ఉత్సాహంగా సాగిన యువగళం పాదయాత్ర ప్రొద్దుటూరు నియోజకవర్గంలో లోకేష్ కు ఘనస్వాగతం నీరాజనాలు పలికిన మహిళలు, యువకులు, కార్యకర్తలు
ప్రొద్దుటూరు: యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర 112వరోజు ఉత్సాహంగా సాగింది. దారిపొడవునా యువకులు, మహిళలు, వృద్ధులు యువనేతకు నీరాజనాలు పట్టారు. పార్టీ కార్యకర్తలు గజమాలతో సత్కరించి ఆనందంతో కేరింతలు కొట్టారు. దేవగుడి సుంకులాంబ ఆలయం వద్ద క్యాప్ సైట్ లో తొలుత చేనేత కార్మికులతో సమావేశమైన లోకేష్ వారి సాధకబాధకాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం యువనేతకు దారిపొడవునా వివిధ వర్గాల ప్రజలు ఎదురేగి తమ సమస్యలు చెప్పుకున్నారు. చౌడూరులో యువగళం పాదయాత్ర ప్రొద్దుటూరు అసెంబ్లీ నియోజకర్గంలోకి ప్రవేశించింది. ప్రొద్దుటూరు టిడిపి ఇన్ చార్జి ప్రవీణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో భారీఎత్తున కార్యకర్తలు, అభిమానులు యువనేతకు ఎదురేగి ఘన స్వాగతం పలికారు. మాజీ ఎమ్మెల్యేలు వీరశివా రెడ్డి, వరదరాజుల రెడ్డి, టిడిపి నేత సిఎం సురేష్ నాయుడు, పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు యువనేతను స్వాగతించారు. వివిధ గ్రామాల ప్రజలు, రైతులు, చేనేతలు, ఎంఆర్ పిఎస్ కార్యకర్తలు యువనేతకు వినతిపత్రాలు సమర్పించారు. మరో ఏడాదిలో రాబోయే చంద్రన్న ప్రభుత్వం అందరి సమస్యలను పరిష్కరిస్తుందని భరోసా ఇచ్చి యువనేత ముందుకు సాగారు. దేవగుడి నుంచి ప్రారంభమైన పాదయాత్ర సలివెందుల, దేవగుడి క్రాస్, ప్రొద్దుటూరు నియోజకవర్గం చౌడూరు, శంకరాపురం, పెద్దశెట్టిపల్లి, నరసింహాపురం మీదుగా చౌటపల్లి బాక్స్ క్రికెట్ ప్రాంగణం వద్ద విడిది కేంద్రానికి చేరుకొంది. 112వరోజు బుధవారం నాడు యువనేత లోకేష్ 10.3 కి.మీ. పాదయాత్ర చేశారు. ఇప్పటివరకు మొత్తం 1446.1 కి.మీ. మేర యువగళం పాదయాత్ర పూర్తయింది. 113వరోజు పాదయాత్ర (గురువారం) ప్రొద్దుటూరు పట్టణంలో కొనసాగనుంది.
యువనేత ఎదుట వ్యక్తమైన సమస్యలు:
బిల్లులు ఇవ్వలేదు, పొలం లాగేశారు! -పి.అశోక్ కుమార్, చక్రాయపేట, పులివెందుల.
గత ప్రభుత్వంలో నీరు-చెట్టు పథకం కింద రూ.15లక్షల అప్పుతెచ్చి చెక్ డ్యామ్ లు, కల్వర్టులు 15లక్షలు పనిచేశాను. ఇప్పటివరకు బిల్లులు ఇవ్వలేదు. నదీ పోరంబోకులో 5ఎకరాల భూమి ఉంది. ఈ ప్రభుత్వం దానిని కూడా రద్దుచేశారు, వైసిపి వారివి అలాగే ఉంచారు. అడిగినందుకు 7రోజులు జైలులో పెట్టి, ఎస్సీ ఎట్రాసిటీ చట్టం బనాయించారు. అన్నివిధాలా చితికిపోయాడు. బతుకుబండి లాగడం కష్టంగా ఉంది.
పొలం కబ్జాకు ప్రయత్నాలు చేస్తున్నారు -వెంకటకృష్ణారెడ్డి, సలివెందుల, జమ్మలమడుగు
నాకు 100 ఎకరాల పొలం ఉంది. నా భూమి చుట్టుపక్కల వైసిపి వారు కొన్నారు. గట్లవెంట ఆక్రమణలకు ప్రయత్నిస్తున్నారు. 2ఎకరాలు ఇప్పటికే కబ్జా చేశారు. ఎందుకు గట్లు జరుపుతున్నారని అడిగితే ఎమ్మెల్యేకి చెప్పి బొక్కలో వేస్తామని బెదిరిస్తున్నారు. విఆర్ ఓ పట్టించుకోలేదు. మైలవరం కాల్వ నుంచి మా పొలాలకు నీరు వస్తోంది. కాల్వ పూడిక తీయలేదు. నీటితీరువా మాత్రం ఏడాదికి 20వేలు కట్టించుకుంటున్నారు.
లారీలు నడిపే పరిస్థితి కన్పించడం లేదు -గురప్ప, లారీ ఓనరు, జమ్మలమడుగు.
నేను దళితుడ్ని. నాకు 2లారీలు ఉన్నాయి. గతంలో సిద్ధవరం నుంచి ఎంఎల్ఎస్ పాయింట్లకు రేషన్ బియ్యం తోలేవాడ్ని. ఈ ప్రభుత్వం వచ్చాక తీసేసింది. ఐరన్, వాటర్ బాటిల్స్, ఇతర కిరాయిలు వచ్చేవి. టోల్ గేట్ల వద్ద డబ్బులు వసూలు చేస్తున్నారు. లైసెన్సు లేకపోతే 5వేలు ఫైన్ వసూలు చేస్తున్నారు. 2010 కి ముందు ఉన్న లారీలకు గతంలో రెండేళ్లకోసారి రెన్యువల్, ఇప్పడు ఏడాదికి ఒకసారి రెన్యువల్ చేయాలని నిబంధన మార్చారు. గతంలో ఫైన్ వెయ్యి ఉండేది, ఇప్పుడు 10వేలు చేశారు. గతంలో మా పిల్లలు బెస్ట్ ఎవైలబుల్ స్కూల్ లో చదువుకునేవారు. ఇప్పుడు రూ.50వేలు కట్టి ప్రైవేటు స్కూలులో చదివించుకుంటున్నారు. ఆదాయం తగ్గిపోవడంతో కుటుంబపోషణ భారంగా మారింది.
చేనేతలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్! టిడ్కో ఇళ్లు, కామన్ వర్కింగ్ షెడ్లు ఏర్పాటు చేస్తాం చేనేతను దత్తత తీసుకుంటా… సమస్యలన్నీ పరిష్కరిస్తా చేనేత వస్త్రాలపై జిఎస్టీని ప్రభుత్వమే భరించేలా చేస్తాం
ముఖాముఖి సమావేశంలో యువనేత నారా లోకేష్
జమ్మలమడుగు: జమ్మలమడుగు నియోజకవర్గం దేవగుడిలో చేనేత కార్మికులతో యువనేత నారా లోకేష్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ… జగన్ పాలనలో చేనేత కార్మికులు బాధితులు, కనీసం చేనేత కార్మికులు పడుతున్న ఇబ్బందుల పై సమీక్ష చేసే తీరిక కూడా జగన్ కు లేదు. టిడిపి అధికారంలోకి వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా చేనేత ను నేను దత్తత తీసుకుంటున్నాను. చేనేత పై ఉన్న 5 శాతం జీఎస్టీ భారం పడకుండా చేస్తాం. చేనేత కార్మికులకు టిడ్కో ఇళ్లు, కామన్ వర్కింగ్ షెడ్లు ఏర్పాటు చేస్తాం. చంద్రన్న భీమా పథకాన్ని మళ్లీ ప్రవేశ పెడతాం. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత మగ్గాల సంఖ్య తగ్గిపోయింది. ప్రభుత్వం నుండి సాయం లేక చేనేత కార్మికులు ఇతర రంగాలకు వెళ్లిపోతున్నారు. మగ్గం ఉన్న చేనేత కార్మికులకు 200 యూనిట్ల విద్యుత్ అందజేస్తాం.
చేనేత కార్మికులను ఆదుకుంటాం!
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే చేనేతపై ఆధారపడిన రంగులు అద్దే కార్మికుల దగ్గర నుండి మాస్టర్ వీవర్ వరకూ అందరిని ఆదుకుంటాం. చేనేత క్లస్టర్స్ ఏర్పాటు చేసి ప్రత్యేక బ్రాండింగ్ ఏర్పాటు చేస్తాం. జగన్ పరిపాలనలో చేనేత ముడి సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పెట్టుబడి తగ్గిస్తాం. నేతన్న నేస్తం అందరికీ ఇస్తానని చెప్పి ఇప్పుడు కేవలం సొంత మగ్గం ఉంటేనే ఇస్తానని కండిషన్స్ పెట్టాడు జగన్. టిడిపి హయాంలో ఏడాదికి అన్ని సబ్సిడీలు కలిపి ఏడాదికి నేతన్నకి సుమారుగా రూ.50 వేలు లబ్ది చేకూరింది. ఇప్పుడు జగన్ పాలనలో కనీసం మేము చేసిన దాంట్లో 10 శాతం కూడా ఇవ్వలేదు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పెద్ద ఎత్తున చేనేత కార్మికులను ఆదుకుంటాం.
చేనేతల సమస్యలపై అవగాహన ఉంది
చేనేత కార్మికుల సమస్యలపై నాకు పూర్తి అవగాహన ఉంది. చేనేత కార్మికులను ఆదుకుంది టిడిపి. పద్మశాలి సామాజిక వర్గాన్ని ఆర్దికంగానూ, రాజకీయంగానూ ఆదుకుంది టిడిపి. జనతా వస్త్రాల పథకంతో చేనేత కు చేయూత ఇచ్చింది అన్న ఎన్టీఆర్. రూ.110 కోట్ల రుణమాఫి చేసింది టిడిపి. యార్న్, కలర్, పట్టు సబ్సిడీ లు ఇచ్చింది టిడిపి. వైసిపి ప్రభుత్వం వచ్చిన తరువాత సబ్సిడీలు ఎత్తేసారు. ఆత్మహత్యలు చేసుకున్న చేనేత కుటుంబాలకి ఒక్క రూపాయి జగన్ ప్రభుత్వం సాయం చెయ్యలేదు. ఆప్కో ని నిర్వీర్యం చేసారు. ఆప్కో చేనేత కార్మికులందరికీ బకాయి పడింది. టిడిపి అధికారంలోకి ఉన్నప్పుడు క్లస్టర్స్ ఏర్పాటు చేశాం. నైపుణ్య శిక్షణ తో పాటు మగ్గం కొనుక్కోడానికి సాయం అందించాం. సబ్సిడీ లో చేనేత కార్మికులకు అనేక పరికరాలు అందించాం. జగన్ ప్రభుత్వం చేనేత కార్మికులకు సబ్సిడీ రుణాలు, పరికరాలు ఇవ్వడం లేదు.
ముఖాముఖి సమావేశంలో చేనేతల అభిప్రాయాలు:
దేవగుడిలో చేనేతలతో నిర్వహించిన ముఖాముఖి సమావేశంలో పలువురు చేనేతలకు తమ అభిప్రాయాలను యువనేత లోకేష్ ముందుంచారు. శ్రీనివాసులు మాట్లాడుతూ… టెక్స్ టైల్ పార్క్ లో కంపెనీలు రాక ఉపాధి అవకాశాలు రావడం లేదన్నారు. లక్ష్మీనారాయణ మాట్లాడుతూ… చేనేత కార్మికులకు ఇళ్లు లేక ఇబ్బంది పడుతున్నాం. షెడ్లు నిర్మాణానికి ప్రభుత్వం ఎటువంటి సాయం అందించడం లేదని తెలిపారు. రామచంద్ర మాట్లాడుతూ… లో ఓల్టేజ్ కారణంగా ఇబ్బంది పడుతున్నాం. మా ఉత్పత్తుల నాణ్యత తగ్గిపోతుందని చెప్పారు. నాగ లక్ష్మయ్య మాట్లాడుతూ… చేనేతపై ఆధారపడిన అనేక రంగాల వారు ఉన్నారు. కేవలం నేత నేసే వారికి మాత్రమే సాయం అందిస్తున్నారు. అది కూడా అరకొరగా సొంత మగ్గం ఉన్న వారికే ఇస్తున్నారని అన్నారు. షరీఫ్ మాట్లాడుతూ… అన్ సీజన్ లో మాకు ఉపాధి ఉండటం లేదు. వైసిపి ప్రభుత్వం నుండి ఎటువంటి సహకారం అందడం లేదన్నారు. వెంకట కృష్ణయ్య మాట్లాడుతూ… ప్రభుత్వం నుండి సబ్సిడీ రుణాలు అందడం లేదని చెప్పారు. సురేష్ మాట్లాడుతూ… చేనేత ముడి సరుకుల రేట్లు జగన్ ప్రభుత్వంలో విపరీతంగా పెరిగిపోయాయన్నారు. తిరుమల్ దాస్ మాట్లాడుతూ… జీఎస్టీ చేనేత కు పెను భారంగా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు.
లోకేష్ ను కలిసిన సలివెందుల గ్రామస్తులు
జమ్మలమడుగు నియోజకవర్గం సలివెందుల గ్రామస్తులు తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. గ్రామంలో ఉన్న కోనేరుకు మరమ్మతులు చేసి, కోనేరు చుట్టూ ప్రహరీగోడ నిర్మించాలి. శ్మశానవాటికకు చుట్టూ ప్రహరీగోడ ఏర్పాటుచేయాలి. సుంకులాంబ గుడిపక్కన ఉన్న గ్రామపంచాయితీ స్థలంలో కమ్యూనిటీ హాలు ఏర్పాటుచేయాలి. సలివెందులలోని శంకర్ రెడ్డి కాలనీ నుంచి దేవగుడి వరకు డ్రైనేజి ఏర్పాటుచేయాలి. సలివెందుల నుంచి గ్రామ పొలాల్లోకి వెళ్లేందుకు వీలుగా రోడ్లు ఏర్పాటుచేయాలి. గ్రామంలో సిసి రోడ్లు నిర్మించాలి.
నారా లోకేష్ మాట్లాడుతూ.
రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక గ్రామసీమలను పూర్తిగా నిర్వీర్యం చేశారు. గ్రామపంచాయితీలకు చెందాల్సిన ఫైనాన్స్ కమిషన్ నిధులు రూ.8660 కోట్లు దారిమళ్లించారు. జగన్ నిర్వాకం కారణంగా గ్రామాల్లో కనీసం బ్లీచింగ్ పౌడర్ చల్లడానికి కూడా పంచాయితీల వద్ద నిధుల్లేని పరిస్థితి నెలకొంది. పలువురు సర్పంచ్ లు పరువు కోసం సొంతడబ్బులు ఖర్చుపెట్టి పనులుచేసి, బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. టిడిపి హయాంలో ఫైనాన్స్ కమిషన్ నిధులకు అదనంగా రాష్ట్రప్రభుత్వం తరపున నిధులు మంజూరు చేసి గ్రామాలను అభివృద్ధి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 25వేల కి.మీ. సిమెంటు రోడ్లు, 30లక్షల ఎల్ ఇడి విద్యుత్ దీపాలు ఏర్పాటుచేశాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామాల్లో మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేస్తాం. సలివెందుల గ్రామ కోనేరు, శ్మశాన వాటికలకు ప్రహరీగోడలు నిర్మిస్తాం.
