఎకరాల్లో ఇసుక తవ్వేసారు. అక్రమార్కుల పై చర్యలు తీసుకొని, రికవరీ చెయ్యమని కోర్టు ఆదేశాలు జారీ చేసినా ఈ రోజు వరకూ యాక్షన్ నిల్లు. కుందు నదిని ఎమ్మెల్యే, ఆయన అనుచరులు కలిసి ఇసుక దోపిడీ చేస్తున్నారు. పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకొని మున్సిపాలిటీలో ఎన్నికల్లో 12 వార్డులు గెలుచుకున్న టిడిపి కౌన్సిలర్లను ఇబ్బంది పెట్టి అధికారం  దక్కించుకున్నారు. అంతేకాక పోరాడిన పుట్టా సుధాకర్ యాదవ్ గారిపై అక్రమ కేసులు పెట్టారు. అధికారంలోకి రాగానే చట్టాన్ని అతిక్రమించి వ్యవహరించిన అధికారుల పై చర్యలు తీసుకుంటాం.

మైదుకూరుకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?

పాదయాత్ర లో భాగంగా మైదుకూరుకి అనేక హామీలు ఇచ్చాడు జగన్. పోతిరెడ్డిపొడు హెడ్ రెగ్యులేటర్, తెలుగు గంగ కాలువ, కె.సి.కెనాల్, నిప్పులవాగు కాలువల సామర్థ్యాన్నిపెంచుతా అన్నాడు. పెండింగ్ ప్రాజెక్టులు అన్ని పూర్తి చేస్తా అన్నాడు. ఇచ్చిన ఒక్క హామీ నిలబెట్టుకోలేదు. టిడిపి హయాంలో మైదుకూరు కి మహర్దశ పట్టింది.  సాగు,తాగునీటి ప్రాజెక్టులు, రోడ్లు, సిసి రోడ్లు, డ్రైనేజ్ ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసింది టిడిపి.  నియోజకవర్గం లో కాలేజీలు, కమ్యూనిటీ భవనాలు కట్టింది టిడిపి. కానీ మీరు పాలిచ్చే ఆవుని వద్దనుకుని తన్నే దున్నపోతుని తెచ్చుకున్నారు. వచ్చే ఎన్నికల్లో టిడిపిని భారీ మెజారిటీ తో గెలిపించండి. మైదుకూరు లో పెండింగ్ పనులు అన్ని పూర్తి చేస్తాం. పసుపు, కెపి ఉల్లి, వరి, పత్తి రైతులు పడుతున్న కష్టాలు నాకు తెలుసు. పెట్టుబడి తగ్గించి, గిట్టుబాటు ధర కల్పించే బాధ్యత నేను తీసుకుంటాను. మైదుకూరు మున్సిపాలిటీని అభివృద్ధి చెయ్యడంతో పాటు నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీరు అందిస్తాం . నియోజకవర్గంలో పేదలకు టిడ్కో ఇళ్లు నిర్మిస్తాం.  మైదుకూరు కి అభివృద్ధి ని పరిచయం చేస్తాం. టిడిపి నాయకులు, కార్యకర్తల పై కేసులు పెట్టి వేధించిన వారిని విడిచిపెట్టను, మైదుకూరు లో ఉన్నా మలేషియా పారిపోయినా పట్టుకొచ్చి లోపలేస్తా. కార్యకర్తల్ని కాపాడుకునే బాధ్యత నాది.

నారా లోకేష్ ను కలిసిన నాగాయపల్లె గ్రామ రైతులు

మైదుకూరు నియోజకవర్గం నాగాయపల్లె రైతులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. మా గ్రామ ప్రజలంతా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నాం. వ్యవసాయానికి మాకు కేసీ కెనాల్ నుండి నీరు అందుతుంది. వైసీపీ పాలనలో కాలువ మరమ్మతులు చేయకపోవడంతో నీరు సరిగా రావడం లేదు. మీరు అధికారంలోకి వచ్చాక కేసీ కెనాల్ మరమ్మతులు చేయించాలి. పొలం వెళ్లేందుకు నాగాయపల్లె నుండి నెర్రవాడ కు సరైన రోడ్డు మార్గం లేదు. వైసీపీ నాయకులను ఎన్నిసార్లు అడిగినా రోడ్డు గురించి పట్టించుకోవడం లేదు. సోమాపురం నుండి ఎస్సీకాలనీకి సరైన రోడ్డు లేక రైతులు ఇబ్బందిపడుతున్నారు. గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదు, ఎవరూ పట్టించుకోవడం లేదు. మీరు అధికారంలోకి వచ్చాక రోడ్లు, డ్రైనేజీలు నిర్మించాలని కోరుతున్నాం. మొర్రాయపల్లె గ్రామంలో శ్మశానం ఏర్పాటు చేయాలి.

