మైదుకూరు నియోజకవర్గంలో ఉత్సాహంగా యువగళం అడుగడుగునా యువనేతకు మహిళల నీరాజనాలు దారిపొడవునా వివిధ వర్గాల వినతుల వెల్లువ నేడు కమలాపురం నియోజకవర్గం యువనేత పాదయాత్ర
మైదుకూరు: యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర 116వరోజు మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉత్సాహంగా సాగింది. దారిపొడవునా వివిధ వర్గాల ప్రజలు, మహిళలు యువనేతకు హారతులతో నీరాజనాలు పడుతూ ఆత్మీయ స్వాగతం పలికారు. దారిపొడవునా టిడిపి కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున బాణాసంచా కాలుస్తూ, నినాదాలు చేస్తూ యువనేతను స్వాగతించారు. జై తెలుగుదేశం, జై లోకేష్ నినాదాలతో హోరెత్తించారు. యువకులు, మహిళలు, వృద్ధులు యువనేతను కలిసి ఫోటోలు దిగేందుకు పోటీపడ్డారు. వివిధవర్గాల ప్రజలు గత నాలుగేళ్లుగా తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రాలు సమర్పించారు. దళితులు, పసుపు రైతులు, వివిధ గ్రామాల ప్రజలు యువనేతను కలసి సమస్యలను విన్నవించారు. మరో ఏడాదిలో రాబోయే చంద్రన్న ప్రభుత్వం అందరి సమస్యలకు పరిష్కారం చూపుతుందని భరోసా ఇచ్చి ముందుకు సాగారు. భూమయ్యపల్లి నుంచి ప్రారంభమైన యువగళం పాదయాత్ర ఇంజనీర్ కొట్టాల, పెద్దిరెడ్డి కొట్టాల, బుడ్డయ్యపల్లి, ఖాజీపేట, పత్తూరు, దుంపలగట్టు, కొత్తపేట మీదుగా చెన్నముక్కపల్లి విడిది కేంద్రానికి చేరుకుంది. 116వరోజు యువనేత లోకేష్ 13.1 కి.మీ. దూరం పాదయాత్ర చేశారు. ఇప్పటివరకు యువగళం పాదయాత్ర 1493.7 కి.మీ. పూర్తయింది. సోమవారం నాడు యువగళం పాదయాత్ర కమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో కొనసాగనుంది.
యువనేత ఎదుట వ్యక్తమైన సమస్యలు:
వడ్డీకి తెచ్చి పనులుచేస్తే బిల్లులు ఆపేశారు! -భూమిరెడ్డి గంగయ్య, ఖాజీపేట
కెసీ కెనాల్ ఆధునీకరణ పనుల కోసం 2018 నవంబర్ లో రూ.10 లక్షల ఖర్చు చేశాను. బిల్లులన్నీ సిద్ధం అయ్యాయి. కానీ ప్రభుత్వం మారాక బిల్లులన్నీ నిలిపేశారు. బిల్లులు వస్తాయన్న ఆశతో అధికారులకు 10 శాతం కమీషన్ కూడా ముందే చెల్లించా..అయినా ఇవ్వలేదు. రూ.2 వడ్డీకి తెచ్చి పనులు చేశా. నా కొడుకు చదువుకోసం విదేశాలకు వెళ్లాడు..ఫీజు కట్టడానికి ఆలస్యం అవ్వడం వల్ల పెనాల్టీ పడింది. ఖర్చులకు కూడా డబ్బుల్లేక ఇబ్బంది పడుతున్నా.
కూలీ ఖర్చులు కూడా రాలేదు -రమణ, మీర్జాఖాన్ పల్లి
నాలుగు ఎకరాల్లో ఉల్లి నాటాను. పంట కోసే సమయానికి రేటు లేదు. దున్నినా కూలీ ఖర్చులు కూడా రావని గొర్రెలు మేపుకునే వారికి ఇచ్చేశాను. రూ.2.4 లక్షల పెట్టుబడి అయింది. రూపాయి కూడా రాబడి లేదు. వేరు శనగ 10 ఎకరాలు నాటాను. ఎకరాకు రూ.70 వేలు ఖర్చు అయింది. ఎకరాకు 13 మూటలు అయ్యాయి. మూట రూ.15 వేలు మాత్రమే పలికింది. అన్ని ఖర్చులూ పోనూ రూ.1 లక్ష నష్టం వచ్చింది. పత్తికొండలో మొన్న సీఎం బటన్ నొక్కి విడుదల చేసిన రైతు భరోసా సొమ్ము ఇవాల్టికి కూడా రాలేదు.
