yuvagalm padaytra,yuvagalam
Nara lokesh padayatra,Yuvagalam

1400 కి.మీ.లకు చేరిన యువగళం పాదయాత్ర జమ్మలమడుగులో ఉత్సాహంగా సాగిన యువగళం దారిపొడవునా యువనేత ఎదుట సమస్యల వెల్లువ

జమ్మలమడుగు: రాష్ట్రంలో అరాచకపాలనను అంతమొందించేందుకు యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉత్సాహంగా సాగుతోంది. 109వరోజు యువగళం పాదయాత్ర జమ్మలమడుగు నియోజకవర్గం సుద్దపల్లి నుంచి ప్రారంభమైంది. దారిపొడవునా మహిళలు, యువకులు, వృద్ధులు యువనేతకు ఎదురేగి ఘనస్వాగతం పలికారు. పాదయాత్ర ప్రారంభానికి ముందు గండికోట, రాజోలి గండికోట ప్రాజెక్టుల నిర్వాసితులు, రైతులతో యువనేత లోకేష్ సమావేశమై వారి కష్టాలు తెలుసుకున్నారు. పెద్దముడియం మండలం నెమళ్లదిన్నె వద్ద యువగళం పాదయాత్ర 1400 కి.మీ. మజిలీని చేరుకుంది. ఈ సందర్భంగా గండికోట నిర్వాసితులకు ఉపాధి కల్పించే చిన్నతరహా పరిశ్రమల ఏర్పాటుకు లోకేష్ శిలాఫలకం ఆవిష్కరించారు. అధికారంలోకి వచ్చాక పరిశ్రమల ఏర్పాటు ద్వారా ఇక్కడి రైతులు, యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పారు. అనంతరం జంగాలపల్లె, జె.కొత్తపల్లి, ఉప్పులూరు, నెమళ్లదిన్నె మీదు ఎన్.కొత్తపల్లి శివారు విడిది కేంద్రానికి చేరుకొంది. దారిపొడవునా వివిధ గ్రామాల ప్రజలు, రైతులు, రాజోలి రిజర్వాయర్ నిర్వాసితులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. మరో ఏడాదిలో రాబోయే చంద్రన్న ప్రభుత్వం అందరి సమస్యలు పరిష్కరిస్తుందని భరోసా ఇచ్చి ముందుకు సాగారు.

యువనేత ఎదుట వ్యక్తమైన సమస్యలు:

ఎన్టీఆర్ హౌసింగ్ బిల్లు నిలిపేశారు -మునీంద్ర బాబు, పెద్దముడియం.

 2018లో నాకు ఎన్టీఆర్ హౌసింగ్ కింద ఇల్లు మంజూరు అయింది. బేస్మెంట్ బిల్లు కూడా రూ.19,300 వచ్చింది. కానీ 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత  నా ఇంటి బిల్లులు నిలిపేశారు. సచివాలయంలోకి వెళ్లి  నా ఇంటి బిల్లులు మంజూరు చేయాలని అడిగా. నువ్వు గత ఎన్నికల్లో టిడిపికి ఓటేశావు నీకు ఇంటి బిల్లులు రావు అని చెప్పారు.  కులం చూడం, మతం చూడమని ఎన్నికల ముందు చెప్పి.. అధికారంలోకి వచ్చాక.. దూదేకుల వాళ్ళం.. మేము ఏమీ చేయలేమని మాలాంటి బలహీన వర్గాలకు చెందిన వారి బిల్లులు ఆపేశారు. రూ.4 లక్షలు అప్పు చేసి కొదవ ఇంటిని పూర్తి చేసుకున్నా.

నీళ్లు లేనిచోట ఇళ్లపట్టాలిచ్చారు! -సురేష్, జంగాలపల్లె

మా గ్రామంలో వైసీపీ ప్రభుత్వం కేవలం 13మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. ఊరికి సుమారు కిలో మీటరు దూరంలో స్థలాలు ఉన్నాయి. అక్కడ ఎటువంటి మౌలిక సదుపాయాలు కల్పించలేదు. ఇల్లు కట్టాలన్న అక్కడ నీరు, కరెంటు లేవు. అధికారులు, నాయకులు ఇల్లు కట్టాలని ఒత్తిడి చేశారు. కట్టకపోతే పట్టాలు తిరిగి ఇచ్చేయాలన్నారు. ప్రభుత్వం ఇచ్చే చాలీ, చాలని డబ్బులు సరిపోక, మౌలిక వసతులు లేక పట్టాలు అధికారులకు తిరిగి ఇచ్చేశాం. మా గ్రామంలో ఈ ప్రభుత్వంలో ఒక్క రోడ్డు వేయలేదు. గతంలో వేసిన రోడ్లు అన్నీ పాడైపోయాయి. సరిపడా నీళ్లు రావు. తాగడానికి బిందెడు నీళ్లు రూ.5 పెట్టి కొనుక్కోవాల్సివాస్తోంది. డ్రైనేజిలు లేవు.

రైతులకు రేషన్ కార్డు తీసేస్తారా? రమణారెడ్డి, రైతు, జంగాలపల్లె.

 నాకున్న 20 ఎకరాల్లో  శనగ పంట సాగు చేశాను. రూ.10 లక్షలు పెట్టుబడి అయింది.  కనీసం కూలి ఖర్చులు, పెట్టిన పెట్టుబడి కూడా రాలేదు.  నాలుగేళ్లుగా నాకు ఒకసారి కూడా పంటబీమా అందలేదు. కానీ 20 ఎకరాలు పొలం ఉన్నదాని రేషన్ కార్డు తీసేశారు. నాకు మొదటి నుంచి  రేషన్ కార్డు ఉంది. 20 ఎకరాలు ఉన్నదని రేషన్ కార్డు తీశారు..మరి నష్టం వచ్చినందుకు నష్టపరిహారం ఎందుకు ఇవ్వట్లేదు.?  నాలుగేళ్లుగా నష్టాలే తప్ప లాభమే రావడం లేదు.  కనీసం నాకు రైతు భరోసా కూడా ఇవ్వలేదు.

నాలుగేళ్ల పాలనలో రైతులేని రాజ్యంగా మార్చేశారు! వ్యవసాయమంత్రి ఎక్కడున్నారో కనబడుట లేదు అధికారంలోకి రాగానే గండికోట నిర్వాసితులకు పరిహారం ముఖాముఖి సమావేశంలో యువనేత నారా లోకేష్

జమ్మలమడుగు: ఎన్నికల ముందు జగన్ రైతు రాజ్యం తెస్తానని చెప్పాడు. 108 రోజులుగా సీమలో పాదయాత్ర చేస్తున్నా..కానీ ఇక్కడ  రైతులేని రాజ్యంగా కనిపిస్తోందని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. జమ్మలమడుగు నియోజకవర్గం సుద్దపల్లిలో గండికోట, రాజోలు రిజర్వాయర్ల ముంపు బాధితులు, రైతులతో లోకేష్ ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… నకిలీ పత్తి విత్తనాలతో నష్టపోతున్నామని ఇక్కడి రైతుల చెబితే… కాదు రైతుల తప్పిదాలతోనే వాళ్లు నష్టపోతున్నారని ఎంపీ రిపోర్టులు తయారు చేయించారు. మోటార్లకు మీటర్లు పెట్టి రాయలసీమ రైతులకు జగన్ ఉరితాడు బిగించబోతున్నాడు. రైతుల ఆత్మహత్యల్లో ఏపీ మూడోస్థానం, కౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండో స్థానంలో ఉంది. డ్రిప్ కు సబ్సీడీ ఎత్తేశారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు పరిహారం కూడా అందించడం లేదు.

నిర్వాసితులను మోసగించిన వైసీపీ

పోలవరం, గండికోట, రాజోలి ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం అందించడం లేదు.. రైతులకు కనీసం ఇప్పుడు ట్రాన్స్ ఫార్మర్లు కూడా ఇవ్వడంలేదు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, పునరావాస కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు యుద్ధప్రాతిపదికన కల్పిస్తాం. 2014లో ఒక్క ఎమ్మెల్యేనే కడప జిల్లాలో TDP ని గెలిపించారు. అయినా రోడ్లు, బ్రిడ్జిలు నిర్మించాము. పులివెందులకు నీళ్లు కూడా అందించాము. 2019లో అన్ని స్థానాల్లో వైసీపీని గెలిపించారు. మీ జీవితాలు ఏమైనా మారాయా?  సీఎం సొంత జిల్లాలో పనులు కావడం లేదంటే ఆలోచించండి.  టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే సజ్జలదిన్నె నుండి సంకేపల్లి బ్రిడ్జి పూర్తి చేస్తాం.

గండికోట నిర్వాసితుల సమస్య గాలికొదిలేశారు!

2020లో జగన్ ఇక్కడికి వచ్చి గండికోటలో 26 టీఎంసీల సామర్థ్యం పెట్టడం తన నా అదృష్టం అని జగన్ అన్నారు. బాధితులకు న్యాయం చేస్తానని కూడా హామీ ఇచ్చారు. రూ.200 కోట్లు ఖర్చు చేస్తే మీ సమస్యలు తీరుతాయి. రూ.665 కోట్లతో నాడు చంద్రబాబు మీకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అందించడానికి నిధులు కేటాయించారు. ఈ ప్రభుత్వం వచ్చాక రాత్రికి రాత్రి పోలీసులను పెట్టి మిమ్మల్ని ఖాళీ చేయించారు. సీఎం సొంత జిల్లాలోనే రైతులకు న్యాయం చేయకపోతే రాష్ట్రంలోని రైతులకు ఏం న్యాయం చేస్తాడు? టీడీపీ అధికారంలోకి వచ్చాక న్యాయబద్ధమైన పరిహారం మేము అందిస్తాం. ముంపు కాలనీల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేస్తాం. టీడీపీ అధికారంలోకి వచ్చాక ప్రతి ఇంటికి మంచి నీటి కుళాయి ఏర్పాటు చేస్తాం. గండికోట నిర్వాసితులకు చిన్నతరహా పరిశ్రమలు తెచ్చి ఉపాధి కల్పిస్తాం. పాడి రైతులకు గతంలో సబ్సీడీలు ఉండేవి..కానీ ఇప్పుడు దాన్ని ఈ ప్రభుత్వం కూల్చేసింది. టీడీపీ వచ్చాక పాడి రైతులను ప్రోత్సహిస్తాం.

ఇన్ పుట్ సబ్సిడీ ఎత్తేశారు!

ఈ ప్రభుత్వం వచ్చాక ఇన్ పుట్ సబ్సీడీ రద్దు చేసింది. పెట్రోల్, డీజల్ ధరలు పెరగడంతో ఎరువులు, విత్తనాల ధరలు పెరిగాయి. పెట్టిన పెట్టుబడి కూడా రైతులకు రావడం లేదుసీఎం ఒక సభా వేదికగా హామీ ఇస్తే దాన్ని నిలబెట్టుకోవాలి. శనగకు రూ.4,800 మద్ధతు ధరతో గతంలో మేము మద్ధతు ధర అందిచాము.  రాయలసీమ నుండి వెళ్లేలోపు సీమకు ఏం చేయబోతున్నామో వెల్లడిస్తాం. సీమలో మామిడి, టమోటాకు ప్రాసెసింగ్ యూనిట్లు రావాలి. గతంలో రూ.70 వేలు ఉన్న రైతు తలసరి అప్పు వైసీపీ ప్రభుత్వం వచ్చాక రూ.2.50లక్షలకు పెరిగింది.