నారా లోకేష్ స్పందిస్తూ…

జగన్మోహన్ రెడ్డి పాలనలో సాగునీటి ప్రాజెక్టులు, వ్యవసాయరంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కాల్వలు, సాగునీటి ప్రాజెక్టుల ఆధునీకరణను గాలికొదిలేశారు. ముఖ్యమంత్రి జగన్ నిర్వాకం కారణంగా అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి 61 నిండు ప్రాణాలు బలయ్యాయి. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కెసి కెనాల్ ఆధునీకరణకు చర్యలు తీసుకుంటాం. గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీలు ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. మొర్రాయపల్లెలో శ్మశానవాటిక ఏర్పాటుచేస్తాం.

యువనేతను కలిసిన మైదుకూరు పట్టణ ప్రజలు

మైదుకూరు మున్సిపల్ ఆఫీసు వద్ద పట్టణ ప్రముఖులు యువనేత లోకేష్ ను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. పట్టణంలోని 15వవార్డుతోపాటు వివిధ ప్రాంతాల్లో  సీసీ రోడ్లు, డ్రైనేజీల వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. వీధిలైట్లు లేకపోవడంతో చీకటిలోనే ప్రజలు బిక్కుబిక్కుమంటూ నడవాల్సి వస్తోంది.  అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకునే నాథుడు లేడు.  డ్రైనేజీ పూడిక తీయకపోవడంతో మురుగునీరు, దుర్గంధం మధ్య నడవాల్సిన పరిస్థితి. మున్సిపాలిటీ నిధులను అధికార పార్టీ నాయకులు దుర్వినియోగం చేస్తున్నారు. సరిగా మంచినీరు కూడా ఇచ్చే పరిస్థితి కూడా లేదు. మీరు అధికారంలోకి వచ్చాక మైదుకూరు మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యల్ని పరిష్కరించాలి.

*నారా లోకేష్ స్పందిస్తూ…*

రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక స్థానిక సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేశారు. వైసిపి చేతగానిపాలన కారణంగా వివిధ మున్సిపాలిటీల్లో కనీసం బ్లీచింగ్ పౌడర్ చల్లడానికి కూడా నిధుల్లేవు. అభివృద్ధి చేతగాని జగన్ వివిధరకాల పన్నులతో ప్రజల నడ్డివిరుస్తున్నారు. గత టిడిపి ప్రభుత్వంలో రాష్ట్రవ్యాప్తంగా 30లక్షల ఎల్ఇడి లైట్లు ఏర్పాటుచేశాం. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటర్ గ్రిడ్ ఏర్పాటుచేసి ఇంటింటికీ తాగునీటి కుళాయి అందజేస్తాం. డ్రైనేజీలు, వీధిలైట్లు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించి, పట్టణాలను తీర్చిదిద్దుతాం.

లోకేష్ ను కలిసిన మైదుకూరు కిడ్నీ బాధితులు

మైదుకూరులో శ్రీనివాసనగర్ లో నియోడజకవర్గంలోని కిడ్నీ బాధితులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మైదుకూరు, పరిసరాల్లో కిడ్నీవ్యాధి బాధితులు అధికంగా ఉన్నాము. సరైన వైద్యసదుపాయం అందుబాటులోడ లేకపోవడంతో వ్యయప్రయాసలకోర్చి దూరప్రాంతాలకు వెళ్లి వైద్యం చేయించుకోవాల్సి వస్తోంది. ప్రభుత్వం నుండి అందుతున్న ఆర్థిక సాయం మందులకు కూడా సరిపోవడం లేదు. కిడ్నీ బాధితులకు ప్రభుత్వం ఉచితంగా మందులు పంపిణీ చేయాలి. కిడ్నీ వ్యాధిగ్రస్తుల కుటుంబ సభ్యులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి.  పట్టణ ప్రాంత బాధితులకు చిరు వ్యాపారాలకు స్థలాలు కేటాయించాలి. కిడ్నీ బాధితుల పిల్లలకు ఉచిత విద్య అందించి ఆదుకోవాలి.

నారా లోకేష్ స్పందిస్తూ.

సురక్షితమైన తాగునీరు అందించడంలో ప్రభుత్వం విఫలం కావడంవల్లే కిడ్నీ రోగులు పెరుగుతున్నారు. కిడ్నీవ్యాధి గ్రస్తులకు సరైన వైద్యసదుయాలు కల్పించడంలో కూడా ప్రభుత్వం విఫలమైంది. ఆరోగ్యశ్రీ పథకం కింద దాదాపు రూ.1200 కోట్లు పెండింగ్ లో ఉంచడంతో ప్రైవేటు వైద్యశాలల్లో వైద్యం అందించేందుకు నిరాకరిస్తున్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో దూది, గాజుగుడ్డ వంటివి కూడా అందుబాటులో లేని దుస్థితి నెలకొంది. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇంటింటికీ సురక్షితమైన తాగునీరు అందించేలా చర్యలు చేపడతాం. కిడ్నీవ్యాధి బాధితులకు ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం, మందులు అందించేలా ఏర్పాట్లు చేశారు. కిడ్నీవ్యాధిగ్రస్తులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో అధునాతన వైద్యసౌకర్యాలతో డయాలసిస్ సెంటర్లు ఏర్పాటుచేస్తాం. కిడ్నీవ్యాధి బాధితులకు ఉపాధికి చర్యలు చేపడతాం.