అప్పుతెచ్చి హాస్పటల్ బిల్లు కట్టా! -కుమారి, కొత్త ఏటూరు గ్రామం
నా కూతురు సుకన్య స్కూళ్లో ఆడుకుంటూ కిందపడిపోయింది. దీంతో కాళ్లు పడిపోయాయి. విజయవాడకు వెళ్తే పరీక్షలు చేసి, ఆపరేషన్ చేయడానికి రూ.10 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారు. ఆరోగ్య శ్రీ కార్డు పని చేస్తుందేమోనని ఇంటికి వచ్చి ఆసుపత్రికి వెళ్తే బిల్లులు పడటం లేదని, డబ్బులుంటేనే చేస్తామని డాక్టర్లు చెప్పారు. దీంతో తిరుపతి సిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లా. రూ.4 లక్షలు కట్టించుకుని ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసిన పది నిమిషాలకు మళ్లీ కాళ్లు సచ్చుబడ్డాయి. డాక్టర్లను అడిగితే 2 నెలల తర్వాత వస్తాయని చెప్పారు. 4 నెలలు అయినా నా బిడ్డ కోలుకోలేదు. ఆరోగ్య శ్రీ పని చేయకపోవడం వల్ల రూ.4 లక్షలు వడ్డీకి తెచ్చి కట్టా. అయినా నా బిడ్డకు కాళ్లు రాలేదు.
పెన్షన్ ఇవ్వడం లేదు -సుబ్బమ్మ, ఖాజీపేట
నాకు 69 ఏళ్ల వయసు. నా భర్తకు 75 ఏళ్లపైనే ఉంటాయి. కానీ ఇద్దరిలో ఒకరికి కూడా పెన్షన్ ఇవ్వడం లేదు. అడిగితే బాగానే నడుస్తున్నారుగా పెన్షన్ ఎందుకు అని అన్నారు. నడిచేవాళ్లందరికీ పెన్షన్ ఇస్తున్నారు కదా.? నా కొడుకు తిరుపతిలో ట్రావెల్స్ లో కారు తోలుకుని జీవనం సాగిస్తున్నాడు. అతనికి కారు ఉందని మాకు పెన్షన్ ఇవ్వడం లేదు.
గుళ్లో తలదాచుకుంటున్నా! -జంగిలి పీరమ్మ, ఖాజీపేట
నాకు సొంత ఇల్లు లేదు. వృద్ధురాలిని..వచ్చే పెన్షన్ పైనే ఆధారపడి జీవిస్తున్నారు. రేకుల ఇంట్లో నెలకు రూ.1,000లు చెల్లించి ఉంటున్నా. నాకు ఇంటి స్థలం కోసం మా వీధి వాలంటీర్లను అడిగితే ఎమ్మెల్యే వచ్చినప్పుడు అడుగు ఇస్తారు అన్నాడు..కానీ ఎమ్మెల్యే రాలేదు..ఇంటి స్థలమూ లేదు. వర్షాకాలంలో రేకులు కారుతున్నాయి. గుళ్లోకి వెళ్లి తలదాచుకుంటున్నా.
బలిజల అభివృద్ధికి కృషిచేసింది టిడిపినే! కాపు రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం సొంత జిల్లాకు జగన్ చేసింది ఏమిటి? రిజర్వేషన్ రద్దుతో కాపులకు తీరని నష్టం
బలిజలతో ముఖాముఖిలో నారా లోకేష్
మైదుకూరు: రాయలసీమ లో బలిజలను ఆర్దికంగా, రాజకీయంగా పైకి తీసుకురావడానికి కృషిచేసింది టిడిపియేనని తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. మైదుకూరు నియోజకవర్గం భూమయ్యపల్లెలో బలిజ సామాజికవర్గీయులతో యువనేత లోకేష్ ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… బలిజలు జగన్ చేతిలో బాధితులుగా మారారు. రాయలసీమ లో బలిజల్ని జగన్ ప్రభుత్వం అసలు పట్టించుకోలేదు. తన పిల్లలు విదేశాల్లో చదివితే చాలు పేద విద్యార్థులు విదేశాల్లో చదవకూడదు అనే ఆలోచనలో జగన్ విదేశీ విద్య పథకం రద్దు చేశారు. గతంలో కాపులకు అమలు చేసిన రిజర్వేషన్ కి మేము కట్టుబడి ఉన్నాం. పేదరికానికి కులం, మతం, ప్రాంతం ఉండవు. బలిజలకు పెద్ద ఎత్తున అవకాశాలు ఇస్తాం. వారిని గెలిపించాల్సిన బాధ్యత మీ పై ఉంది.
20లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం!
జగన్ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని బ్రష్టు పట్టించి తల్లిదండ్రులు, విద్యార్థులని మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నాడు. పీజీ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని రద్దు చేశారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పాత ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలు చేస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. వైసిపి ప్రభుత్వమే మండలి లో టిడిపి ప్రభుత్వంలో 6 లక్షల ఉద్యోగాలు వచ్చాయని ఒప్పుకుంది. కడప ప్రజలు ఆలోచించాలి 10 సీట్లలో, 2 ఎంపి స్థానాల్లో వైసిపి ని భారీ మెజారిటీ తో గెలిపించారు. సిఎం సొంత జిల్లా అంటే ఎలా అభివృద్ది చెందాలి? కేవలం జయంతి, వర్ధంతి కి తప్ప కడప ఆయనకి గుర్తు రావడం లేదు. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోతే ఇప్పటి వరకూ బాధితులకు దిక్కు లేదు. టిడిపి కి 2014 కడప జిల్లా లో ఒకే సీటు ఇచ్చినా అభివృద్ది ఎంటో చేసి చూపించాం. 2024 ఎన్నికల్లో అదే 10 సీట్లు టిడిపి కి ఇవ్వండి. అభివృద్ది అంటే ఏంటో చేసి చూపిస్తాం. చెయ్యకపోతే కాలర్ పట్టుకొని నన్ను నిలదీయండి.
అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ టిడిపి!
అభివృద్ది కి కేర్ ఆఫ్ అడ్రస్ టిడిపి. యువతను క్రీడల్లో పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తాం. టిడిపి రాజంపేట పార్లమెంటు నుండి 12 సార్లు బలిజ వ్యక్తిని పార్లమెంటుకు పంపిస్తే, జగన్ రెడ్డి రాజంపేట ఎంపీ సీటును మిథున్ రెడ్డికి కట్టబెట్టి బలిజలను వంచించారు. తిరుపతి అసెంబ్లీ సీటును తెలుగుదేశం పార్టీ బలిజలకు కేటాయిస్తే, బలిజ వర్గానికి చెందిన సి.రామచంద్రయ్యను రెండు సార్లు రాజ్యసభ్యుడిగా అవకాశం కల్పించాం. పసుపులేటి బ్రహ్మయ్యను మంత్రి పదవి ఇచ్చాం. చదలవాడ కృష్ణమూర్తికి టీటీడీ ఛైర్మన్ గా నియమించాం. బి.కె.సత్యప్రభను ఎమ్మెల్యే సీటు, ఆమె భర్త ఆదికేశవులు నాయుడుని ఎంపీ చేశాం. విద్యా, ఉద్యోగాల కల్పనలో రిజర్వేషన్లు కల్పిస్తామన్న హామీ మేరకు 5శాతం రిజర్వేషన్లు ఇచ్చాం. వైఎస్ గారు రిజర్వేషన్ ఇస్తానని ఇవ్వలేదు. జగన్ ఏకంగా కాపులకు ఇచ్చిన రిజర్వేషన్లు కట్ చేసాడు.
కాపులకు రూ.3,100 కోట్లు ఖర్చుచేశాం!
టిడిపి అధికారంలోక ఉండగా కాపు కార్పొరేషన్ ద్వారా రూ.3100 కోట్లు ఖర్చు చేశాం. ఎన్టీఆర్ విదేశీ విద్యాదరణ పధకం ద్వారా 4,528 మంది విద్యార్ధుల్ని విదేశాల్లో చదివించాం. ఎన్టీఆర్ ఉన్నత విద్యా పథకం ద్వారా రూ.28.26 కోట్లతో 1,413 మంది విద్యార్ధులకు లబ్ధి చేకూర్చాం. కాపు కార్పొరేషన్ ద్వారా 66.50 కోట్లు రుణాలుగా ఇచ్చాం. 33,594 మందికి నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చాం. ఉప ముఖ్యమంత్రి పదవిని కాపులకిచ్చాం. ప్రతి జిల్లాలో రూ.5 కోట్లతో కాపు భవన్‌లను నిర్మించాం. కాపు కార్పొరేషన్ రుణాలకు చేసుకున్న 47వేలకు పైగా దరఖాస్తులను రద్దు చేశారు. కాపులకు కల్పించిన రిజర్వేషన్‌ను రద్దు చేయడం ద్వారా ఉద్యోగాలు కోల్పోయారు. స్కూళ్లు, కాలేజీల్లో రిజర్వేషన్ల ప్రాతిపదికన అందించే వేలాది సీట్లు కాపు విద్యార్ధులు కోల్పోయారు.
కాపుభవన్ లను నిలిపేశారు!
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కాపు భవన్స్ నిర్మాణానికి రూ.165 కోట్లు కేటాయిస్తే.. జగన్ రెడ్డి ఆ నిర్మాణాలను సైతం పూర్తి చేయకుండా ఆపేసాడు. కాపులకు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అమలైన అన్ని పథకాలు రద్దు చేశారు. కాపు నేస్తం అంటూ.. అన్ని వర్గాల్లోని మహిళలకు ఇచ్చే పథకాన్నే కాపులకు ప్రత్యేకంగా ఇస్తున్నట్లు చెబుతున్నారు. రైతు భరోసా పథకాన్ని కాపులకు దూరం చేసి.. రైతుల్ని కూడా కులాల వారీగా విడగొట్టారు. జగన్ కాపు కార్పొరేషన్ నిర్వీర్యం చేసి ఒక్క రూపాయి రుణం ఇవ్వలేదు. కాపులను ఆర్దికంగా, రాజకీయంగా దెబ్బతీశాడు జగన్. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే గతంలో అమలు చేసిన విదేశీ విద్య పథకం, నిరుద్యోగ భృతి మళ్లీ ప్రారంభిస్తాం.
ముఖాముఖి సమావేశంలో వ్యక్తమైన అభిప్రాయాలు:
భూమయ్యపల్లెలో నిర్వహించిన ముఖాముఖి సమావేశంలో పలువురు బలిజ సామాజికవర్గ ప్రతినిధులు తమ సమస్యలను లోకేష్ ఎదుట వ్యక్తీకరించారు. నాగరాజు మాట్లాడుతూ… టిడిపి పాలనలో వచ్చిన రిజర్వేషన్ ను జగన్ తొలగించి తీవ్ర అన్యాయం చేశాడు. దీని వలన విద్య, ఉపాధి అవకాశాలు కోల్పోయాం. మేము అర్డికంగానూ, రాజకీయంగానూ వెనుకబడి ఉన్నాం. నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని కోరాడు. అన్నయ్య మాట్లాడుతూ… రాష్ట్రంలో రాక్షస ప్రభుత్వం వచ్చిన తరువాత బలిజ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడిన విదేశీ విద్య, స్కాలర్ షిప్స్ రద్దు అయ్యి మానసిక ఒత్తిడి కి గురి అవుతున్నారు. విదేశాలు వెళ్లిన వారు ఇబ్బంది పడుతున్నారు. ఉన్నత విద్య చదవడానికి అవకాశం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేశాడు. మనోహర్ మాట్లాడుతూ… వైసిపి పాలనలో కాపు కార్పొరేషన్ ద్వారా ఒక్క రూపాయి రుణం రావడం లేదు. కమ్యూనిటీ భవనాలు నిర్మాణం చెయ్యడానికి ప్రభుత్వం ఎటువంటి సహాయం అందడం లేదు. స్వయం ఉపాధికి జగన్ ప్రభుత్వం లో ఎటువంటి సహాయం అందడం లేదన్నారు. వెంకటగిరి మాట్లాడుతూ… బలిజలని బీసీల్లో చేర్చితేనే మాకు న్యాయం జరుగుతుందని చెప్పారు.
యువనేతను కలిసిన మీ-సేవ నిర్వాహకులు
మైదుకూరు నియోజకవర్గం భూమయ్యపల్లెలో మీ-సేవా నిర్వాహకులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా 11వేలమంది సుమారు రూ.2లక్షలు వెచ్చించి 2011 నుంచి మీ-సేవ కేంద్రాలు నిర్వహిస్తూ ఉపాధి పొందుతున్నాము. వైసిపి ప్రభుత్వం వచ్చాక సచివాలయ వ్యవస్థను ఏర్పాటుచేసి, మీ-సేవ కేంద్రాల్లో ఇచ్చే సర్టిపికెట్లు చెల్లవని చెప్పడంతో మా ఉపాధి పోయింది. కనీసం సచివాలయ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు మీ-సేవ నిర్వాహకులకు ఎటువంటి వెయిటేజి ఇవ్వలేదు. మీ-సేవ అసోసియేషన్ తరపున మేము కోర్టుకు వెళ్లగా, మా సేవలను వినియోగించుకోవాలని తీర్పు చెప్పింది. అయినప్పటికీ ఖాతరుచేయకుండా మా వద్ద 500 సర్వీసులను తొలగించి, 100 సర్వీసులు మాత్రమే పునరుద్దరించారు. ప్రస్తుతం కొన్ని మీ-సేవ కేంద్రాల్లో రోజుకు రూ.200 కూడా రాని పరిస్థితి నెలకొంది. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ పాదయాత్ర సమయంలో మాకు అండగా ఉంటామని చెప్పి, అధికారంలోకి వచ్చాక వదిలివేశారు. మీరు అధికారంలోకి వచ్చాక కోర్టు ఉత్తర్వులు అమలుచేసి, మాకు న్యాయం చేయాలి.
నారా లోకేష్ మాట్లాడుతూ…
మాట తప్పడం, మడమతిప్పడం ముఖ్యమంత్రి జగన్ కు వెన్నతో పెట్టిన విద్య. గత టిడిపి ప్రభుత్వం మీ-సేవ కేంద్రాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలందించాం. మీ-సేవ నిర్వాహకుల ఇబ్బందులను గమనించి గతంలో ప్రభుత్వ కార్యాలయాల్లో స్థలాలు ఇచ్చి, కమీషన్ కూడా పెంచాం. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మీ-సేవ కేంద్రాల సేవలను మరింత సమర్థవంతంగా వినియోగించుకొని ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తాం. మీ-సేవ కేంద్రాల ద్వారా ఇచ్చే సర్టిఫికెట్లను అధికారికంగా గుర్తిస్తాం.
యువనేతను కలిసిన ఎస్సీ సామాజికవర్గీయులు
మైదుకూరు నియోజకవర్గం బుడ్డయ్యపల్లిలో ఎస్సీ సామాజికవర్గీయులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. వైసిపి ప్రభుత్వం ప్రమోషన్ల సందర్భంగా ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ అమలుచేయడం లేదు. గత నాలుగేళ్లుగా ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా ఒక్క లోన్ కూడా మంజూరు చేయలేదు. గత ప్రభుత్వంలో అమలుచేసిన భూమి కొనుగోలు పథకం, అంబేద్కర్ విదేశీ విద్య, బెస్ట్ అవైలబుల్ స్కూల్, స్టడీసర్కిల్స్ వంటి పథకాలను రద్దుచేశారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా బ్యాంకు లింకేజి రుణాలను రద్దుచేశారు. ఎస్సీలకు చెందిన ఎసైన్డ్ భూములను లాక్కున్నారు, ఎస్టీ, ఎస్టీలకు చెందిన వేలకోట్ల సబ్ ప్లాన్ నిధులను దారిమళ్లించారు. ఎన్ఎస్ కెఎఫ్ డిసి ద్వారా గత మూడేళ్లుగా ఒక్క లోన్ కూడా మంజూరు చేయలేదు. జిఓ నెం. 77 తో కన్వీనర్ కోటా వారికి మినహా మిగిలిన విద్యార్థుల ఉన్నత విద్యాభ్యాసానికి ఫీజు రీఎంబర్స్ మెంట్ రద్దుచేశారు. కొన్ని ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులను అభ్యర్థులు లేరని చెబుతూ ఓసిలతో భర్తీచేస్తున్నారు. మెడికల్ అడ్మిషన్లలో బి, సి కేటగిరిల్లో రిజర్వేషన్ అమలుచేయడం లేదు. నూతన పారిశ్రామికవిధానంలో ఎస్సీ, ఎస్టీలకు ఎటువంటి ప్రోత్సాహకాలు ప్రకటించలేదు. మీరు అధికారంలోకి వచ్చాక మాకు న్యాయం చేయండి.
లోకేష్ మాట్లాడుతూ…
గత నాలుగేళ్లలో రూ.33,517 కోట్లరూపాయల ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను దారిమళ్లించిన దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి. ఎస్సీ, ఎస్టీలకు గతంలో అమలుచేసిన 27 సంక్షేమ పథకాలను రద్దుచేశారు. ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నించిన డాక్టర్ సుధాకర్, అచ్చెన్న వంటి వారిని దారుణంగా హతమార్చిన నరహంతక ప్రభుత్వమిది. ఎస్సీ, ఎస్టీలకు చెందిన 12వేల ఎకరాల ఎసైన్డ్ భూములను లాక్కున్నారు. రాష్ట్రచరిత్రలో తొలిసారిగా ఎస్సీల భూమి విస్తీర్ణం తగ్గిపోయిందని గణాంకాలు చెబుతున్నాయి. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే గతంలో అమలుచేసిన సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ పునరుద్దరిస్తాం. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రాయితీలు, పారిశ్రామికవాడల్లో భూములు కేటాయిస్తాం. మీ కోసం పనిచేసే చంద్రన్నను ముఖ్యమంత్రిని చేసేందుకు సహకరించండి.
లోకేష్ ను కలిసిన పత్తూరు గ్రామస్తులు
మైదుకూరు నియోజకవర్గం పత్తూరు గ్రామస్తులు యువనేత నారా లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. మా గ్రామంలో రోడ్లు సరిగా లేవు. సచివాలయం దగ్గర రోడ్లు గుంతలు, మురుగునీటితో ఉంది. వర్షాకాలం నీరు పారే మార్గం లేక, రోడ్లపైనే నీరు నిల్వ ఉండిపోతోంది. శ్మశానం దారి 150 మీటర్లను కొంతమంది ఆక్రమించారు. శవాలను తీసుకుని బురదలో తీసుకెళ్లాల్సివస్తోంది. గ్రామంలో వీధి లైట్లు లేక రాత్రిపూట అవస్థలు పడుతున్నాం. వైసీపీ నేతలు ఉండే ప్రాంతంలోనే వీధిలైట్లు వేస్తున్నారు. పెరిగిన కరెంటు బిల్లులు పెనుభారంగా మారాయి. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారు. మీరు అధికారంలోకి వచ్చాక మా గ్రామ సమస్యలను పరిష్కరించాలి.
లోకేష్ స్పందిస్తూ..
.గత నాలుగేళ్లుగా రాష్ట్రవ్యాప్తంగా పాడైపోయిన రోడ్లపై తట్టమట్టిపోసే దిక్కులేదు. గత టిడిపి ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 25వేల కి.మీ. సిసి రోడ్లు నిర్మించాం. 30లక్షల ఎల్ఇడి లైట్లు ఏర్పాటుచేసి గ్రామాలను కాంతివంతంగా తీర్చిదిద్దాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామాల్లో రోఢ్లు, డ్రైనేజి, వీధి దీపాలు వంటి సౌకర్యాలను కల్పిస్తాం.
లోకేష్ ను కలిసిన దుంపలగట్టు, పాటిమీదపల్లె గ్రామస్తులు
మైదుకూరు నియోజకవర్గం దుంపలగట్టు, పాటిమీదపల్లె గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. మా గ్రామంలో సీసీరోడ్లు, శ్మశాన వాటిక లేవు. తాగునీటి సమస్య అధికంగా ఉంది. దుంపలగట్టులో టోల్ ప్లాజా పెట్టినప్పుడు దుంపలగట్టు హరిజనవాడ, పాటిమీదపల్లె గ్రామసమస్యలు తీరుస్తామని కాంట్రాక్టర్ హామీ ఇచ్చారు. అయితే కాంట్రాక్టర్ పనులను అసంపూర్తిగా వదిలేసి వెళ్లిపోయారు. రోడ్లు,డ్రైనేజి సరిగాలేకపోవడతో వర్షపు నీరు వీధుల్లో నిల్వ ఉండిపోతోంది. నేషనల్ హైవే అధికారులు మా సమస్యల్ని పరిష్కరించకుండా వదిలేశారు. దుంపలగట్టు ఎస్సీకాలనీ, పాటిమీదపల్లె గ్రామాలకు 60మీటర్లు డ్రైన్, 80మీటర్ల సర్వీస్ రోడ్డు, 70మీటర్ల స్లోప్ ప్రొటెక్షన్ వాల్ కావాలి. మీరు అధికారంలోకి వచ్చాక మా సమస్యల్ని పరిష్కరించాలి.
నారా లోకేష్ స్పందిస్తూ…
రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక గ్రామసీమలను పూర్తిగా నిర్వీర్యం చేశారు. సొంత ప్రాంతమైన రాయలసీమలో ప్రజలకు గుక్కెడు నీళ్లివ్వలేని ముఖ్యమంత్రి జగన్. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే దుంపలగట్టు, పాటిమీదపల్లె గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. ప్రతిఇంటికీ కుళాయి అందజేసి తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతాం. గ్రామంలో సిసి రోడ్లు, శ్మశాన వాటికను ఏర్పాటుచేస్తాం.
లోకేష్ ను కలిసిన కొత్తపేట గ్రామ రైతులు
మైదుకూరు నియోజకవర్గం కొత్తపేట గ్రామరైతులు యువనేత నారా లోకేష్ ను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రైతులకు సబ్సిడీపై డ్రిప్ నిలిపేశారు. హార్టీకల్చర్ కు ఇచ్చే సబ్సిడీలను నిలిపివేశారు. పసుపు కొనుగోలు మే నెల చివరిలో ప్రారంభించి రైతులను మోసం చేస్తున్నారు. వ్యాపారులు, దళారులను వైసీపీ నాయకులు పెంచి పోషిస్తున్నారు. మీరు అధికారంలోకి వచ్చాక రైతులను ఆదుకోవాలి.
*నారా లోకేష్ స్పందిస్తూ…*
వ్యవసాయంపై అవగాహన లేని వ్యక్తి సిఎం కావడం రాష్ట్ర రైతాంగానికి శాపంగా మారింది. జగన్మోహన్ రెడ్డి నిర్వాకం కారణంగా రాష్ట్రరైతులు అప్పల్లో జాతీయస్థాయిలో నెం.1గా నిలిచారు. టిడిపి ప్రభుత్వ హయాంలో రూ.70వేలు ఉన్న రైతుల సగటు అప్పు, జగన్ నాలగేళ్ల పాలనలో రూ.2.5లక్షలకు చేరింది. టిడిపి అధికారంలోకి వచ్చాక గతంలో మాదిరిగా డ్రిప్ సబ్సిడీని పునరుద్దరిస్తాం. పంటలకు గిట్టుబాటు ధర కల్పించి దళారీల బెడదను నివారిస్తాం. రైతులకు అన్నదాత పథకం కింద ప్రతిఏటా రూ.20వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తాం. గత టిడిపి హయాంలో రైతులకు అమలుచేసిన పథకాలన్నింటినీ పునరుద్దరిస్తాం.
యువనేతను కలిసిన పసుపు రైతులు
మైదుకూరు నియోజకవర్గం కొత్తపేట బెరుం కాలేజి వద్ద చెముళ్లపల్లికి చెందిన పసుపురైతులు యువనేత లోకేష్ ను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. మా ప్రాంతంలో పసుపు పండించే రైతులు అధికంగా ఉన్నారు. ఎకరా పసుపు పంటకు లక్ష నుండి రూ.1.20లక్షల వరకు ఖర్చవుతోంది. TDP పాలనలో పసుపు రైతులు లాభసాటిగా వ్యవసాయం చేశారు. వైసీపీ అధికారంలోకి వస్తే క్వింటా పసుపుకి రూ.7,500 వరకు గిట్టుబాటు ధర ఇస్తానని చెప్పిన జగన్ ముఖం చాటేశారు. దళారులు క్వింటా పసుపును రూ.5,600 లోపు ధరకు కొనుగోలు చేస్తున్నారు. ఒక పసుపు రైతుకు కేవలం 25క్వింటాళ్ల కొనుగోలుకు మాత్రమే టోకెన్లు ఇస్తున్నారు. ఆపైన పంట ఉంటే దళారులు చెప్పిన ధరకు పంటను అమ్ముకోవాల్సివస్తోంది. పసుపు రైతులకు నేడు పెట్టుబడి ఖర్చులు కూడా రాక ఇబ్బందులు పడుతున్నారు. అప్పుల బాధతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చాలామంది రైతులు వ్యవసాయం చేయలేక కూలి పనులకు వెళ్లాల్సిన దుస్థితి వచ్చింది. టీడీపీ అధికారంలోకి వచ్చాక పసుపు రైతులను ఆదుకోవాలి.
నారా లోకేష్ స్పందిస్తూ…
రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దళారులదే రాజ్యంగా మారింది. పాదయాత్ర సమయంలో రూ.3,500 కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటుచేసి, ఆదుకుంటానని చెప్పిన సిఎం ఆ తర్వాత తాడేపల్లి ప్యాలెస్ కు పరిమితమయ్యారు. గత నాలుగేళ్లలో అన్నదాతలు నష్టాలపాలై ఆత్మహత్యల్లో దేశవ్యాప్తంగా 3వస్థానంలో ఉన్నారు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులు పండించిన పంట మొత్తాన్ని గిట్టుబాటు ధరకు కొనుగోలు చేస్తాం. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ వ్యవసాయ మార్కెట్లలో దళారీ వ్యవస్థను నిర్మూలిస్తాం. కోల్డ్ స్టోరేజిలు ఏర్పాటుచేసి పంటలకు గిట్టుబాటు ధర వచ్చేవరకు నిల్వచేసుకునే అవకాశం కల్పిస్తాం. అన్నదాత పథకం కింద రూ.20వేలు, వ్యవసాయ సబ్సిడీలను అందజేసి రైతులను ఆదుకుంటాం. మీ అందరి సంక్షేమం కోసం కృషిచేసే చంద్రన్నను సిఎం చేసేందుకు మీ వంతు సహకారం అందించండి.
లోకేష్ ను కలిసిన చెన్నముక్కపల్లి గ్రామస్తులు
మైదుకూరు నియోజకవర్గం చెన్నముక్కపల్లి గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మా గ్రామంలో 2022 జూన్ 21న ఇసుక క్వారీకి అనుమతి ఇచ్చారు. జయప్రకాష్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ వాళ్లు నిబంధనలు, ప్రభుత్వ అనుమతులను ఉల్లంఘించి ఇసుక తవ్వకాలు జరిపారు. 7నెలలకే 6లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను అక్రమంగా రవాణా చేశారు. ఇసుక తవ్వకాల వల్ల ఖాజీపేట, చాపాడు, మైదుకూరు మండలాల్లో 23గ్రామాలకు నీరు వెళ్లే పైపులైనులు పాడుచేశారు. అడ్డగోలు ఇసుక తవ్వకాల వల్ల నీటివనరులు అడగంటి మంచినీటికి కటకటలాడే పరిస్థితి నెలకొంది. ఇసుక అక్రమ తవ్వకాల వల్ల 2 గ్రామాలకు తాగునీటి సమస్య ఏర్పడింది. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఇసుక అక్రమాలకు అడ్డుకట్ట వేయాలి. ప్రజల తాగునీటి సమస్యను పరిష్కరించాలి.
నారా లోకేష్ స్పందిస్తూ…
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కారణంగా రాష్ట్రంలో 40లక్షలమంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డునపడ్డారు. అడ్డగోలు ఇసుక తవ్వకాల కోసం గేట్లు ఎత్తకపోవడంతో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి 61మంది అమాయకులు బలయ్యారు. గత నాలుగేళ్లుగా ఇసుకపై ముఖ్యమంత్రి జగన్, ఆయన సామంతరాజులు రూ.10వేల కోట్లు దోచుకున్నారు. టిడిపి అధికారంలోకి రాగానే అడ్డగోలు ఇసుక తవ్వకాలను క్రమబద్దీకరించి, తాగునీటి వనరులను పరిరక్షిస్తాం. ఇసుక అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతాం, ఇసుక పాలసీని సరళీకరించి నిర్మాణరంగాన్ని పరుగులు తీయిస్తాం.
Also Read This Blog: Trailblazing Youth Empowerment: The Yuvagalam Padayatra Story
Tagged: #LokeshPadaYatra#Padayatra#YuvaGalamLokesh#YuvaGalam#NaraLokeshPadaYatra#NaraLokesh