రాజోలి రిజర్వాయర్ సామర్థ్యంపై పూటకోమాట

రాజోలి ప్రాజెక్టు సామర్థ్యం గతంలో 2.9 టీఎంసీలు అని ఇప్పుడు 1.6 టీఎంసీలు అని జగన్ అంటున్నారు. పూటకో మాట మాట్లాడటం వల్ల రైతులు ఇబ్బంది పడతారు. ముంపు వాసులకు పరిహారం రూ.20 లక్షలు ఇవ్వాలన్న దానిపై పార్టీ అధిష్టానంతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం. టీడీపీ హయాంలో చేతినిండా పని ఉండేది. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక రైతుల నుండి వెయ్యి ట్రాక్టర్లు ఫైనాన్స్ వాళ్లు తీసుకెళ్లారు. గతంలో మీకు ఇచ్చిన సబ్సీడీలు మళ్లీ అమలు చేస్తాం. పెద్దాపురంలో లిఫ్ట్ ఇరిగేషన్ పై అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. పూర్తి సమాచారం తెలుసుకుని దీనిపై హామీ ఇస్తా. వ్యవసాయ శాఖ మంత్రి కోర్టులో దొంగతనం చేసి సీబీఐ చుట్టూ తిరుగుతున్నారు. మంత్రి ఏనాడైనా రైతుల వద్దకు వచ్చారా? వ్యవసాయ శాఖ మంత్రి కనబడటం లేదని బోర్డు పెట్టాలి.  

అధికారంలోకి వచ్చాక పరిహారం అందజేస్తాం

మామిడి, చీని, దానిమ్మ వంటి హార్టి కల్చర్ పంటలను ప్రోత్సహించాలి. ఉపాధిహామీని గతంలో హార్టి కల్చర్ కు అనుసంధానం చేసే సమయంలో ప్రభుత్వం మారిపోయింది. కొత్త రకాల మామిడి తీసుకురావాలి. మామిడి పరిశోధనాకేంద్రం ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. గండికోట ప్రాజెక్టు నిర్వాసితుల్లో పరిహారం రాని వాళ్లకు పరిహారం అందిస్తాం.  ప్రభుత్వం వచ్చాక పల్లెలను పట్టించుకోవడం లేదు. పంచాయతీలను నిర్వీర్యం చేశారు. టీడీపీ హాయంలో వేసిన రోడ్లు, బ్రిడ్జిలే ఇంకా ఉన్నాయి. బుక్కపట్నంను పంచాయతీగా ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తాం.

ముఖాముఖి సమావేశంలో వ్యక్తమైన అభిప్రాయాలు:

ఈశ్వర్, కొండాపురం గ్రామం : పెన్నానదికి ఎడమవైపున మా గ్రామం ఉంది. సజ్జలదిన్నె నుండి సంకేపల్లి బ్రిడ్జికి టీడీపీ ప్రభుత్వం రూ.34 కోట్లు కేటాయించి 30 శాతం  పనులు కూడా పూర్తి చేసింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక పనులు చేపట్టడంలేదు. మీ ప్రభుత్వం వచ్చాక బ్రిడ్జి నిర్మించండి.

ఉన్నత రామ్ ప్రసాద్ రెడ్డి, తాళ్లపొద్దుటూరు : గండికోట ప్రాజెక్టు కింద మా భూములు ముంపునకు గురయ్యాయి. జగన్ మాటలు నమ్మి మేము మోసపోయాం. రూ.10 లక్షల పరిహారం ఇస్తానని చెప్పి రూ.7 లక్షలు ఇచ్చారు. అవి కూడా అందరికీ సరిగా రాలేదు. పునరావాసకాలనీల్లో మౌళిక వసతులు మా కాలనీల్లో చేస్తామని చెప్పారు..కానీ ఏమీ చేయలేదు. కనీసం హై స్కూల్ కు కాంపౌండ్ కూడా నిర్మించలేదు. మా గ్రామంలో వెయ్యి కుటుంబాలు ఉన్నయి..జీవనాధారానికి పనులు కూడా లేవు. స్థానికంగా పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ఉపాధితో పాటు, మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. తాగునీటికి తీవ్ర సమస్య ఎదుర్కొంటున్నాం.  మా గ్రామానికి చెందిన రైతుల మోటార్లు కూడా నీళ్లలో పోయాయి. మోటార్లు తెచ్చుకునేందుకు కూడా సమయం ఇవ్వలేదు. నీటి సామర్థ్యం 12 టీఎంసీలు పెడితే మా మోటార్లు కూడా తెచ్చుకోవడానికి కుదురుతుంది.

కె.పుల్లారెడ్డి, పెద్దపసుపుల : మా ప్రాంతంలో శనగ ఎక్కువగా పండిస్తారు. రూ.6,500 మద్ధతు ధరతో శనగను కొనుగోలు చేస్తామని జగన్ గతంలో హామీ ఇచ్చారు. తక్కువ రేటుకు అమ్ముకోలేక రైతులు మూడేళ్లుగా శనగ పంటను గోడౌన్లలో దాచుకున్నారు. చాలామంది రైతులు అప్పులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు.

పురుషోత్తంరెడ్డి, రాజోలి బాధితుడు : రాజోలి ప్రాజెక్టు నిర్వాసితులకు రూ.12.50 లక్షలు ఇస్తామని ఏడాది క్రితం జగన్ చెప్పారు. ప్రాజెక్టు కింద మొత్తం 9 ఎకరాలు పోగా..అందులో 2 ఎకరాలు బంజరు భూమి ఉంది. రైతులకు చెందిన 7 వేల ఎకరాలు రాజోలిలో ముంపుకు గురవుతోంది. ఇందులో 4 వేల ఎకరాలు ఇప్పటికే తీసుకున్నారు. రూ.300కోట్లు విడుదల అయ్యాయని గత వారం నుండి మాకు మాటలు చెప్తున్నారు. ప్రభుత్వం దగ్గర డబ్బుల్లేవని ప్రాజెక్టు ఎత్తును 1.6 టిఎంసిలక పరిమితంచేసి, ఎత్తు తగ్గిస్తామని చెబుతున్నారు. రైతులను కూడా కలెక్టర్ కార్యాలయం వద్ద పరిహారం కోసం ఆందోళన చేస్తే ఎమ్మెల్యే అనుచరులు వచ్చి కొట్టారు. మాకు రూ.20లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలి.

జగదీశ్వరరెడ్డి, పెద్దపసుపుల : నాకు 12 ఎకరాల భూమి ఉంది. గతంలో వరుసగా వర్షాలు రావడం వల్ల శనగ విత్తనాలు రెండు సార్లు నాటాను. టీడీపీ హయాంలో శనగ విత్తనాలు సబ్సీడీలో వచ్చేవి.  పండిన పంట నష్టపోయినా పసల్ బీమా యోజనతో బీమా వచ్చేది..కానీ మూడేళ్లుగా మాకు బీమా సొమ్మ రావడం లేదు. 

ఆదినారాయణరెడ్డి, పెద్దాపురం గ్రామం : గండికోట ప్రాజెక్టు పరిహారంలో అందరికీ న్యాయం జరగడం లేదు. సర్వేలో మా పేర్లు లేవని పరిహారం ఇవ్వలేదు. వేల ఎకరాల సారవంతమైన భూమి ముంపునకు గురైంది. మెట్టభూమి మా ప్రాంతంలో ఎక్కువగా ఉంది..ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేసి నీళ్లు అందిస్తే వ్యవసాయం చేసుకుంటారు. పొలాలు ముంపులో పోవడం వల్ల పిల్లల్ని మంచి చదవులు కూడా చదివించుకోలేకపోతున్నాం.

అరుణ్ కుమార్ రెడ్డి, కొట్టాలపల్లి : గండికోట కింద మా ప్రాంతంలో మా గ్రామంలోని 75 శాత భూమి పోయింది. నిట్టూరు, గంగాదేవిపల్లె లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ముందుకు సాగడం లేదు. మీ ప్రభుత్వం వచ్చాక వీటిని పూర్తి చేయాలి. చీని, మామిడి మా ప్రాంతంలో ఎక్కువగా పండుతాయి. టన్ను బత్తాయికి 250 కేజీల జాక్ పాట్ తీస్తున్నారు. దాన్ని రద్దు చేయాలి. గత ఏడాది చిత్రావతి నదిలో 3 కరెంట్ పోల్ లు పడిపోయాయి. దీనికి రూ.30 లక్షలు ఖర్చు అవుతుంది. వాటిని ఏర్పాటు చేయడంలోనూ ఈ ప్రభుత్వం దృష్టిపెట్టలేదు.

ఈశ్వర్ రెడ్డి, కొండాపురం : గండికోట ప్రాజెక్టుకు 2006లో మొదటి ఫేజ్ కింద 14 గ్రామాలు తీసుకున్నారు. 2011లో సెకెండ్ ఫేజ్ కింద 8 గ్రామాలు తీసుకున్నారు. మొదటి ఫేజ్ లో భూములు కోల్పోయిన వారికి రూ.70 వేలు ఇచ్చారు. నీటి పారుదల ఉన్న వాటికి రూ.1.75 వేలు ఇచ్చారు. కానీ ఇప్పుడు గతంలో ఇచ్చిన భూములకు రూ.10 లక్షల దాకా ఇస్తారని చెప్తున్నారు. మొదటి ఫేజ్ లో ఇచ్చిన వాళ్లు బాగా నష్టపోయారు. మా భూములకు పరిహారం, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇంకా చాలా మందికి రాలేదు.

యువనేతను కలిసిన జంగాలపల్లె గ్రామస్తులు

జమ్మలమడుగు నియోజకవర్గం జంగాలపల్లె గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. కేసీ కొనాల్ చివరి ఆయకట్టుకు వరదలు, మిగులు జలాలు వచ్చినప్పుడు మా పొలాల్లో వ్యవసాయానికి ఇబ్బందిగా ఉంది. మా పొలాలు చివరి ఆయకట్టు కావడంతో నీరు లేక పంటలు ఎండిపోతున్నాయి, బోర్లు పడడం లేదు. మాకు కుందూ నది నుండి 2కిలోమీటర్ల పైపులైన్ వేసి ఎత్తిపోతల పథకం ద్వారా ప్రధాన కాలువలో నీరు వదిలితే సిమెంట్ లైనింగ్ ద్వారా మా పొలాలకు నీళ్లు వస్తాయి. హిందూ, ముస్లిం, క్రైస్తవ మతస్తులకు శ్మశానవాటికలు ఏర్పాటుచేయాలి. మా పొలాలకు వెళ్లడానికి మెటల్ రోడ్లు నిర్మించాలి. గ్రామంలో నీటి వసతి 40శాతం మాత్రమే ఉంది. పూర్తిస్థాయిలో నీరు అందించాలి. జంగాలపల్లె నుండి పెద్దముడియం మండల రోడ్డు 20 సంవత్సరాల క్రితం నిర్మించారు. పాడైపోతే కొత్తరోడ్డు వేయడం లేదు. ఎస్సీ కాలనీ, మైనారిటీ కాలనీల్లో సీసీరోడ్లు పెండింగ్ లో ఉన్నాయి. వాటిని నిర్మించాలి.