నారా లోకేష్ ను కలిసిన ఉల్లిరైతులు

మైదుకూరు బాబా గుడి వద్ద నియోజకవర్గ ఉల్లి రైతులు యువనేత లోకేష్ ను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. మా నియోజకవర్గంలో పండించే విదేశీరకం కె.పి.ఉల్లి పంటను ప్రభుత్వమే గిట్టుబాటు ధర ఇచ్చి కొనుగోలు చేయాలి. కె.పి.రకం ఉల్లి ఎకరా పంటకు 15 నుండి 20 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వస్తోంది, లక్ష రూపాయలు ఖర్చవుతుంది. క్వింటాకు రూ.10వేలు ఇస్తేనే గిట్టుబాటు అవుతుంది. మైదుకూరులో ఆగష్టు నెలలో ఉల్లి కొనుగోలు కేంద్రం పెట్టి కొనుగోలు చేయాలి. దళారులు పంట కొనుగోలు చేయడం వల్ల రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదు. TDP అధికారంలోకి వచ్చాక ఉల్లి రైతులకు న్యాయం చేయాలి.

నారా లోకేష్ స్పందిస్తూ…

ముఖ్యమంత్రి జగన్ పాలనలో మొట్టమొదటి బాధితులు రైతులే. ఎన్నికల సమయంలో రూ.3,500 కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటుచేసి పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తానన్న జగన్, అధికారంలోకి వచ్చాక ముఖం చాటేశారు. జగన్ మాయమాటలను నమ్మిన రైతులను నట్టేట ముంచేశారు. టిడిపి అధికారంలోకి వచ్చాక మైదుకూరులో ఉల్లికొనుగోలు కేంద్రం ఏర్పాటుచేసి రైతులను ఆదుకుంటాం. రైతులకు గిట్టుబాటు ధర కల్పించి, దళారీల దోపిడీ బారినుంచి కాపాడతాం. ఉల్లి రైతులకు అవసరమైన నాణ్యమైన విత్తనాలు, ఎరువులను సబ్సిడీపై అందజేస్తాం.

లోకేష్ ను కలిసిన భూమయ్యపల్లె గ్రామ రైతులు

మా గ్రామంలో అధికశాతం జనాభా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నాం. గత నాలుగేళ్లుగా ఎరువులు, పురుగుమందుల ధరలు విపరీతంగా పెరిగాయి. నకిలీ విత్తనాలు, పురుగుమందుల కారణంగా తీవ్రంగా నష్టపోతున్నాం. గతంలో రైతులకు ట్రాక్టర్లు, వ్యవసాయ పనిముట్లు, యంత్ర పరికరాలు సబ్సిడీపై ఇచ్చేవారు. ఇప్పుడు అవేమీ లేవు. గతంలో ఎన్టీఆర్ జలసిరి పథకం ద్వారా బోర్లు మంజురు చేయగా, ఇప్పుడు ఇవ్వడం లేదు. టీడీపీ పాలనలో హార్టీకల్చర్ కు సబ్సిడీపై డ్రిప్ ఇచ్చేవారు, నేడు వైసీపీ ప్రభుత్వం రద్దు చేసింది. టిడిపి అధికారంలోకి వచ్చాక రైతులను ఆదుకోవాలి.

నారా లోకేష్ స్పందిస్తూ…

వ్యవసాయరంగంపై అవగాహన లేని జగన్ పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతు భరోసా కేంద్రాలను రైతు దగా కేంద్రాలుగా మారిపోయాయి, అవి రైతులకు ఏమాత్రం ఉపయోగపడటం లేదు. వైసీపీ నాయకులే కమీషన్లకు కక్కుర్తిపడి కల్తీవిత్తనాలు, ఎరువుల మాఫియాను పెంచి పోషిస్తున్నారు. టిడిపి అధికారంలోకి వచ్చాక కల్తీ విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు అమ్మే వారిని ఉక్కుపాదం మోపుతాం. రైతుల కష్టాలను తెలుసుకున్న చంద్రబాబు ప్రతిఏటా రైతులకు రూ.20వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తానని మహానాడులో ప్రకటించారు. రైతులకు గతంలో మాదిరిగా 90శాతం సబ్సిడీపై రైతులకు డ్రిప్ పరికరాలు అందిస్తాం. గత టిడిపి ప్రభుత్వంలో రైతులకు అమలుచేసిన సంక్షేమ కార్యక్రమాలన్నీ పునరుద్దరిస్తాం.

Also Read This Blog: Uniting Youth Voices: The Yuvagalam Padayatra for Social Justice

Tagged#LokeshPadaYatra#Padayatra#YuvaGalamLokesh#YuvaGalam#NaraLokeshPadaYatra#NaraLokesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *