రాజంపేటలో హోరెత్తిన యువగళం పాదయాత్ర దారిపొడవునా యువనేతకు జనం బ్రహ్మరథం అడుగడుగునా నీరాజనాలు, వినతుల వెల్లువ
రాజంపేట: యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర రాజంపేట నియోజకవర్గంలో హోరెత్తింధి. అడుగడుగునా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు, మహిళలు, యువకులు యువనేత లోకేష్ కు ఎదురేగి బ్రహ్మరథం పట్టారు. 120వరోజు యువగళం పాదయాత్ర కడప రాజరాజేశ్వరి కళ్యాణ మండపం వద్ద నుంచి ప్రారంభమైన చలమారెడ్డిపల్లి మీదుగా టక్కోలు వద్ద రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. టిడిపి ఇంఛార్జ్ చెంగల రాయుడు, గంటా నరహరి, నాయకులు, కార్యకర్తలు భారీ గజమాలతో యువనేతకు ఘనస్వాగతం పలికారు. మహిళలు హారతులతో నీరాజనాలు పడుతూ తమ గ్రామాల్లోకి ఆహ్వానించారు. పార్టీ అభిమానులు బాణాసంచా కాల్చి కేరింత కొడుతూ యువనేతకు ఘనస్వాగతం పలికారు. టక్కోలులో గ్రామస్తులు, రైతులతో సమావేశమై వారి సమస్యలు తెలుసుకున్నారు. తర్వాత పెన్నా క్రాస్, మాచుపల్లి మీదుగా చంటిగారిపల్లి శివారు విడిది కేంద్రానికి చేరుకున్నారు. కడపలోని విడిది కేంద్రంలో న్యాయవాదులు, పాస్టర్లు, పులివెందుల పార్టీ కార్యకర్తలతో సమావేశమై వారి సాధక బాధలు తెలుసుకున్నారు. 120వరోజు యువనేత లోకేష్ 12.1 కి.మీ. నడక సాగించారు. ఇప్పటివరకు యువగళం పాదయాత్ర 1528.9 కి.మీ. మేర పూర్తయింది. శుక్రవారం సిద్దవటం ఎమ్మార్వో కార్యాలయం వద్ద నిర్వహించే బహిరంగసభలో యువనేత లోకేష్ ప్రసంగిస్తారు.
యువనేత ఎదుట వ్యక్తమైన సమస్యలు:
పంట నష్టపరిహారం రాలేదు -విశ్వనాధం, మాచపల్లి
5 ఎకరాల్లో పత్తి పంట సాగు చేశా. అకాలవర్షాలతో పంట దెబ్బతింది. రూ.2 లక్షలు పెట్టుబడి అయింది. 5 ఎకరాల మీద 15 క్వింటాల పత్తి వచ్చింది. ప్రస్తుతం క్వింటా రూ.4 వేలు పలుకుతోంది. మంచి ధర కోసం ఎదురు చూస్తున్నా. కనీసం రూ.7 వేలు ఉంటేనే పెట్టుబడి, కూలీ ఖర్చులు వెల్లుతాయి. అకాల వర్షాలకు పంట దెబ్బతింటే ఎంపీ మిథున్ రెడ్డి వచ్చినప్పుడు బీమా రావడం లేదని అడిగితే, వస్తుంది గట్టిగా అరవొద్దని కోపగించి వెళ్లారే తప్ప పరిహారం రాలేదు.
రికార్డులు మార్చి భూమి కొట్టేశారు -జెట్టి నాగరాజు, దళితుడు, వేల్పుల, పులివెందుల
నా భార్య జెట్టి శారద పేరుపై 5 ఎకరాల భూమి ఉంది. 2007లో రాజశేఖర్ రెడ్డి భూమి ఇచ్చి పట్టా ఇచ్చారు. 2007 నుండి సాగు చేసుకుంటున్నా. చంద్రబాబు హయాంలో రుణమాఫీ, పంటబీమా డబ్బులు వచ్చాయి. 2019లో జగన్ సీఎం అవ్వగానే నా భార్య పేరు మీద ఉన్న భూమి కటికరెడ్డి సుధీర్ కుమార్ రెడ్డి 2.5 ఎకరాలు ఆయన పేరు మీదకు మార్చుకున్నారు. మరో 2.5 ఎకరాలు పల్లెకొండ సుస్మిత అనే పేరు మీదకు మార్చుకున్నారు. కనీసం ఆ అమ్మాయికి పెళ్లి కూడా కాలేదు. కలెక్టర్ కూడా కూర్చోబెట్టి మాట్లాడారు. దౌర్జన్యంగా ఎక్కించుకున్నారని కలెక్టర్ ఎమ్మార్వోకు చెప్పాడు. ఎమ్మార్వో కాళ్లుకూడా పట్టుకుని బతిమాలాడాను.. నా కూతురు కూడా ఆరోగ్యం బాగోలేదు..అమ్ముకోనివ్వడం లేదు.
ఇంటిస్థలంపై కన్నేశారు! -షేక్.రజియా, వేంపల్లి, పులివెందుల
మా వార్డులో మాఅమ్మ TDP తరపున వార్డు మెంబర్ గా ఉంది. 2003లో చంద్రబాబు ప్రభుత్వం నివాసానికి 3 సెంట్ల స్థలం ఇచ్చింది. అప్పటి నుండి అది మా ఆధీనంలో ఉంది. జీవనోపాధి కోసం 2016లో హైదరాబాదో లో కొన్ని రోజులు ఉన్నాం. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక వైసీపీ నేతలు ఆ స్థలంపై కన్నేశారు. మేము ఇవ్వడానికి ఒప్పుకోలేదు. దీంతో వైసీపీ నేతలు ఎమ్మార్వోను కమ్మించి ఈ స్థలం ప్రభుత్వానిది..మీరు ఇళ్లు కట్టుకోవడానికి అవకాశం లేదని చెప్పించారు. మా దగ్గర ప్రభుత్వం ఇచ్చిన పట్టా కాగితాలు కూడా ఉన్నాయి. అయినా వైసీపీ నేతలు ఇల్లు కట్టుకోనివ్వకుండా అడ్డుకుంటున్నారు
ఒకే చోట చంద్రబాబు అభివృద్ధి-జగన్ విధ్వంసం! -కడప నియోజకవర్గంలో సెల్ఫీలు తీసి చూపించిన నారా లోకేష్
యువగళం పాదయాత్రలో ప్రజలు కష్టాలు తెలుసుకుని కన్నీళ్లు తుడుస్తూ ముందుకు సాగుతోన్న టిడిపి యువనేత నారా లోకేష్.. టిడిపి హయాంలో జరిగిన అభివృద్ధి పనులు-వైసీపీ పాలనలో సాగుతున్న విధ్వంసాన్ని సెల్ఫీలతో వివరిస్తూ ప్రజల్ని చైతన్యపరుస్తున్నారు. కడప జిల్లాలో యువగళం పాదయాత్ర గురువారం చెలమారెడ్డి పల్లి మీదుగా సాగుతుండగా అక్కడ టిడ్కో ఇళ్ల ముందు లోకేష్ సెల్ఫీ దిగారు. చంద్రబాబు పాలనలో పేదల కోసం సకల సౌకర్యాలతో నిర్మించిన టిడ్కో ఇళ్లకి రంగులేసుకున్న వైసీపీ సర్కారు తీరుని ఎండగట్టారు. చలమారెడ్డిపల్లిలోని పాలకొండని 6 కి.మీ. పొడవునా తవ్వేసి ట్రక్కు 5వేల చొప్పున అమ్ముకొని సొమ్ము చేసుకున్న వైకాపా అనకొండల గుట్టు రట్టు చేశారు. తాగునీరు, కరెంటు సహా ఎటువంటి మౌలిక సౌకర్యాలు లేని కొండపై పేదలకు సెంటుపట్టాలిచ్చి డబుల్ దోపిడీకి పాల్పడిన వైకాపా విధ్వంసాన్ని ప్రజల ముందుంచారు.
పాలకొండను మింగేసిన వైసిపి అనకొండలు
వైసిపి అక్రమార్కులు కంటిపడితే చాలు కొండలు, గుట్టలు మాయమై పోతున్నాయి. ఇది కడప శివారు చలమారెడ్డిపల్లిలోని పాలకొండ. వైసిపినేతలు ఈ కొండను దాదాపు 6 కి.మీ. పొడవునా తవ్వేసి ట్రక్కు 5వేల చొప్పున అమ్ముకొని సొమ్ము చేసుకున్నారు. తాగునీరు, కరెంటు సహా ఎటువంటి మౌలిక సౌకర్యాలు లేని ఇదే ప్రాంతంలో పేదలకు సెంటుపట్టాలిచ్చి డబుల్ దోపిడీకి పాల్పడ్డారు. పాలనలో వైసిపి అడ్డగోలు దోపిడీకి ఇది జస్ట్ శాంపుల్ మాత్రమేనని లోకేష్ వ్యాఖ్యానించారు.
ఇవి చంద్రన్న నిర్మించిన టిడ్కో ఇళ్లు…పేటిఎం కుక్కల్లారా…స్టిక్కర్లు, కాపీ బతుకెవరిది?!*
చంద్రన్న చల్లని పాలనకు ఆనవాళ్లు కడప శివారు చలమారెడ్డిపల్లిలో నిర్మించిన ఈ టిడ్కోగృహాలు. కడపనగరంలోని పేదల కోసం గత టిడిపి ప్రభుత్వం 1440 టిడ్కో గృహాల నిర్మాణం చేపట్టింది. టిడ్కోగృహాల సముదాయాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి పేదలకు అందించడం చేతగాని జగన్ ప్రభుత్వం సిగ్గూ,లజ్జా లేకుండా రంగులు, స్టిక్కర్లు మాత్రం వేసుకుంటోంది. ఈ ఇళ్లు చూశాకైనా ఎవరిది స్టిక్కర్ల బతుకో, ఎవరిది ఎవరు కాపీ కొడుతున్నారో సోషల్ మీడియాలో చెలరేగిపోయే పేటిఎం కుక్కలకు అర్థమవుతుందా అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
జగన్ పాలనలో న్యాయవాదులూ బాధితులే! అధికారంలోకి వచ్చాక న్యాయవాదులకు ప్రత్యేక రక్షణ చట్టం కర్నూలులో హైకోర్టు బెంచి ఏర్పాటు చేస్తాం న్యాయవాదులకు హెల్త్ కార్డులు, ఇళ్లస్థలాలు ఇస్తాం ముఖాముఖి సమావేశంలో యువనేత నారా లోకేష్
కడప: కడప రాజరాజేశ్వరి కళ్యాణ మండపం వద్ద న్యాయవాదులతో నిర్వహించిన ముఖాముఖి సమావేశంలో లోకేష్ మాట్లాడుతూ… జగన్ న్యాయవాదులపై దాడులు చేయించాడు. న్యాయవాదులకు అనేక హామీలు ఇచ్చిన జగన్ ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే న్యాయవాదులకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాంమూడు రాజధానుల పేరుతో చేయడం తప్ప ఒక్క ఇటుక పెట్టలేదు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే కర్నూలు లో హై కోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తాం. నేషనల్ లా కాలేజ్ కర్నూలులో ఏర్పాటు చెయ్యాలి అని టిడిపి అనుకుంటే దానిని వేరే ప్రాంతానికి తరలించాడు.
కోర్టుల్లో దుర్భర పరిస్థితులు
కోర్టుల్లో ఎంత దుర్భరమైన పరిస్థితులు ఉన్నాయో నేను విశాఖలో స్వయంగా చూసాను. కనీసం కూర్చోడానికి కుర్చీలు, బాత్ రూంలు కూడా లేవు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే న్యాయ శాఖ కు అధిక నిధులు కేటాయించి నూతన భవనాలు, మౌలిక వసతులు, సదుపాయాలు కల్పిస్తాం. మొదటి మూడు ఏళ్ల లోనే కొత్త భవనాలు ఏర్పాటు చేస్తాం. సరైన మౌలిక వసతులు, సదుపాయాలు లేకపోవడంతో కేసులు కూడా ఆలస్యం అవుతున్నాయి. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పరిస్థితులు మెరుగుపరుస్తాం. న్యాయవాదులు చనిపోతే వారి కుటుంబానికి 10 లక్షలు ఆర్ధిక సాయం అందిస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన హెల్త్ కార్డులు అందిస్తాం. నాణ్యమైన ఇళ్లు కట్టించి న్యాయవాదులకు ఇస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే న్యాయవాదులపై ప్రొఫెషనల్ ట్యాక్స్ భారం పడకుండా చేస్తాం. టిడిపి లీగల్ సెల్ ని బలోపేతం చేస్తున్నాం. ఇప్పుడు కష్టపడిన వారికి ఖచ్చితంగా పదవులు ఇస్తాం. నామినేటెడ్ పదవులు కూడా న్యాయవాదులకి ఇస్తాం. చట్టాన్ని అతిక్రమించి న్యాయవాదుల పై కేసులు పెట్టిన అధికారుల పై జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసి చర్యలు తీసుకుంటాం.
లోకేష్ ఎదుట న్యాయవాదుల సమస్యలు
న్యాయవాదలతో నిర్వహించిన సమావేశంలో పలువురు లాయర్లు తమ సమస్యలను యువనేత దృష్టికి తెచ్చారు. జగన్ పాలనలో న్యాయవాదులపై అక్రమ కేసులు, దాడులు చేస్తున్నారు. మాకు ప్రత్యేక రక్షణ చట్టం కావాలి. న్యాయవాదుల సంక్షేమం కోసం ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలి. ప్రభుత్వం నుండి ఎటువంటి సహకారం లేదు. హెల్త్ కార్డులు ఇవ్వాలి. న్యాయవాదులు చనిపోతే ఇతర రాష్ట్రాల్లో 10 లక్షలు ఆర్ధిక సహాయం అందిస్తున్నారు. ఏపిలో మాత్రం 4 లక్షలు ఆర్ధిక సాయం అందుతుంది. హౌస్ సైట్స్ ఇవ్వాలి. సరైన కోర్టు భవనాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నాం. కనీసం కారు పార్క్ చేసుకునే అవకాశం కూడా కోర్టు వద్ద సదుపాయం లేదు. మీరు ఇచ్చిన హామీ ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే హైకోర్టు బెంచ్ త్వరగా ఏర్పాటు చెయ్యాలి. కడప లో స్పెషల్ కోర్టులు రాలేదు. ఎసిబి, లోకాయుక్త లాంటి అన్ని స్పెషల్ కోర్టులు ఇతర జిల్లాల్లో ఉన్నాయి. మాకు స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేయాలి. జూనియర్ న్యాయవాదులకు ఆర్ధిక సాయం అందించింది మొదట టిడిపి టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులు అందరికి సాయం అందించాలి. ప్రొఫెషనల్ ట్యాక్స్ నుండి మమ్మలని మినహాయించాలి. సిద్ధవటం కోర్టు భవనం నిర్మాణం పెండింగ్ లో ఉంది. టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే పూర్తి చెయ్యాలి. జగన్ ప్రభుత్వం లో న్యాయవాదులకు ఎటువంటి సంక్షేమం అందడం లేదు. లైబ్రరీ, పుస్తకాలు లేక ఇబ్బంది పడుతున్నాం. లాయర్ల పైనే పోలీసులు అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారు. న్యాయవాదులకు బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు.
కులం, మతం, ప్రాంతం పేరుతో ప్రజల్లో చిచ్చు అధికారంలోకి వచ్చాక చర్చిల నిర్మాణానికి సహకరిస్తాం పెళ్లిళ్లు చేసే పాస్టర్లకు పర్మినెంట్ లైసెన్సులు ఇస్తాం ముఖాముఖి సమావేశంలో యువనేత నారా లోకేష్
కడప: జగన్ కులం, మతం, ప్రాంతం పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారు, జగన్ పాలనలో పాస్టర్లు అనేక సమస్యలు ఎదుర్కుంటున్నారు. పాస్టర్ల కి కనీస గౌరవం లేదు, పాస్టర్ల మీద దాడులు జరుగుతున్నాయి… చర్చిల్లో విబేధాలు సృష్టిస్తున్నారని టిడిపి యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. కడప రాజరాజేశ్వరి కళ్యాణ మండపం వద్ద చర్చి పాస్టర్లతో యువనేత లోకేష్ ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా యువనేత లోకేష్ మాట్లాడుతూ… క్రిస్టియన్ల సమస్యలు పరిష్కారం కోసమే టిడిపి క్రిస్టియన్ సెల్ ని బలోపేతం చేస్తున్నాం. టిడిపి హయాంలో ఏ మతం పైనా దాడులు జరగలేదు. గుడిపై దాడి జరిగినప్పుడు చంద్రబాబు గారు వెళితే కొంత మంది విమర్శించారు. ఏ మతం మీద దాడి జరిగినా మొదట స్పందించేది చంద్రబాబు గారు. హైదరాబాద్ లో మత ఘర్షణలు జరిగినప్పుడు వాటిని కంట్రోల్ చేసింది చంద్రబాబు గారు. క్రైస్తవులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. టిడిపి హయాంలో కమ్యూనిటీ హాల్స్ ఏర్పాటు కి సహాయం చేసాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మళ్లీ కమ్యూనిటీ హాల్స్ ఏర్పాటు కి సాయం చేస్తాం. చర్చిల నిర్మాణానికి సహాయం చేస్తాం. మౌలిక వసతులతో కూడిన ప్రత్యేక స్మశానాలు ఏర్పాటు చేస్తాం.
జరుసలేం యాత్రకు సబ్సిడీ పెంచుతాం
టిడిపి అధికారంలోకి వచ్చాక జరుసలేం యాత్ర కు సబ్సిడీ పెంచుతాం. హెల్త్ కార్డులు, చనిపోతే 10 లక్షల ఆర్ధిక సాయం కుటుంబానికి అందిస్తాం. ఇండిపెండెంట్ చర్చి పాస్టర్ల కు గౌరవ వేతనం పక్కాగా అందిస్తాం. మంగళగిరి లో క్రిస్మస్ అప్పుడు పాస్టర్ల కు గౌరవంగా బట్టలు పెడుతున్నా. పాస్టర్లు పెళ్లిళ్లు చేసే విధంగా పర్మినెంట్ లైసెన్స్ ఇస్తాం. జగన్ తెచ్చిన మూడేళ్ల నిబంధన ఎత్తేస్తాం. బైబిల్ కాలేజ్ ఏర్పాటుకి సహకరిస్తాం. పాస్టర్ల కు గుర్తింపు కార్డులు అందజేస్తాం. క్రిస్మస్ ఘనంగా జరిపేందుకు సహకరిస్తాం. ఏ మతాన్ని మేము చిన్న చూపు చూడం. జగన్ సృష్టించే అపోహలు నమ్మొద్దు. దళిత క్రైస్తవులకు లబ్ధి చేకూరేలా టిడిపి గతంలో చేసిన తీర్మానానికి కట్టుబడి ఉన్నాం.
ముఖాముఖి సమావేశంలో పాస్టర్ల ఆవేదన
ముఖాముఖి సమావేశంలో పాస్టర్లు మాట్లాడుతూ. జగన్ పాలనలో పాస్టర్ల కు కనీస గౌరవం దక్కడం లేదు. కనీసం 10 శాతం మందికి కూడా కూడా ఇవ్వడం లేదు. ఇప్పుడు అదీ లేదు. లక్షకు పైగా ఇండిపెండెంట్ పాస్టర్లు ఉన్నారు. వారికి ప్రభుత్వం నుండి ఎటువంటి సాయం అందడం లేదు. 10 వేల రూపాయల గౌరవ వేతనం ఇస్తే తప్ప బ్రతకలేని పరిస్థితి. క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్స్ ఏర్పాటు చేయాలి. ఇళ్లు నిర్మించి పాస్టర్ల కాలనీలు ఏర్పాటు చేయాలి. చర్చిల నిర్మాణం కోసం 5 సెంట్ల భూమి కేటాయించాలి. చర్చిల అభివృద్ది కి జగన్ ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయం అందడం లేదు. పాస్టర్ల ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలి. క్రిస్టియన్లు జగన్ పాలనలో అనేక ఇబ్బందులు పడుతున్నారు. పర్మినెంట్ మ్యారేజ్ లైసెన్స్ జగన్ ప్రభుత్వం రద్దు చేసి ఇప్పుడు కేవలం మూడేళ్లకు రెన్యువల్ చేసుకోవాలి అని నిబంధన పెట్టింది. ప్రత్యేక స్మశానాలు లేక ఇబ్బంది పడుతున్నాం. హెల్త్ ఇన్స్యరెన్స్ లేక ఇబ్బంది పడుతున్నాం. చనిపోతే ప్రభుత్వం నుండి కుటుంబానికి ఎటువంటి సాయం అందడం లేదు. క్రిస్టియన్, మైనార్టీ బోర్డు ద్వారా మాకు ఎటువంటి న్యాయం జరగడం లేదు. దీనిని విడదీసి పెడితే మాకు న్యాయం జరుగుతుంది. చర్చిల నిర్మాణం కోసం 7 వేల ధరఖాస్తులు వస్తే జగన్ ప్రభుత్వం ఈ రోజు వరకూ ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఎటువంటి ష్యురిటి లేకుండా లక్ష రూపాయిలు వరకూ బ్యాంకు రుణాలు అందేలా చూడాలి. జెరూసలేం యాత్ర కు ఆర్ధిక సాయం అందించాలి. గత ప్రభుత్వం ఇచ్చిన క్రిస్మస్ కానుక కూడా జగన్ ప్రభుత్వం రద్దు చేసింది. పాస్టర్ల కు గుర్తింపు కార్డులు ఇవ్వాలి. మేము ఏ పార్టీకి చెందిన వాళ్లం కాదు. మేము న్యాయం వైపు నిలబడతాం. వైసిపి నాయకుల పిచ్చి పరాకాష్ట కు చేరింది కడప జిల్లా లో ఒక చర్చి పై వైసిపి జెండా ఎగరేసిన ఘటన చోటు చేసుకుంది. క్రిస్మస్ కార్యక్రమానికి జగన్ ప్రభుత్వం ఎటువంటి సాయం ఇవ్వడం లేదు.
సమస్యలపై పోరాడి ప్రజలకు దగ్గర కావాలి! వేటాడకపోతే పులులు కూడా పిల్లులవుతాయ్ రాబోయే రోజుల్లో ఇన్ చార్జిల వ్యవస్థ ఉండదు
ఢీ అంటే ఢీ అని పోరాడే వారికే పార్టీలో గుర్తింపు పులివెందుల కార్యకర్తల సమావేశంలో లోకేష్
కడప: పులివెందులలో టిడిపి గెలవకపోయినా ఎప్పుడూ చిన్న చూపు చూడలేదు. అన్ని నియోజకవర్గాల లాగే పులివెందుల ను అభివృద్ది చేసాం. 90 వేల మెజారిటీ లో గెలిపించినందుకు జగన్ పులివెందులకు చేసింది ఏమిటని టిడిపి యువనేత నారా లోకేష్ ప్రశ్నించారు. కడప రాజరాజేశ్వరి కళ్యాణ మండపం వద్ద పులివెందుల టిడిపి కార్యకర్తలు, నాయకులతో యువనేత లోకేష్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా యువనేత మాట్లాడుతూ… పులివెందులకు నీరు ఇచ్చింది టిడిపి. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసాం. రాజకీయ అవకాశాలు కూడా ఎక్కువ కల్పించాం. ఎన్నో పదవులు ఇచ్చాం. జగన్ పాలనలో విపరీతంగా పన్నులు పెంచి ప్రజల్ని పీడిస్తున్నాడు. పులివెందుల ప్రజలు కూడా జగన్ బాధితులే. బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాలు అనుకున్న మేర పులివెందులలో జరగలేదు. మనలో మార్పు రావాలి ప్రజలకి దగ్గర అవ్వాలి. ప్రజా సమస్యల పై పోరాడినప్పుడే ప్రజలు మనల్ని ఆశీర్వదిస్తారు.
పులివెందులకు జగన్ చేసింది ఏమిటి?
జగన్ సిఎం అయ్యాక పులివెందులకు ఒక్క పరిశ్రమ తీసుకొచ్చాడు? రోడ్లు వేసాడా? కోట్ల రూపాయలు మంజూరు చేశాను అంటున్నాడు. ఒక్క రూపాయి విడుదల చేసాడా? జయంతి, వర్ధంతి కి తప్ప జగన్ పులివెందులకు చేసింది ఎంటి? నా సూటి ప్రశ్న. సీనియర్, జూనియర్లు ను సమానంగా గౌరవిస్తా. కానీ పని చేసే వారికే పదవులు ఇస్తా. మీ బూత్ లో మెజారిటీ తెస్తేనే పదవులు ఇస్తాం. నాయకులు అందరూ నియోజకవర్గంలో అందుబాటులో ఉండాలి.కేసులకు భయపడి ఇంట్లో పడుకుంటాం అంటే ప్రజలు హర్షించరు. పోరాడిన వారికే ప్రజల మద్దతు ఉంటుంది. గ్రూప్ రాజకీయాలని ప్రోత్సహించం. భవిష్యత్తుకి గ్యారెంటీ కార్యక్రమం పులివెందుల లో పక్కగా నిర్వహించాలి. నియోజవర్గంలో పనిచేయకుండా పదవులు అడగొద్దు.
ప్రజాదరణ ఉంది, అంది పుచ్చుకోండి!
మిషన్ రాయలసీమ లో భాగంగా పులివెందులకు కూడా పరిశ్రమలు తీసుకొస్తాం. జగన్ మైక్రో ఇరిగేషన్ అంటూ హడావిడి చేశాడు. ఒక్క అడుగు ముందుకు వెయ్యలేదు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్ ప్రాజెక్టులు, మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. టిడిపి అధికారంలోకి ఉన్నప్పుడు ఎక్కువ శాతం పరిశ్రమలు అన్ని రాయలసీమ కే వచ్చాయి. వైసిపి అధికారంలోకి వచ్చాక నాడు – నేడు పేరుతో హడావిడి తప్ప పులివెందుల స్కూళ్ల లో కనీసం మౌలిక వసతులు లేవు. వందల కోట్ల తో రోడ్ల నిర్మాణం కోసం శంకుస్థాపన చేసారు .ఒక్క రోడ్డు కూడా పూర్తి చెయ్యలేదు. పంచాయతీ రాజ్ శాఖ అధ్వర్యంలో వేయాల్సిన రోడ్లు పూర్తి చెయ్యలేదు. కనీసం అదనంగా ఒక్క ఎకరాకు సాగునీరు జగన్ అందించలేదు.
పదవులిచ్చి గౌరవించాం!
కడప జిల్లా లో టిడిపి కి పెద్ద ఎత్తున ఆదరణ ఉంది. దానిని నాయకత్వం అందిపుచ్చుకోవాలి. పులి వేటకి వెళ్లకపోతే పిల్లి అవుతుంది. టిడిపి నాయకులు అంతా పోరాడాలి. పులివెందుల లో అనేక అక్రమాలు జరుగుతున్నాయి. సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలు ఏమి జరగడం లేదు. పులివెందులకు చెందిన నేతలకు ఎమ్మెల్సీ పదవులు ఇచ్చి గౌరవించాం. ఓడిపోయినా ఇంఛార్జ్ గా ఉండి పెత్తనం చెయ్యాలి అనుకుంటే ఇక కుదరదు. ఇంఛార్జ్ వ్యవస్థ రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. టిడిపి నాయకుల్ని, కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టిన అధికారుల పై జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసి సర్వీస్ నుండి తొలగిస్తాం. ఢీ అంటే ఢీ అనే వాళ్ళనే నేను గుర్తిస్తాను.
యువనేతను కలిసిన టక్కోలు రైతులు
రాజంపేట నియోజకవర్గం టక్కోలు, కడపాయపల్లి, లింగపల్లి రైతులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. మా గ్రామాలు తరచూ పెన్నానది ముంపుకు గురవుతున్నాయి. 1986లో ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు రాతి రక్షణగోడ నిర్మించారు. కాలక్రమంలో వరద తీవ్రతకు ఈ గోడ దెబ్బతిని కొట్టుకుపోయింది. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఈ సమస్యను పట్టించుకోలేదు. మా గ్రామాల పరిధిలో వేల ఎకరాల భూములు వరదల సమయంలో మునుగుతున్నాయి. 1998లో మా గ్రామాలు వారం రోజులు జలదిగ్బంధంలో ఉన్నాయి. మనుషులు, పశువులు, పంటలు కొట్టుకుపోయి తీవ్ర నష్టం సంభవించింది. మీరు అధికారంలోకి వచ్చాక పెన్నానదికి రక్షణ గోడ నిర్మించాలని కోరుతున్నాం.
నారా లోకేష్ స్పందిస్తూ…
ముఖ్యమంత్రి జగన్ కు దోచుకోవడం, దాచుకోవడంపై ఉన్న శ్రద్ధ సమస్యల పరిష్కారంపై లేదు. జగన్మోహన్ ధనదాహం కారణంగా అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి 61మంది చనిపోయారు. అధికారంలోకి వచ్చాక కొత్తగా ఒక్క ప్రాజెక్టు కట్టకపోగా, గత ప్రాజెక్టులకు మరమ్మతులు చేయలేని దిక్కుమాలిన ప్రభుత్వం రాజ్యమేలుతోంది. టిడిపి అధికారంలోకి వచ్చాక పెన్నానదికి రక్షణ గోడ నిర్మించి, ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతాం.
లోకేష్ ను కలిసిన సిద్ధవటం మండల ప్రజలు
రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండల ప్రజలు యువనేత లోకేష్ ను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు 1986 జూలై 6న సిద్ధవటం మండలం మాచుపల్లి-ఖాదర్ బంగ్లా మధ్య పెన్నా నదిపై వారధి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 36 పిల్లర్లతో బ్రిడ్జి నిర్మాణం చేపట్టగా, తర్వాత పనులు ముందుకు సాగలేదు. పెన్నానది ప్రవాహానికి పిల్లర్లు కొట్టుకుపోయాయి. అధికారులు, పాలకులకు ఎన్నిసార్లు చెప్పినా దీని గురించి పట్టించుకోవడం లేదు. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే దాదాపు మండలంలోని 10గ్రామాలకు సౌకర్యంగా ఉంటుంది. 12 నుండి 32కిలోమీటర్లు చుట్టూ తిరిగొచ్చే సమస్య తప్పుతుంది. మీరు అధికారంలోకి వచ్చాక ఈ బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.
నారా లోకేష్ స్పందిస్తూ
సొంత జిల్లాలో ప్రజల కోసం ఒక్క బ్రిడ్జి నిర్మించలేని అసమర్థుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఎన్నికల సమయంలో రాయలసీమ బిడ్డనని చెప్పుకొని ఓట్లు దండుకోవడంపై ఉన్న శ్రద్ధ..జిల్లాప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై లేదు. టిడిపి అధికారంలోకి వచ్చాక సిద్దవటం మండల ప్రజలు సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న మాచుపల్లి-ఖాదర్ బంగ్లా నడుమ బ్రిడ్జి నిర్మించి ఈ ప్రాంత ప్రజల కష్టాలు తీరుస్తాం. కడపజిల్లాలో దీర్ఘకాల సమస్యల పరిష్కారానికి తెలుగుదేశం పార్టీని గెలిపించండి.
Also Read This Blog:Trailblazing Youth Empowerment: The Yuvagalam Padayatra Story
Tagged: #LokeshPadaYatra#Padayatra#YuvaGalamLokesh#YuvaGalam#NaraLokeshPadaYatra#NaraLokesh