నారా లోకేష్ స్పందిస్తూ…

జగన్మోహన్ రెడ్డి పాలనలో గ్రామాల అభివృద్ధి పూర్తిగా పడకేసింది. టిడిపి హయాంలో రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులపై 11వేలకోట్లు ఖర్చుచేస్తే, జగన్ అధికారంలోకి వచ్చాక పదోవంతు కూడా ఖర్చుచేయలేదు. పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టకపోగా రైతులు ఎదుర్కొంటున్న చిన్నచిన్న సమస్యలను సైతం పరిష్కరించలేకపోతున్నారు. జంగాలపల్లె రైతులకు కుందూనది ద్వారా సాగునీటి అందించేందుకు చర్యలు తీసుకుంటాం. వాటర్ గ్రిడ్ ద్వారా ఇంటింటికీ కుళాయి అందజేసి, తాగునీటి సమస్యకు శాశ్వతక పరిష్కారం చూపుతాం. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, శ్మశానవాటికలు, మౌలిక సదుపాయాలు కల్పిస్తాం.

లోకేష్ ను కలిసిన జె.కొట్టాలపల్లి గ్రామస్తులు

జమ్మలమడుగు నియోజకవర్గం జె.కొట్టాలపల్లి గ్రామ ముస్లింలు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మా గ్రామంలోని హిందువులకు శ్మశానవాటిక లేదు, స్థలం కేటాయించాలి. మైనారిటీల ఖబరస్థాన్ కు ప్రహరీగోడ నిర్మించాలి. జె కొట్టాలపల్లె, జంగాలపల్లె గ్రామాల మైనారిటీలకు షాదీఖానా నిర్మించాలి. కుందూనది నుండి వేసిన పైపులైన్ పాడైపోయింది. కొత్త పైపులైన్ నిర్మించాలి. కేసీ కెనాల ప్రధాన కాలువకు అనుసంధానంగా పంట కాలువలు ఏర్పాటు చేయాలి. మా గ్రామంలో సీసీ రోడ్లు నిర్మించాలి. నేలంపాడు నుండి గొట్లూరు రోడ్డు ఎత్తుగా నిర్మించడం వల్ల జె.కొట్టాలపల్లెలోని పొలాలు 1,500 ఎకరాలు నీటితో నిండిపోతున్నాయి. పంటలు వేసుకోవడానికి ఇబ్బందిగా ఉంది. ఈ ముంపుకు గురయ్యే పొలాలకు కిలోమీటరు దూరంలో వక్కిలేరు ఉంది. దానిలోకి ముంపు నీళ్లు మళ్లించే ఏర్పాటు చేయాలి.

నారా లోకేష్ స్పందిస్తూ…

మైనారిటీల ఆస్తులకు రక్షణ లేకుండా పోయింది, ప్రశ్నించిన వారిపై దాడులు, హత్యలకు తెగబడుతున్నారు. గ్రామీణాభివృద్ధిని పూర్తిగా గాలికొదిలేశారు. గత టిడిపి ప్రభుత్వంలో గ్రామీణ ప్రాంతాల్లో 25వేల కిలోమీటర్ల సిసి రోడ్లు నిర్మించాం. 30లక్షల ఎల్ఇడి లైట్లు ఏర్పాటు చేశాం. టిడిపి మళ్లీ అధికారంలోకి వచ్చాక మైనారిటీలకు షాదీఖానా, ఖబరస్తాన్ ప్రహరీగో నిర్మిస్తాం. వక్ఫ్ ఆస్తులకు రక్షణ కల్పిస్తాం. వక్కిలేరులోకి ముంపునీటిని మళ్లించి రైతుల సమస్యను పరిష్కరిస్తాం.

యువనేతను కలిసిన ఉప్పులూరు,నెమళ్లదిన్నె రైతులు

జమ్మలమడుగు నియోజకవర్గం ఉప్పులూరు, నెమళ్లదిన్నె రైతులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. మా గ్రామంతో పాటు బలపనగూడూరు, గరిశెలూరు, నెమళ్లదిన్నె, చిన్నముడియం గ్రామాలు రాజోలు డ్యామ్ ముంపుకు గురవుతున్నాయి. డ్యామ్ ను 2.95 టిఎంసిల సామర్థ్యంతో నిర్మించి, మాకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి ఇప్పించాలి. చంద్రబాబు మా ప్రాంతానికి వచ్చినప్పుడు మాకు న్యాయం చేస్తామని చెప్పారు. మీరు అధికారంలోకి వచ్చాక మాకు, మా భూములకు తగిన పరిహారం ఇచ్చి న్యాయం చేయాలి.

నారా లోకేష్ మాట్లాడుతూ…

జగన్మోహన్ రెడ్డికి దోచుకోవడం, దాచుకోవడం తప్ప రైతుల కష్టాలు పట్టడం లేదు. ముంపు బాధితులకు పరిహారం అందించలేని దద్దమ్మ ప్రభుత్వం ప్రాజెక్టులను కడుతుందా? టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే 2.95 టిఎంసి సామర్థ్యంతో రాజోలు ప్రాజెక్టు నిర్మించి, నిర్వాసితులకు పరిహారం అందిస్తాం. రైతుల జీవనానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి అందజేస్తాం.

యువనేతను కలిసిన ఎన్.కొత్తపల్లి గ్రామస్తులు

జమ్మలమడుగు నియోజకవర్గం ఎన్.కొత్తపల్లి గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మా గ్రామంలో తాగునీటి సౌకర్యం సరిగా లేక ఇబ్బంది పడుతున్నాం. కుందూనది నుండి తాగునీరు అందించి మా సమస్య పరిష్కరించాలి. గత పాలనలో నిర్మించిన రోడ్లు తప్ప వైసిపి ప్రభుత్వం వచ్చాక కొత్త రోడ్లు వేయలేదు. మైనారిటీ శ్మశానవాటికను వైసీపీ నాయకులు ఆక్రమించారు.  కబ్జానుండి కాపాడి కాంపౌండ్ వాల్ నిర్మించాలి. మా గ్రామంలోని పొలాలకు పుంత రోడ్డు నిర్మించాలి. గ్రామంలోని కుంట, కోనేరు ఆక్రమణలకు గురవుతున్నాయి, ప్రహరీగోడ నిర్మించి పరిరక్షించాలి. హిందూ శ్మశానవాటికకు బోరు, ప్రహరీ ఏర్పాటు చేయాలి. మైనారిటీలకు మసీదు, ఈద్గా సౌకర్యాలు  ఏర్పాటు చేయాలి.

నారా లోకేష్ స్పందిస్తూ…

రాయలసీమ బిడ్డనని చెప్పుకునే ముఖ్యమంత్రి సొంత జిల్లా ప్రజలకు గుక్కెడు నీళ్లవ్వకపోవడం సిగ్గుచేటు. రాష్ట్రంలో కబ్జాలకు కాదేది అనర్హం అన్న చందంగా పాలన సాగుతోంది. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామాల్లో మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేస్తాం. వాటర్ గ్రిడ్ ద్వారా ఇంటింటికీ తాగునీటి కుళాయి అందజేసి, శాశ్వత పరిష్కారం చూపుతాం. కుంట, శ్మశాన వాటికలకు ప్రహరీగోడ నిర్మించి ఆక్రమణల బారినుంచి పరిరక్షిస్తాం. గ్రామాల నుంచి పొలాలకు వెళ్లే పుంతరోడ్ల నిర్మాణం చేపట్టి రైతుల ఇబ్బందులను తొలగిస్తాం.

Also Read This Blog: Empowering Dreams, Inspiring Action: Yuvagalam Padayatra and Youth Activism

Tagged#LokeshPadaYatra#Padayatra#YuvaGalamLokesh#YuvaGalam#NaraLokeshPadaYatra#NaraLokesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *