బద్వేలు నియోజకవర్గంలో ఉత్సాహంగా సాగిన యువగళంలంకమల అభయారణ్యంలో 11 కి.మీ. నడక సాగించిన యువనేత యువనేతను కలిసి సంఘీభావం తెలిపిన ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి
బద్వేలు: టిడిపి యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర బద్వేలు నియోజకవర్గంలో శనివారం ఉత్సాహం సాగింది. 122వరోజు యువగళం పాదయాత్ర రాజంపేట నియోజకవర్గం జంగాలపల్లె క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైంది. జంగాలపల్లి క్యాంప్ సైట్ వద్ద ఆంజనేయస్వామిని దర్శించుకున్న అనంతరం లోకేష్ పాదయాత్రకు బయలుదేరారు. వందలాది కార్యకర్తలు, నాయకులు వెంట రాగా 11 కి.మీ. పాటు లంకమల అభయారణ్యంలో యువనేత లోకేష్ ఉత్సాహంగా పాదయాత్ర చేశారు. అనంతరం అట్లూరు క్రాస్ వద్దకు చేరుకోగానే బద్వేలు టిడిపి నేతలు రితేష్ రెడ్డి, జయమ్మ, కౌవల్యారెడ్డి, నారాయణరెడ్డి నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. మొక్కజొన్న పొత్తులతో తయారు చేసిన గజమాలతో లోకేష్ ను పార్టీనేతలు సత్కరించారు. యువనేత లోకేష్ పాదయాత్రకు వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సంఘీభావం తెలిపారు. అట్లూరులోని భోజన విరామకేంద్రంలో లోకేష్ తో సమావేశమైన చంద్రశేఖర్ రెడ్డి రాష్ట్రంలో రాజకీయ పరిణామాలపై కాసేపు చర్చించారు. భోజన విరామం నుండి పాదయాత్ర కొనసాగించిన యువనేత రెడ్డిపల్లిలో చినీపంటను పరిశీలించి, దిగుబడి, పెట్టుబడుల గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. కొండూరు, బాలిరెడ్డిబావి మీదుగా నబియాబాద్ కు చేరుకున్న లోకేష్ విడిది కేంద్రంలో రాత్రి బస చేశారు. దారిపొడవున వివిధ గ్రామాల ప్రజలు, ఎస్సీలు, ఎస్టీలు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. 122వ రోజు యువనేత లోకేష్ 17.7 కి.మీ దూరం నడిచారు. ఇప్పటివరకు యువగళం పాదయాత్ర 1556.7 కి.మీ. మేర పూర్తయింది.
వైసిపి ఇసుక దాహం…రాష్ట్ర ప్రజలకు
జంగాలపల్లె అక్రమంగా పోగేసిన ఇసుక డంపింగ్ వద్ద సెల్ఫీ దిగిన యువనేత లోకేష్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇది రాజంపేట నియోజకవర్గం సిద్దవటం మండలం జంగాలపల్లె వద్ద పెన్నానదిని తోడేసి వైసిపి ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జునరెడ్డి అనధికారికంగా పోగేసిన ఇసుక డంపింగ్ యార్డు. పెన్నానది పక్కనే ఉన్నా స్థానిక ప్రజలకు మాత్రం ఇసుక అందుబాటులో ఉండటం లేదు. బెంగుళూరు, హైదరాబాద్ నగరాలకు ఇక్కడ ఇసుక తరలించి కోట్లాదిరూపాయలు దోచుకుంటున్నా ఎస్ఈబి అధికారులకు కనపడదు. జగన్ రెడ్డి పాపాలపుట్ట మాదిరి పెరిగిపోతున్న ఈ ఇసుక మేట రాష్ట్రంలో పేట్రేగిపోతున్న ఇసుక మాఫియాకు ప్రత్యక్షసాక్షి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
చీనీ పంటను పరిశీలించిన నారా లోకేష్
బద్వేలు నియోజకవర్గం రెడ్డిపల్లిలో పాదయాత్ర సందర్భంగా చీనీతోటను యువనేత లోకేష్ పరిశీలించారు. ఈ సందర్భంగా చీనీ రైతు రైతుతో మాట్లాడి చీనీ రైతులు ఎదుర్కుంటున్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. చీనీ రైతు రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ… మూడెకరాల్లో చీనీ పంట వేశాను. ఎకరానికి రూ.60 వేల ఖర్చు అవుతుంది. 8 ఏళ్లుగా చెట్లు పెంచుతున్నా. ఎరువు, పురుగుల మందులు, సున్నం, కూలీ ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. మూడేళ్ల నుండి వరుసగా నష్టాలు వస్తున్నాయి. మూడు ఎకరాల మీద 8 టన్నులు చీనీ రావడం గగనంగా మారింది. ఎకరాకు 10 టన్నుల కాయలు వస్తే తప్ప గిట్టుబాటు కాదు. టన్నుకి రూ.30 నుండి రూ.40 వేల రేటు వస్తే గిట్టుబాటు అవుతుంది. ఇప్పుడు రేటు రూ.15 నుండి రూ.20 వేలు మాత్రమే వస్తుంది. ఏకరాకు రూ.20 వేలు నష్టం వస్తుంది. టిడిపి హయాంలో ఎరువులు, పురుగుల మందులు, డ్రిప్ సబ్సిడీలో వచ్చేవి.
కానీ వైసిపి ప్రభుత్వం లో పెట్టుబడి విపరీతంగా పెరిగిపోయింది. TDP ప్రభుత్వం వచ్చిన తరువాత జూస్ ఫ్యాక్టరీ, కోల్డ్ స్టోరేజ్, గతంలో లాగ డ్రిప్ ఇరిగేషన్ అందించాలని రైతు రామకృష్ణారెడ్డి కోరారు.
నారా లోకేష్ స్పందిస్తూ
మిషన్ రాయలసీమ కార్యక్రమంలో రైతుల సమస్యలు పరిష్కారం చెయ్యడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాం. జ్యూస్ ఫ్యాక్టరీలు ఏర్పాటుకు కావాల్సిన చీనీ రకాలు పెంచేలా ప్రోత్సహిస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పెట్టుబడి తగ్గేలా ఎరువులు, పురుగుల మందులు, విత్తనాలు అన్ని తక్కువ రేటు కి అందజేస్తాం. గిట్టుబాటు ధర కల్పిస్తాం. గతంలో ఇచ్చినట్టే డ్రిప్ సబ్సిడీలో అందజేస్తాం. కోల్డ్ స్టోరేజ్ లు ఏర్పాటు చేస్తాం. చీనీ రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను అని రైతు రామకృష్ణా రెడ్డి కి భరోసా ఇచ్చిన లోకేష్. మరో ఏడాది ఓపిక పట్టండి టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే చీనీ రైతుల్ని ఆదుకుంటాం. రైతుల్ని ఆదుకోవడానికి నా వద్ద కొన్ని ఆలోచనలు ఉన్నాయి. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని అమలు చేస్తాను.
యువనేతను కలిసిన చింతవారిపల్లి గ్రామస్తులు
బద్వేలు నియోజకవర్గం చింతవారిపల్లి గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. సోమశిల ప్రాజెక్టు ముంపు గ్రామాల్లో మా గ్రామం కూడా ఉంది. ప్రాజెక్టులో 70 టిఎంసిల నీళ్లు నిల్వ చేస్తే మా గ్రామం ముంపునకు గురవుతుంది. 2019, 2020 సంవత్సరాల్లో 78 టిఎంసిల నీరు నిల్వ చేయడం మా గ్రామంలో నీరు చేరింది. మా గ్రామంలోని పొలాలను ప్రాజెక్టు భూసేకరణలో భాగంగా తీసుకోవడం ఇప్పుడు ఎటువంటి జీవనాధారం లేదు. ఇప్పటివరకు మాకు ఎటువంటి పరిహారం ఇవ్వలేదు. ఇరిగేషన్, రెవిన్యూ జాయింట్ ఇన్ స్పెక్షన్ నివేదిక మేరకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం మాకు పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలి.
నారా లోకేష్ మాట్లాడుతూ…
నిర్వాసితులకు పరిహారం ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం దారుణం. చింటువారిపల్లి సోమశిల ప్రాజెక్టు భూ నిర్వాసితులకు తక్షణమే పరిహారం అందజేయాల్సిందిగా ప్రభుత్వానికి లేఖరాస్తాం. ఈ ప్రభుత్వం స్పందించకపోతే రాబోయే తెలుగుదేశం ప్రభుత్వం నిర్వాసితులకు న్యాయం చేస్తుంది.
నారా లోకేష్ ను కలిసిన రెడ్డిపల్లి గ్రామ రైతులు
బద్వేలు నియోజకవర్గం రెడ్డిపల్లికి చెందిన చీనీ రైతులు యువనేత లోకేష్ ను కలసి వినతిపత్రం సమర్పించారు. అట్లూరు మండలం రెడ్డిపల్లిలో 500ఎకరాల్లో చీనీ తోటలు ఉన్నాయి. చీనీ రైతులకు జ్యూస్ ఫ్యాక్టరీ, కోల్డ్ స్టోరేజీ ఏర్పాటు చేయాలి. చీనీ పంటకు గిట్టుబాటు ధర అమలు చేయాలి. ధాన్యం పంటకు 20ఏళ్ల క్రితం ధరే ఇప్పటికీ కొనసాగుతోంది. కూలీ రేట్లు, వ్యవసాయ పెట్టుబడులు పెరిగాయి, పంటకు మాత్రం గిట్టుబాటు ధర పెరగలేదు. రైతులకు గత నాలుగేళ్లుగా డ్రిప్ సమస్య అత్యధికంగా ఉంది. రెడ్డిపల్లి, కొండూరు, అట్లూరు గ్రామాలకు చెక్ పోస్టు ఆంక్షల సమస్య ఉంది. మీరు అధికారంలోకి వచ్చాక మా సమస్యలు పరిష్కరించండి.
నారా లోకేష్ స్పందిస్తూ…
ప్రభుత్వం రాయలసీమ రైతాంగానికి శాపంగా తయారైంది. గతంలో 90సబ్సిడీపై డ్రిప్ పరికరాలు అందజేయగా, ఈ ప్రాంత రైతాంగానికి ఎంతో ఉపయోగపడింది. చీనీ రైతుల గిట్టుబాటు ధర కోసం గత ప్రభుత్వ హయాంలో ప్రత్యేక రైళ్లు ఏర్పాటుచేశారు. రాయలసీమ రైతుల కష్టాలు చూశాకే టిడిపి అధికారంలోకి వచ్చాక సీమను హార్టికల్చర్ హాబ్ గా తీర్చిదిద్దాలని మిషన్ రాయలసీమలో ప్రకటించాం. గత టిడిపి ప్రభుత్వం రాయలసీమలో ప్రాజెక్టుల కోసం 11,700 కోట్ల రూపాయలు ఖర్చుచేస్తే, వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాలుగోవంతు కూడా ఖర్చుచేయలేదు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే డ్రిప్ సబ్సిడీని పునరుద్దరిస్తాం. గత ప్రభుత్వంలో హార్టికల్చర్ కు అందజేసిన రాయితీలన్నీ తిరగి ప్రవేశపెడతాం. చీనీ రైతులకు కోల్డ్ స్టోరేజిలు, మెరుగైన మార్కెటింగ్ సౌకర్యాలు కల్పిస్తాం. రెడ్డిపల్లి, కొండూరు, అట్లూరు గ్రామాల ప్రజలకు చెక్ పోస్టు సమస్యను పరిష్కరిస్తాం.
నారా లోకేష్ ను కలిసిన బాలిరెడ్డిబావి గ్రామ దళితులు
బద్వేలు నియోజకవర్గం బాలిరెడ్డి బావి గ్రామ దళితులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. గత నాలుగేళ్లుగా ఎస్సీ, ఎస్టీలకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు నిరాకరిస్తున్నారు. ఎస్సీ,ఎస్టీలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి లోన్లు ఇవ్వడం లేదు. భూమి కొనుగోలు పథకాన్ని రద్దు చేశారు.nదళితుల అసైన్డ్ భూములను ఆక్రమించారు. వైసీపీ పాలనలో ఎస్సీ బ్యాక్ లాగ్ పోస్టులను ప్రకటించలేదు. పేద విద్యార్థులకు విద్యను దూరం చేయడానికి జీఓ 77ను తెచ్చారు. మీరు అధికారంలోకి వచ్చాక మా సమస్యల్ని పరిష్కరించాలి.
నారా లోకేష్ స్పందిస్తూ…
ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి ఖర్చుచేయాల్సిన 28,147 కోట్ల సబ్ ప్లాన్ నిధులను దారిమళ్లించిన జగన్మోహన్ రెడ్డి. జగన్ అధికారంలోకి వచ్చాక ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్లను నిర్వీర్యం చేశాడు. దళితులకు 27 సంక్షేమ పథకాలు రద్దు చేసి అన్యాయం చేశారు. దళితుల నుండి 12వేల ఎకరాల అసైన్డ్ భూములను లాక్కున్నారు. బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీ చేయకుండా తీరని అన్యాయం చేశారు. గత టిడిపి ప్రభుత్వ హయాంలో అంబేద్కర్ విదేశీవిద్య ద్వారా దళిత విద్యార్థులను విదేశాలకు పంపి చదివించాం. మేం అధికారంలోకి వచ్చాక దళితులకు గతంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు కొనసాగిస్తాం. బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీ చేస్తాం. ప్రమోషన్లలో రిజర్వేషన్లు అమలు చేస్తాం.nకార్పొరేషన్లను బలోపేతం చేసి దళితులను అన్ని విధాలా ఆదుకుంటాం.
యువనేతను కలసిన కొండూరు గ్రామ గిరిజనులు
బద్వేలు నియోజకవర్గం కొండూరు గ్రామ గిరిజనులు యువనేత లోకేష్ ను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. మేము అనేక సంవత్సరాలుగా బుట్టలు అల్లి అమ్ముకుని జీవిస్తున్నాం. గతంలో అడవిలోకి వెళ్లి కావాల్సినవి తెచ్చుకుని బుట్టలు తయారు చేసే వాళ్లం. కానీ నేడు అధికారులు అడవిలోకి వెళ్లడానికి అనుమతించడం లేదు. దీంతో మా జీవనోపాధి దెబ్బతిని, పనుల్లేక ఇబ్బందులు పడుతున్నాం. మాకు ఏదో ఒక విధంగా ఉపాధి కల్పించాలని కోరుతున్నాం. మీరు అధికారంలోకి వచ్చాక మా గ్రామంలోని సమస్యలను పరిష్కరించాలి.
నారా లోకేష్ స్పందిస్తూ…
ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి వచ్చాక గిరిజనులు కూడా ఇబ్బందులు తప్పడం లేదు. తరతరాలుగా అడవులపై ఆధారపడిన జీవిస్తున్న గిరిజనుల జీవనోపాధిని దెబ్బతీసే హక్కు జగన్ కు లేదు. టిడిపి అధికారంలోకి వచ్చాక గిరజనులు స్వేచ్చగా అడవుల్లోకి వెళ్లి వెదురు తెచ్చుకునే హక్కు కల్పిస్తాం. అటవీ ఫలసాయం ద్వారా ఉపాధి పొందేందుకు గిరిజనులకు అవకాశం కల్పిస్తాం. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా గిరిజనులకు సబ్సిడీ రుణాలు అందజేస్తాం, గిరిజనులకు పోడు భూములు అప్పగిస్తాం.
Also Read This Blog:Awakening the Changemakers: Yuvagalam Padayatra Empowering Youth Leadership
Tagged: #LokeshPadaYatra#Padayatra#YuvaGalamLokesh#YuvaGalam#NaraLokeshPadaYatra#NaraLokesh