నారా లోకేష్ ను కలిసిన చౌడూరు రైతులు
ప్రొద్దుటూరు నియోజకవర్గం చౌడూరు గ్రామరైతులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మా గ్రామం రైతులు పత్తిరైతులు తీవ్రంగా నష్టపోయారు. విత్తనాల్లో నాణ్యత లేక దిగుబడి పూర్తిగా పడిపోయింది. ఎకరానికి 18క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా కేవలం 2క్వింటాళ్లే వచ్చింది. ఎకరం పంటకు రూ.35వేలు ఖర్చు అయితే దిగుబడిపై కేవలం రూ.12వేలు వచ్చింది. కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయారు. పత్తి ధర కేజీ రూ.120 నుండి రూ.62కు పడిపోయింది. పత్తికి మద్దతు ధర కల్పించాలి. రైతులకు వ్యవసాయ పనిముట్లను వైసీపీ ప్రభుత్వం నిలిపేసింది. మేం అధికారంలోకి వచ్చాక పత్తి రైతుల సమస్యల్ని పరిష్కరించాలి.
నారా లోకేష్ స్పందిస్తూ
జగన్మోహన్ రెడ్డి పాలనలో వ్యవసాయ రంగం కుదైలైంది. అసమర్థ విధానాలతో రైతాంగం ఆత్మహత్యల్లో ఏపీని దేశంలోనే ముందు వరుసలో నిలిపారు. దేశం మొత్తమ్మీద అప్పుల్లో ఎపి రైతులు మొదటిస్థానంలో ఉన్నారు. రూ.3,500కోట్లు ధరల స్థిరీకరణ నిధి పెడతానన్న ఎన్నికల తర్వాత మాటతప్పి మడమతిప్పారు. కమీషన్ల కోసం కల్తీవిత్తనాల మాఫియాను అధికారపార్టీ నేతలే పెంచి పోషిస్తున్నారు. టిడిపి అధికారంలోకి వచ్చాక కల్తీ విత్తనాలు, పురుగుమందుల మాఫియాపై ఉక్కుపాదం మోపుతాం. ఎపి సీడ్స్ ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించేందుకు చర్యలు తీసుకుంటాం.
నారా లోకేష్ ను కలిసిన చేనేత కార్మికులు
ప్రొద్దుటూరు నియోజకవర్గం శంకరాపురంలో చేనేత కార్మికులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. గత ప్రభుత్వంలో మాకు అందించిన పథకాలను వైసీపీ అధికారంలోకి వచ్చాక రద్దు చేశారు.మీరు అధికారంలోకి వచ్చాక పవర్ లూమ్స్ సబ్సిడీలు పునరుద్ధరించాలి. పవర్ లూమ్స్, చేనేత కార్మికులకు పవర్ సబ్సిడీ ఇవ్వాలి. చేనేత వస్త్రాలను ఆప్కో కొనుగోలు చేసేలా జీఓ ఇవ్వాలి. చేనేత వస్త్రాలపై జీఎస్టీ ఎత్తివేయాలి. చేనేతలకు 2సెంట్ల స్థలంలో ఇళ్లు కట్టించి, చేనేత కాలనీలు ఏర్పాటు చేయాలి. కంటి చూపు కోల్పోయిన చేనేతలకు ఉచిత ఆపరేషన్లు చేయించి, పెన్షన్లు ఇవ్వాలి. మగ్గం నేసే వారికి మగ్గం సామాన్లు, నూలుపై సబ్సిడీ ఇప్పించాలి. వైసీపీ పాలనలో బీసీలపై అనేక దాడులు జరిగాయి. నందం సుబ్బయ్యను దారుణంగా చంపారు. TDP వచ్చాక బీసీలపై దాడులు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. చేనేతలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించాలి.
నారా లోకేష్ స్పందిస్తూ
ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికుల కుటుంబాలను కనీసం పరామర్శించిన పాపాన పోలేదు. పరిహారం అందించలేదు. టిడిపి అధికారంలోకి వచ్చాక చేనేతలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందజేస్తాం. చేనేతలు మగ్గాలు ఏర్పాటుచేసుకునేందుకు ఇంటిగ్రేటెడ్ భవనాలు నిర్మిస్తాం. ప్రతి చేనేత కార్మికుడికి ఇంటిస్థలం ఇచ్చి, ఇల్లు నిర్మిస్తాం. చేనేత వస్త్రాలను బ్రాండింగ్ చేసి మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తాం. చేనేతలకు హెల్త్ కార్డులు మంజూరుచేసి ఉచితంగా వైద్యసౌకర్యం కల్పిస్తాం. బిసిల రక్షణకు ప్రత్యేక చట్టం తెచ్చి, దాడులకు పాల్పడేవారిపై కఠినచర్యలు తీసుకుంటాం. ఆప్కోద్వారా చేనేత వస్త్రాల కొనుగోలుకు చర్యలు తీసుకుని, ముడిసరుకు కొనుగోలుకు సబ్సిడీ రుణాలు అందజేస్తాం.
నారా లోకేష్ ను కలిసిన పెద్దశెట్టిపల్లి గ్రామస్తులు
ప్రొద్దుటూరు నియోజకవర్గం పెద్దశెట్టిపల్లి గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. మా గ్రామానికి సరిహద్దులో పెన్నా నది ఉంది. అధికార పార్టీ నాయకులు పెన్నా నదిలో ఇసుకను అడ్డగోలుగా తవ్వి పక్క రాష్ట్రాల్లో అమ్ముకుంటున్నారు. పెన్నా నది నీళ్లపై ప్రొద్దుటూరు మున్సిపాలిటీ, రాజుపాలెం మండలంలోని 5 గ్రామాలు ఆధారపడి ఉన్నాయి. ఇసుక అధికంగా తవ్వడం వల్ల నీరు పూర్తిగా ఇంకిపోయే ప్రమాదం పొంచి ఉంది. రైతులు వ్యవసాయ భూమికి ఇసుకను తీసుకెళితే పోలీసులు కేసులు పెట్టి హింసిస్తున్నారు. రోజుకి వందల సంఖ్యలో వెళ్లే లారీలను మాత్రం పోలీసులు పట్టించుకోవడం లేదు. టీడీపీ అధికారంలోకి వచ్చాక రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించాలి.
యువనేతను కలిసిన ఎంఆర్ పిఎస్ ప్రతినిధులు
ప్రొద్దుటూరు నియోజకవర్గం నరసింహాపురంలో ఎంఆర్ పిఎస్ ప్రతినిధులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. దళితుల్లో అనేక ఉపకులాలకు దామాషా ప్రకారం రిజర్వేషన్లు అందక వెనుకబడి ఉన్నారు. మాదిగలతోపాటు ఉపకులాల సామాజిక, ఆర్థిక, రాజకీయ అభివృద్ధికి వర్గీకరణే ఏకైక మార్గం. 2000 నుంచి 2004వరకు అప్పటి టిడిపి ప్రభుత్వం వర్గీకరణ అమలుచేయడం వల్ల 24వేలకు పైగా ఉద్యోగావకాశాలు లభించాయి. ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలిపి, పార్లమెంటులో బిల్లు పెట్టించేందుకు చొరవచూపాలి.
నారా లోకేష్ మాట్లాడుతూ
రాష్ట్రంలో గత నాలుగేళ్లలో రూ.28,147 కోట్ల ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను దారిమళ్లించిన వైసీపీ. తమకు జరుగుతున్న అన్యాయాలపై ప్రశ్నించిన దళితులను జగన్ ప్రభుత్వం రాజ్యహింసకు పాల్పడుతోంది. టిడిపి అధికారంలోకి వచ్చాక మాదిగ, ఉపకులాలకు న్యాయం జరిగేలా దామాషా పద్ధతిన నిధులు కేటాయిస్తాం. వర్గీకరణ విషయంలో మాదిగల సామాజిక న్యాయానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది.
Also Read This Blog: Pathfinders of Change: Yuvagalam Padayatra and the Youth Movement
Tagged: #LokeshPadaYatra#Padayatra#YuvaGalamLokesh#YuvaGalam#NaraLokeshPadaYatra#NaraLokesh